జగన్ వర్సెస్ షర్మిల.. ఏపీ నాడి తెలిసే చేస్తున్నారా.. !
వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల మధ్య వారసత్వ పోరు తెరమీదికి వచ్చింది.
By: Garuda Media | 12 Sept 2025 4:00 PM ISTవైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల మధ్య వారసత్వ పోరు తెరమీదికి వచ్చింది. వైఎస్ వారసత్వం తమదేనని.. తమ కుమారుడే.. వైఎస్‌కు అసలు సిసలు రాజకీయ వారసుడని షర్మిల ప్రకటిం చారు. ఇక, ఇప్పటి వరకు వ్యాపారాలు చేసినా.. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినా.. తాను వైఎస్ వారసు డిగానే ప్రజలకు చేరువ అవుతున్నట్టు జగన్ చెప్పుకొస్తున్నారు.ఈ పరిణామాలపై అన్నాచెల్లి ఎలా ఉన్నా.. ఎన్ని వాదనలు చేసుకున్నా.. చివరకు వారసత్వం తేల్చాల్సింది.. మాత్రం ప్రజలే.
ప్రజలు నమ్మి.. ఒప్పుకొని ఆశీర్వదిస్తేనే వైఎస్ వారసత్వం ఎవరికనేది దక్కుతుంది. అయితే.. ఈ విషయంలో పర స్పరం కీచులాడుకుంటే.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని రోడ్డెక్కితే.. చివరకు ఇద్దరినీ కూడా ప్రజలు పక్కన పెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు అన్న నందమూరి వారసుడిని నేనే అంటూ.. అప్పట్లో హరికృష్ణ వచ్చారు. అన్న తెలుగు దేశం పార్టీ పెట్టారు. ఇదేసమయంలో కాదు, అసలు సిసలు వారసత్వంనాదే అంటే.. లక్ష్మీపార్వతి ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ అంటూ.. ఆమె మరో పార్టీ పెట్టారు.
ఈ ఇద్దరి కీచులాటలను ప్రజలు సహించలేక పోయారు. ఫలితంగా.. అసలు సిసలు టీడీపీ చంద్రబాబు దేనని తేల్చేశారు. ఫలితంగా హరికృష్ణ, లక్ష్మీపార్వతులు ఇద్దరూ పార్టీలను ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిణామాలే తెరమీదికి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రజలు కీచులాటలను సహించరు.. సహకరించరు కూడా. 2019 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ , బీజేపీలు కీచులాడుకున్నారు. ఎవరికి వారు రాజకీయాలు చేసుకున్నారు. ఫలితంగా ప్రజలు ఈ మూడు పార్టీలను పక్కన పెట్టారు.
అదే.. 2024కు వచ్చే సరికి.. మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు రావడంతో నెత్తిన పెట్టుకున్నారు. సో.. దీనిని బట్టి ఏపీ ప్రజల నాడి.. కీచులాటలకు.. వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వదన్న విషయం స్పష్టం అవుతూనే ఉంది. ఈ విషయాన్ని అటు షర్మిల.. ఇటు జగన్ కూడా మరిచిపోయినట్టు తెలుస్తోంది. అయితే.. షర్మిల కీచులాడినా.. ఏం చేసినా.. ప్రజలు ఆమెను ఆదరించినా.. ఆదరించకపోయినా.. ఇబ్బంది లేదు. ఎటొచ్చీ.. జగన్ మాత్రం జాగ్రత్త పడకపోతే.. కీచులాటకు దిగి.. యాగీ చేస్తే.. అది ఆయనకు .. వైసీపీకి కూడా తీవ్రనష్టం జరిగే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వేసే ప్రతి అడుగు మరింత జాగ్రత్తగా పడాల్సిన అవసపరం ఉందని అంటున్నారు.
