Begin typing your search above and press return to search.

షర్ట్ మడత బెట్టా...ఎవరొస్తారో రండి...జగన్ బిగ్ సౌండ్ !

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ సౌండ్ చేశారు. అది కూడా తన సొంత ఇలాకా తాను ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల నుంచి ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు భారీ సవాల్ నే విసిరారు.

By:  Satya P   |   27 Oct 2026 8:47 PM IST
షర్ట్ మడత బెట్టా...ఎవరొస్తారో రండి...జగన్ బిగ్ సౌండ్ !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ సౌండ్ చేశారు. అది కూడా తన సొంత ఇలాకా తాను ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల నుంచి ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు భారీ సవాల్ నే విసిరారు. ఆయన పార్టీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతూ నేను ఇక్కడే ఉంటా, షర్ట్ మడత బెట్టా, ఎవరొస్తారో రండి అంటూ ఏకంగా చాలెంజ్ విసిరారు. జగన్ చేసిన ఈ బిగ్ సౌండ్ కి క్యాడర్ మొత్తం హుషార్ అయింది. జగన్ నుంచి చాన్నాళ్ళకు ఈ తరహా తీవ్ర స్వరాన్ని విన్నామని కూడా అంటున్నారు. ఇటీవల కాలంలో నామినేషన్ల పర్వంలో పులివెందుల సహా కడప జిల్లాలో రాయలసీమలో కూడా అనేక చోట్ల వైసీపీ నేతలకు నామినేషన్లు దాఖలు చేసే చాన్స్ దక్కలేదని ఆ పార్టీ అంటోంది. దానికి ప్రతి ధ్వనిగా జగన్ తాజా సవాల్ ఉందని అంటున్నారు.

క్యాడర్ ని చూసి :

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. వైసీపీ క్యాడర్ అయితే గ్రౌండ్ లెవెల్ లో తీవ్ర స్థాయిలో పోరాడింది. రెండున్నరేళ్ళుగా స్థబ్దుగా ఉందని అనుకున్న కార్యకర్తలలో ఒక్కసారిగా కనిపించిన ఈ ఫైర్ ని చూసి వైసీపీ అధినాయకత్వమే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలీ అంటే జగన్ లో ఫైర్ ని రీచార్జ్ చేసింది క్యాడర్ పోరాటం అని విశ్లేషిస్తున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో భారీ ఓటమి తరువాత జగన్ కూడా పెద్దగా జనంలోకి వచ్చింది తక్కువ. పార్టీ సైతం డీమోరలైజ్ అయింది అని అంతా అనుకునే నేపధ్యం ఉంది. దాంతో పాటుగా అప్రతిహతమైన అధికారంతో 164 సీట్లతో మూడు పార్టీలతో అధికారలో కూటమి అత్యంత బలంగా ఉంది. దాంతో వైసీపీ చతికిలపడింది అని అంతా అనుకున్నారు.

జగన్ వ్యూహం అది :

ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ పోటీ చేయకపోవచ్చు అని రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. పోటీ చేసినా వైసీపీకి ఒరిగేది ఏముంది అధికార పార్టీకే అన్ని విధాలుగా అండదండలు ఉన్నాయి కాబట్టి ఎటూ వారే గెలుస్తారు అని కూడా భావిస్తూ వచ్చారు. సరిగ్గా ఇక్కడే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే క్యాడర్ లో కసి పెరగాలని అది అలా సజీవంగా ఉంచగలిగితే 2029 ఎన్నికల్లో పార్టీకి భారీగా రాజకీయ లబ్ది చేకూరుతుందని ఆయన అంచనా వేసుకున్నారు. అందుకే ఏకగ్రీవాలు వద్దు అంటూనే పార్టీ నేతలను ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులను నిలబెట్టమని పదే పదే కోరారు. అలా జగన్ వేసిన వ్యూహం అయితే సక్సెస్ అయింది. అంతే కాదు జగన్ అంచనాలకు మించి మరీ వైసీపీ క్యాడర్ తమలోని ఫైర్ ని చూపించింది. దాంతో అధినాయకత్వంలో సైతం పార్టీ కోసం కార్యకర్త ఇంతలా నిలిచి పోరాడుతున్నారా అన్నది కూడా చర్చగా సాగింది.

క్యాడర్ రగిలించింది :

దాంతో వైసీపీ అధినాయకత్వం క్యాడర్ లో ఫైర్ ని చూడాలని అనుకుంటే వారు అంతకు పదింతలుగా మారి హైకమాండ్ కే కొత్త ఫైర్ రగిలించేలా చేశారు అని అంటున్నారు. దాని ఫలితమే తన సొంత గడ్డ పులివెందులలో జగన్ చేసిన ఈ బిగ్ సౌండ్ అని అంటున్నారు. ప్రత్యర్ధులతో కార్యకర్తలు తెగించి పోరాడారు, అందుకే వారిని అండగా తాను ఉన్నాను అని జగన్ చెబుతూ షర్ట్ మడత బెట్టా ఎవరొస్తారో రండి అని భారీ రాజకీయ సవాల్ చేశారు అని అంటున్నారు. జగన్ చేసిన ఈ ప్రకటన క్యాడర్ లో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది అని అంటున్నారు. జగన్ కూడా క్యాడర్ లో కసి ఈ రేంజిలో ఉంటే లీడర్ గా తన ఫైర్ దానికి పెర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా ఈ బిగ్ సౌండ్ చేశారు అని అంటున్నారు.

ఇది కదా కావాల్సింది :

నిజానికి గతంలో ఉన్న ఫైర్ జగన్ లో లేదని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. 2024 తరువాత అధినేత ఎందుకో కొంత తగ్గారని కూడా అంటూ వస్తున్న నేపధ్యం ఉంది. అయితే అఫ్ కోర్స్ ఇది ఒక విధంగా జగన్ వ్యూహం కావచ్చు. కానీ సగం కాలం గడచిపోయిన నేపధ్యంలో ఇపుడు క్యాడర్ లో ఆవేశం ఉప్పొంగుతోంది. అది అధినాయకత్వాన్ని కూడా ఫైర్ బ్రాండ్ గా మారుస్తోంది అంటున్నారు. ఇక పులివెందులలో జగన్ అనేకసార్లు కార్యకర్త గురించి తలచుకున్నారు. జగన్ ఒకటి అయితే కార్యకర్త రెండు అన్నారు. అందుకే జగన్ 2.0 అని జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కడం ఖాయమని వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తే టాప్ ప్లేస్ లో ఉంటాడు అని కూడా జగన్ కీలకమైన కామెంట్స్ చేసి క్యాడర్ కి హుషారెత్తించారు.

ఏకగ్రీవాలు అయిన చోట :

పులివెందులలో ఏకగ్రీవాలు అయ్యాయి. మునిసిపాలిటీలో 40 వార్డులు ఉంటే 20 దాకా కూటమికి ఏకగ్రీవంగా దక్కాయి. అలాగే మండలంలో 64 ఎంపీటీసీలకు గానూ 63 కూటమి పరం అయ్యాయి. దాంతో ఎక్కడా వైసీపీకి నో చాన్స్ అన్నట్లుగానే ఉంది. బహుశా దీనిని కూడా దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ తరహా హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఎవరు వస్తారో రండి అని ఆయన చాలెంజ్ చేశారు. ఇక జగన్ ఓటు పులివెందులలో ఉంది. దాంతో ఆయన ఓటు వేయడమే కాదు పోలింగ్ వేళ క్యాడర్ కి అండగా తానే ముందు వరసలో ఉంటాను అని గట్టి భరోసా ఇచ్చారు. ఈ విధంగా జగన్ ఇచ్చిన సందేశం ఆయన చేసీ పెను సవాల్ ఏపీలోని మొత్తం వైసీపీ క్యాడర్ కి చేరే విధంగా ఉందని అంటున్నారు.