Begin typing your search above and press return to search.

ఎన్డీయే బిల్లుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం...జగన్ !

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. అపుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది.

By:  Satya P   |   18 Oct 2026 7:41 PM IST
ఎన్డీయే  బిల్లుకు   మద్దతు ఇచ్చి తప్పు చేశాం...జగన్ !
X

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. అపుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది. 2023లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి సవరణ బిల్లుని ఎన్డీయే ప్రతిపాదించింది. పాత 1991 చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లుకు మద్దతుని వైసీపీ ఇచ్చింది. దాని మీద మరోసారి జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి తాము తప్పు చేశామని మీడియా సమావేశంలో జగన్ స్పష్టం చేశారు. ఇపుడు తాము బాధపడుతున్నామని కూడా హాట్ కామెంట్స్ చేశారు.

న్యూట్రల్ గా నియామకం :

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లు కానీ నియామకం అన్నది న్యూట్రల్ గానే సాగాలని జగన్ అన్నారు. ఈ విషయంలో అధికార పార్టీల ప్రమేయం ఉండరాదని వారు నియమించకూడదని ఆయన స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోనే ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం జరగాలని జగన్ కోరారు. ఇదిలా ఉంటే జగన్ తాజా వ్యాఖ్యలతో కేంద్ర ఎన్నికల సంఘం మీద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద సీజేపీ సహా జాతీయ విపక్షాలు చేస్తున్న ఆందోళనను మరోసారి సమర్ధించినట్లు అయింది. అదే సమయంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2023లో తెచ్చిన సవరణ బిల్లుని తప్పు పట్టినట్లు అయింది అని అంటున్నారు.

ఈ బిల్లులో సవరణలు :

ఇక చూస్తే కనుక 2023లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకుని వచ్చింది. సుప్రీంకోర్టు ఆనాడు ఇచ్చిన తన తాత్కాలిక తీర్పులో నియామక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధాని సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని సభ్యుడిగా చేర్చారు. ఈ బిల్లును 2023 డిసెంబర్ 12న రాజ్యసభ ఆమోదిస్తే డిసెంబర్ 21న లోక్‌సభ ఆమోదించింది. డిసెంబర్ 28న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత ఈ చట్టం 2024 జనవరి 2 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తిని తొలగించి కేబినెట్ మంత్రిని చేర్చడం ద్వారా నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లభిస్తుందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ఆనాడు మద్దతు ఇచ్చిన వైసీపీ ఇపుడు తాను బాధపడుతున్నాను అని అంటోంది. మళ్లీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కమిటీలోకి తీసుకోవాలని కోరుతోంది.

తప్పులు చేసి గ్రహించాం :

ఎన్నికల వ్యవస్థలో తప్పులు జరిగిన తరువాతనే తాము గ్రహించామని అందుకే మార్చాలని అడుగుతున్నామని జగన్ అన్నారు. ఎన్నికల వ్యవస్థ పట్ల అందరికీ నమ్మకం ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర ఎన్నికల సంస్ఘంలో కూడా ఈ విధానం రావాలి. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ చేయకూడదు. కేంద్రంలో గతంలో ఉన్న విధానం రాష్ట్రంలో రావాలీ అంటే న్యాయమూర్తులు కమిటీలో ఉండాలని జగన్ ప్రతిపాదించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా కమిటీ ఉంటేనే పారదర్శకంగా ఎన్నికల సంఘం నియామకాలు జరుగుతాయని జగన్ అభిప్రాయపడ్డారు. ఇది అనివార్యం అంటున్నారు.

నిమ్మగడ్డ ఆధ్వర్యంలో :

తాము చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించామని జగన్ చెప్పారు. ఇపుడు చంద్రబాబు తాను అపాయింట్మెంట్ చేసిన ఎన్నికల సంఘం అధికారితో ఎన్నికలు జరిపిస్తున్నారని ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నా ఎవరూ మాట్లాడటం లేదని జగన్ విమర్శించారు. ఏది ఏమైనా ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు రావాలని జగన్ కోరారు. అదే సమయంలో ఆయన కేంద్రంలో సీఈసీ నియామక బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం మీద కూడా మరోసారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాత విధానం రావాలని కోరుకున్నారు.దీంతో జగన్ మరింత క్లారిటీ ఇచ్చినట్లు అయింది.