Begin typing your search above and press return to search.

జగన్ రికార్డు బద్ధలు కొడుతున్నారా...అయితే రిజల్ట్ ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ది ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నమైన వైఖరి. ఆయన ఎవరి దగ్గర రాజకీయం నేర్చుకోలేదు.

By:  Satya P   |   27 Oct 2025 7:00 PM IST
జగన్ రికార్డు బద్ధలు కొడుతున్నారా...అయితే రిజల్ట్ ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ది ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నమైన వైఖరి. ఆయన ఎవరి దగ్గర రాజకీయం నేర్చుకోలేదు. దాంతో తనదైన రాజకీయాన్ని ఆయన అమలు చేసి చూపిస్తున్నారు. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉంటాయి. అలాగే రాజకీయం లో నిరంతరం మార్పులు ఉంటాయి దాంతో పూర్తిగా విధానాలు కాకపోయినా అభిప్రాయాల వరకైనా మార్చుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. జగన్ విషయంలో మాత్రం తాను ఎన్ని సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఒకసారి డెసిషన్ తీసుకుంటే మాత్రం మళ్ళీ వెనక్కి తగ్గేది అయితే ఉండదని అంటారు.

అసెంబ్లీకి నో :

జగన్ ఈసారి అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అంతకు ముందు అసెంబ్లీలో 151 సీట్లు ప్లస్ మరి కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తానికి మొత్తం అసెంబ్లీని తన వైపు తిప్పుకుని పూర్తిగా పాలించిన జగన్ కి 2024 తరువాత ఏర్పడిన అసెంబ్లీ మాత్రం ఉల్టా అయింది. కేవలం 11 సీట్లతోనే ఆయన పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో విపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పారు. కానీ ఇవ్వలేమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. దాంతో జగన్ అసెంబ్లీకి రావడం మానుకున్నారు. దీని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ మొదలైన ప్రతీ సారి బిగ్ డిస్కషన్స్ సాగుతూ ఉంటాయి. ఆ సంగతి అలా ఉంచితే జగన్ మరి కొన్ని విషయాలలో ఆసక్తిని పెంచేస్తున్నారు.

మీడియా మీట్ తో :

తాను అసెంబ్లీలో చెప్పాలనుకుంటున్నవి అడగాలనుకుంటున్నవి ఆయన మీడియా మీట్ పెట్టి అక్కడే అన్నీ విడమరచి చెబుతున్నారు. అంతే కాదు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. అలా జగన్ చాలా కాలంగా చేస్తున్నారు. జగన్ కనీసంగా నెలకు ఒక ప్రెస్ మీట్ ఈ విధంగా పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆ నెలలో జరిగిన అన్ని ముఖ్య అంశాలను ఒకేసారి ముందుకు తెచ్చి వైసీపీ స్టాండ్ ఏమిటి అన్నది చెబుతారు. అలాగే ప్రభ్తువం చేసే తప్పులు ఏమిటి అన్నది కూడా విస్పష్టంగా తమ పార్టీ కోణం నుంచి చెబుతారు. ఈ విధంగా జగన్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు అయితే సరికొత్త రికార్డులనే తిరగరాస్తున్నాయని అంటున్నారు.

గంటల తరబడి :

జగన్ ప్రెస్ మీట్ పెట్టారు అన్నది గతంలో ఉన్న మాట. అది నిజం అన్నట్లుగా ఆయన సీఎంగా ఉండగా ఎపుడూ మీడియాను పలకరించింది లేదు. దానికి కారణాలు ఎవరికీ తెలియవు. ఇపుడు విపక్షంలోకి వచ్చాక జగన్ మీడియా సమావేశాలు బాగానే పెడుతున్నాయి. అయితే అవి కాస్తా గంటల తరబడి సాగిపోతున్నాయి అని అంటున్నారు. సాధారణంగా మీడియా సమావేశాలు ఎక్కువ సేపు నిర్వహించే ఏపీ లీడర్లలో చంద్రబాబు ముందుంటారు ఆయన గంటకు తగ్గకుండా మాట్లాడుతారు. అయితే బాబునే మించే విధంగా జగన్ ప్రెస్ మీట్లు సాగుతున్నాయని అంటున్నారు. ఆయన ఏకంగా తాజా మీడియా సమావేశం రెండున్నర గంటల పాటు నిర్వహించారు. ఇది ఒక విధంగా రికార్డు బద్ధలు కొట్టేదే అంటున్నారు. ఇంతసేపూ సుదీర్ఘంగా ఎవరైనా మీడియా భేటీ నిర్వహించారో లేదో తెలియదు కానీ జగన్ ది మాత్రం హైలెట్ అయింది.

టీడీపీ సెటైర్లు :

గంటల తరబడి మీడియా భేటీలు నిర్వహించడం మీద టీడీపీ సెటైర్లు వేసింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే జగన్ కి ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఆయనలో ఏదో తేడాగా ఉందని ఆయన అంత సేపూ అలా మీటింగులు పెట్టడమేంటి అని ఎకసెక్కమాడారు. జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా ఈ విధంగా మీటింగులు గంటల కొద్దీ ఎందుకు పెడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్ అసహనంతో అబద్ధాలతో ఇలా గంటల కొద్దీ మీడియా ముందు మాట్లాడుతున్నారని కూడా సోమిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనుకుని చేస్తున్న ఈ విన్యాసాలు వికటిస్తున్నాయని అంటున్నారు. ఆయన అన్నారని కాదు కానీ ఇంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్ల ద్వారా జగన్ అన్ని విషయాలు ఒకేసారి కలగలిపి చెప్పడం వల్ల జనంలోకి ఏమైనా వెళ్తున్నాయా రిజల్ట్ ఏమైనా వస్తోందా అన్నదే పార్టీలోపలా బయటా చర్చగా ఉందిట.