Begin typing your search above and press return to search.

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడిన వైఎస్ జగన్ లండన్ పర్యటన డిసెంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కుమార్తెలను కలిసేందుకు 15 రోజుల పాటు వెళ్లనున్నట్లు సమాచారం. జనవరి 2027 నుంచి తాడేపల్లిలో పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వైసీపీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

By:  Satya P   |   19 Nov 2026 8:43 AM IST
జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ నవంబర్ లో ఉంటుంది అని అనుకున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు కూడా విదేశీ పర్యటనకు అనుమతించింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు మొదలైంది. అది కాస్తా డిసెంబర్ 2 దాకా కొనసాగుతుంది. దాంతో జగన్ పర్యటన కూడా వాయిదా పడింది. అయితే ఇపుడు మరో సారి జగన్ లండన్ టూర్ గురించి చర్చ సాగుతోంది. జగన్ ఈ డిసెంబర్ మొదటి వారంలో లండన్ టూర్ పెట్టుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

కొంత విరామంగా :

జగన్ తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన అక్కడ తమ కుమార్తెలను కలవడానికి వెళ్తున్నారు అని తెలుస్తోంది. గతంలో కూడా 2026 ఏప్రిల్ చివరలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 15 రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇపుడు మరోసారి ఆయన వెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళీ 2029 దాకా జగన్ పాదయాత్ర రాజకీయాలు వీటి మధ్యనే గడుపుతారు అని అంటున్నారు. అందుకే ఈసారి పదిహేను రోజుల పాటు ట్రిప్ ని షెడ్యూల్ చేశారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జగన్ ఈ మధ్య కాలం అంతా రాజకీయంగా కొంత విరామం లేకుండా గడిపారు అని అంటున్నారు.

డిసెంబర్ అంతా :

ఇదిలా ఉంటే డిసెంబర్ నెల అంతటా జగన్ ఫుల్ బిజీగా గడుపుతారు అని అంటున్నారు. దాంతో రానున్న కొన్ని వారాల్లో జగన్ పలు వ్యక్తిగత కార్యక్రమాలు ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారంగా చెబుతున్నారు. ఆయన ఆయన డిసెంబర్ మొదటి వారంలో లండన్‌కు వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన తర్వాత క్రిస్మస్ సందర్భంగా పులివెందులకు వెళ్ళి అక్కడ మూడు రోజుల పాటు గడుపుతారు అని అంటున్నారు. ఇక ఈ మధ్యలోనే జగన్ పుట్టిన రోజు కూడా డిసెంబర్ 21న వస్తుంది అని అంటున్నారు. దాంతో ఈ ఏడాది చివరి నెల అలా బిజీగా సాగిపోతుందని అంటున్నారు.

కొత్త ఏడాది నుంచి :

ఇక వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు 2027 జనవరి నుంచే జగన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. అలా చూస్తే కనుక సంక్రాంతి తర్వాత పార్టీ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించడానికి జగన్ సంసిద్ధం అవుతున్నారని భోగట్టా. అలాగే వైసీపీని సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఆయన ఇక మీదట అంతా తాడేపల్లి లో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో సమగ్ర సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు కూడా జగన్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ పనితీరు అసంతృప్తికరంగా ఉన్న ప్రాంతాల్లోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మార్చి వేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు అని అంటున్నారు. అలా సంస్థాగతంగా సమూల మార్పులు చేపట్టాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారంగా ఉంది.

క్యాడర్ తో జగన్ :

అంతే కాదు కొత్త ఏడాది నుంచి జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అలా 2027 మార్చికి ముందే నియోజకవర్గ స్థాయి నాయకులతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహించాలని కూడా జగన్ ప్రణాళికలను రూపొందించుకున్నారు. అంతే కాదు ఒక విధంగా వైసీపీ ఓటమి తరువాత గత రెండున్నరేళ్లుగా పార్టీ ప్రతినిధుల పనితీరుపై ఆయన సమగ్రమైన సమీక్ష చేపడతారు అని అంటున్నారు. అలా ఇంచార్జిలతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించడానికి ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు.