జగన్ వన్ టూ వన్...డీప్ డిస్కషన్స్...వెరీ సీరియస్ !
వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక ఎన్నికల విషయంలో వెరీ సీరియస్ గా ఉన్నారు. ఆ విషయం పార్టీ వారికి కూడా మెల్లగా అర్ధం అవుతోంది.
By: Satya P | 1 Oct 2026 2:00 PM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక ఎన్నికల విషయంలో వెరీ సీరియస్ గా ఉన్నారు. ఆ విషయం పార్టీ వారికి కూడా మెల్లగా అర్ధం అవుతోంది. స్థానిక ఎన్నికలలో ఎటూ అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది కదా అని భావించి ప్రతిపక్షం పెద్దగా సీన్ లోకి రాదు అని గతంలో ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా వైసీపీ దూసుకుని వస్తోంది. అంతే కాదు లోకల్ బాడీ ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకోవాలని అనుకుంటోంది. రెండేళ్లకే కూటమి పాలన మీద జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినాయకత్వం అభిప్రాయంగా ఉంది. అంతే కాదు కూటమిలో లుకలుకలు ఉన్నాయని గ్రౌండ్ లెవెల్ లో కో ఆర్డినేషన్ పెద్దగా ఉండకపోవచ్చని అన్నీ అనుకూలిస్తే కనుక గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా వైసీపీ రాజకీయ దశ తిరగావచ్చు అన్నదే ఆ పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది.
ముఖా ముఖీకి :
వైసీపీ అధినేత జగన్ ముఖా ముఖీ చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటిదాకా పార్టీ నేతలను పిలిచి వారితో సమావేశాలు నిర్వహించి పార్టీ విధానాల గురించి చెబుతూ ఎలా వ్యవహరించాలి అన్నది దిశా నిర్దేశం చేసేవారు. అయితే ఈసారి మాత్రం ముఖా ముఖీ గా భేటీలు ఉంటాయని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు కీలక తీర్పులు వెలువరించిన తరుణంలో వైసీపీ నిర్వహిస్తున్న పార్టీ నేతల సమావేశం దానితో పాటు వన్ టూ వన్ గా జగన్ నాయకులతో భేటీ అవుతారు అన్న వార్తలు అయితే రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. జిల్లా అధ్యక్షులు రీజనల్ కో ఆర్డినేటర్లను జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పిలిపించి మరీ ఈ భేటీలు వేస్తున్నారు.
గ్రౌండ్ లెవెల్ రియాలిటీ :
జగన్ వన్ టూ వన్ భేటీల వెనక గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకునే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చూస్తే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మేయర్, జెడ్పీ చైర్మన్ అభ్యర్ధి వరకూ వైసీపీకి అన్నీ చర్చకు వస్తాయని అంటున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయడం అలాగే ఆశావహులను గుర్తిస్తూ పార్టీ నేతలు తయారు చేసిన నివేదికలను కూడా పరిశీలించడం వంటివి ఉంటాయని అంటున్నారు. ప్రతీ సీటుకూ పోటీ కోసం ముగ్గురు ఆశావహులతో షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. దాని ప్రకారం ఆ ముగ్గురి నుంచి ఒక్కరిని కీలక పదవి కోసం పోటీకి ఎంపిక చేస్తారు అని అంటున్నారు.
లోతుల్లోకి వెళ్తూనే :
ప్రతీ గ్రామ పంచాయతీ అలాగే ఎంపీటీసీలు జెడ్పీటీసీల పరిధిలో ఏమి జరుగుతోంది, కూటమి పార్టీల బలం ఎంత అన్నది కూడా ఈ సందర్భంగా చర్చిస్తారు అని అంటున్నారు. అలాగే అక్కడ సామాజిక రాజకీయ పరిస్థితులను కూడా ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగుతారని తెలుస్తోంది. మరో వైపు చూస్తే బీసీ రిజర్వేషన్ల మీద ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విషయం మీద కూడా వైసీపీ చర్చిస్తుందని అంటున్నారు.
లైట్ తీసుకోవద్దనే :
స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకోవద్దనే జగన్ పదే పదే చెబుతున్నారు. అధికార పార్టీ అన్ని విధాలుగా బలగాలతో వచ్చినా ధీటుగా ఎదుర్కోవాల్సిందే అని జగన్ సందేశం ఇస్తున్నారు. అంతే కాదు, ఈ ఎన్నికలు పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని తీసుకుని వస్తాయని చెబుతున్నారు. గట్టిగా కసిగా కూటమి మీద పోరాడడం అన్నది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నియోజకవర్గం వరకూ క్యాడర్ లో పెరిగితే అది భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారీ రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తుందన్నది అధినాయకత్వం వ్యూహంగా ఉంది. మొత్తం మీద చూస్తే పార్టీ నేతలతో జగన్ జరిపే వన్ టూ వన్ లో భేటీలు అయితే ఆసక్తిని పెంచుతున్నాయి.
