Begin typing your search above and press return to search.

జగన్ బర్త్ డే కి వేయి కోట్లు ఖర్చు అయిందా ?

జగన్ బర్త్ డే వేళ టీవీలకు ఇతర మీడియా సంస్థలకు ఇచ్చిన యాడ్స్ అయితే కుమ్మేశాయని అంటున్నారు.

By:  Satya P   |   30 Dec 2025 9:45 AM IST
జగన్ బర్త్ డే కి వేయి కోట్లు ఖర్చు అయిందా ?
X

వైఎస్ జగన్ బర్త్ డే ఈసారి అంటే 2025లో జరిగినంత ధూం ధాం గా గతంలో ఎన్నడూ జరగలేదు అన్నది అంతా అంటున్న మాట. ఇంకా చెప్పలీ అంటే జగన్ ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారంతో బంపర్ మెజారిటీతో అయిదేళ్ల పాటు ఉన్నారు. ఇక పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా కూడా వైసీపీకి చెందిన వారే అంతటా ఉన్న నేపధ్యం ఆనాడు ఉంది. పూర్తిగా ఏకపక్షంగా ఏపీ రాజకీయం సాగిన రోజులలో సైతం ఇంతలా జగన్ బర్త్ డే వేడుకలు అయితే నిర్వహించినది లేదు. కానీ జగన్ నాయకత్వంలో వైసీపీ ఓటమి పాలు అయి 18 నెలలు మాత్రమే అయింది. ఇంకా ఆ చేదు అనుభవం కళ్ళ ముందే ఉంది. ఇంతలో ఎంత మార్పు అన్నట్లుగా ఈసారి జగన్ బర్త్ డేని అంగరంగ వైభవంగా ప్రతీ గల్లీలోనూ నిర్వహించారు పల్లె నుంచి పట్నం దాకా సంబరాలు చేశారు ఇక జగన్ సీఎం అయిపోయినట్లే అన్నట్లుగా అంత రేంజిలో పుట్టిన రోజు వేడుకలు ఏపీ నలుమూలలా నిర్వహించారు. ఓటమి తరువాత జగన్ రెండవ పుట్టిన రోజే ఇంత టాప్ లెవెల్ లో నిర్వహించడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే దీని వెనక ఏకంగా వేయి కోట్ల రూపాయల దాకా ఖర్చు జరిగింది అన్న ప్రచారం చూస్తే వామ్మో ఇదేమిటి నిజమేనా అన్నది మరో చర్చగా తెర ముందుకు వస్తోంది.

కుమ్మేసిన యాడ్స్ :

జగన్ బర్త్ డే వేళ టీవీలకు ఇతర మీడియా సంస్థలకు ఇచ్చిన యాడ్స్ అయితే కుమ్మేశాయని అంటున్నారు. ఫస్ట్ పేజీ యాడ్స్ కలర్ ఫుల్ యాడ్స్ ప్రింట్ మీడియాకు ఇస్తే టీవీ యాడ్స్ వేరే లెవెల్ అన్నట్లుగా సాగాయి. ఈ యాడ్స్ కే ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అన్న దానాలు మహా దానాలు ప్రతీ ఇంటికీ వెళ్ళి వృద్ధులకు కానుకలు ఇవ్వడం వారిని సమాదరించడం ఊరి నిండా ఫ్లెక్సీలు కట్టడం హోర్డింగులు పెట్టి హడావుడి చేయడం మాంసం చికెన్ లతో భోజనాలు విందు వినోదాలు ఇలా ఒకటేమిటి అన్న పుట్టిన రోజు అంటూ చేసిన భారీ సందడి ఖర్చు అయితే ఏకంగా వేయి కోట్ల దాకా ఉండొచ్చు అన్నది పుకారుగా షికారు చేస్తున్న మాటగా ఉంది.

హైకమాండ్ ఆదేశాలతోనే :

జగన్ బర్త్ డే వేడుకలు ఈసారి దద్దరిల్లి పోవాలి అని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇదంతా చేశారు అని అంటున్నారు. పేపర్ యాడ్స్ ని ఈసారి పోటాపోటీగా నేతలు అంతా ఇవ్వడం జరిగింది అంటే దాని వెనక పెద్దల ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు అలాగే కేవలం బర్త్ డే కేక్ కటింగులకే అయిన ఖర్చు తక్కువలో తక్కువ యాభై కోట్ల దాకా అయి ఉండొచ్చు అని గాసిప్ లాంటి మరో ప్రచారం సాగుతోంది. స్టేట్ మొత్తం పార్టీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమాలు చికెన్ మటన్ తో కూడిన భోజనాలకు పెట్టిన మహా ఖర్చు చూస్తే మరో మూడు వందల కోట్ల దాకా ఉండొచ్చు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక జగన్ బర్త్ డే అంటూ నిర్వహించిన కార్యక్రమాలకు కూడా బాగానే ఖర్చు అయింది అని చెబుతున్నారుట.

నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ :

ఇలా చూస్తే లెక్క తీస్తే ఏకంగా ఒక ఏడు వందల నుంచి వేయి కోట్ల మధ్య భారీ ఖర్చుతోనే అధినేత బర్త్ డే వేడుకలను ఘనంగా గొప్పగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లుగా నిర్వహినారు అని అంటున్నారు. మరి ఈ గాసిప్ తరహా ప్రచారం అయితే ఇపుడు ఎక్కడ చూసినా ఆకట్టుకుంటోంది. ఈ లెవెల్ లో కూడా బర్త్ డేలు చేసుకుంటారా వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ అట్టహాసాలు చేసుకుంటారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయం. తీరా చూస్తే ఇపుడు ఎన్నికలు అయితే ఎక్కడాలేవు, అయినా సరే ఈ రేంజిలో పాన్ ఇండియా లెవెల్ బొమ్మ అన్నట్లుగా భారీ ఎత్తున బడ్జెట్ తో జగన్ బర్త్ డే ని నిర్వహించడం వెనక కధ ఏంటి వ్యూహం ఏమిటి అన్నదే రాజకీయ వర్గాల పెద్దలలో సాగుతున్న బడా చర్చగా ఉందిట. సో ఏది ఏమైనా వైసీపీ జగన్ అన్నది జనంలో నానాలి, చర్చ జరగాలి, అధికారం ఉన్నా లేకపోయినా టాపిక్ డైవర్ట్ కాకూడదు, ఇది కూడా వైసీపీ వ్యూహమేమో. ఏమో రాజకీయాల్లో సవాలక్ష స్ట్రాటజీలు ఎందుకైనా దేనికైనా కానీయ్ బర్త్ డేకి కోట్ల ఖర్చు అంటే బాపురే అనిపించక మానదు కదా.