Begin typing your search above and press return to search.

చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన జగన్... వీడియో వైరల్!

ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

By:  Raja Ch   |   2 Dec 2025 3:50 PM IST
చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన జగన్... వీడియో వైరల్!
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బయటకు వస్తే ప్రజాధరణ విపరీతంగా ఉంటుందనే చర్చ అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బలంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన అభివాదం చేస్తే తీరు, పలువురితో ఆయన నడుచుకునే విధానానికి ఫ్యాన్స్ ఉన్నారని అంటారు. ఈ క్రమంలో తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

అవును... వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపరీతమైన సెక్యూరిటీ మధ్య జనాల్లోకి వచ్చేవారు! ఈ సమయంలో పరదాల మాటున ప్రజల్లోకి వచ్చే వారనే విమర్శలు నాటి ప్రతిపక్షాల నుంచి వినిపించేవి. ఆ సంగతి అలా ఉంటే.. ఇటీవల మాజీ ముఖ్యమంత్రిగా మారిన జగన్.. ఎవరినైనా పరామర్శించడానికి వెళ్లినా, వివాహాలకు హాజరైనా, విమానాశ్రయంలో కనిపించినా.. ఆఖరికి కోర్టుకు హాజరైనా జనాలు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మామూలుగానే జగన్ కు సంబంధించిన విషయం (పాజిటివ్ / నెగిటివ్) ఏదైనా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుందని అంటారు. ఈ క్రమంలో.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాల విషయం ఇప్పుడు సోషల్ మీడియాకు చేరి, హల్ చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా... గన్నవరం విమానాశ్రయానికి జగన్ ను చూసేందుకు ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు వచ్చారు. ఈ సమయంలో జగన్ అటుగా వస్తున్న సమయంలో ఆ చిన్నారి చెప్పు కాలి నుంచి జారి కిందపడిపోయింది. అది గమనించిన జగన్.. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చెప్పును తీసి అందించారు. అనంతరం.. ఆమెను ఆప్యాయంగా స్పృశించారు! దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.