Begin typing your search above and press return to search.

జగన్ లోకల్ ఫోకస్...గెలవాల్సిందే !

వైసీపీ అయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అధినాయకత్వం వైపు నుంచి చూస్తే ఏ సీటూ వదిలేయవద్దు అని గట్టిగా ఆదేశాలు ఉన్నాయి.

By:  Satya P   |   24 July 2026 6:00 AM IST
జగన్ లోకల్ ఫోకస్...గెలవాల్సిందే !
X

వైసీపీ అధినేత వైఎస్ జగ లోకల్ ఫైట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. టీడీపీ అయితే ఇప్పటికే పార్టీ క్యాడర్ ని సమాయాత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన తాజాగా క్యాడర్ కి ఇదే విషయం మీద దిశా నిర్దేశం చేశారు.

ప్రతిష్టాత్మకంగానే :

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అంతే కాదు ప్రతి స్థానంలో వైసీపీ పోటీచేసి గెలవాల్సిందే అని జగన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని నియోజకవర్గం ఇంచార్జిలకు ఆయన కీలక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఈ సందర్బంగా ఆయన గట్టిగా కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన కోనసీమ జిల్లా నేతలకు జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

యాక్షన్ ప్లాన్ రెడీ :

ఇదిలా ఉంటే దీని మీద ఆయన యాక్షన్ ప్లాన్ ని కూడా పార్టీ తరఫున జగన్ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించాలని, అలాగే నాలుగు నెలల పాటు కోఆర్డినేటర్స్‌ గ్రామ వార్డు పర్యటనలు చేయాలని అన్నారు. ఈ సమావేశాల్లో పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ చేయలని చెప్పారు. అంతే కాకుండా ప్రజా సమస్యలపై గళం ఎక్కడికక్కడ విప్పాలని అన్నారు. ఈ సందర్భంగా ఒక్కో నియోజకవర్గ సమన్వయకర్తతో విడివిడిగా జగన్ సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్‌ కార్యాచరణపై సమగ్రంగా ఆయన సమీక్షించారు.

ఢీ అంటే ఢీ :

వైసీపీ అయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అధినాయకత్వం వైపు నుంచి చూస్తే ఏ సీటూ వదిలేయవద్దు అని గట్టిగా ఆదేశాలు ఉన్నాయి. ఏకగ్రీవాలు అడ్డుకోవాలని ప్రతీ ఏటా పోటీకి పెట్టడమే కాకుండా విజయాలను సొంతం చేసుకోవాలని జగన్ సూచిస్తున్నారు. రెండేళ్ళ కూటమి పాలన పట్ల జనంలో అసంతృప్తి ఉందని దానిని పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అంటున్నారు. మరీ వైసీపీ కనుక మనసు పెట్టి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే గ్రౌండ్ లెవెల్ లో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో ఎవరూ తగ్గదు అని జగన్ అంటున్నారు. అంతే కాదు గెలుపు బాధ్యతలను ఆయా నియోజకవర్గం ఇంచాజిల మీదనే పెట్టారు.అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు అంతా కలసి ఫ్యాన్ పార్టీకి విజయం చేకూర్చాలని ఆయన కోరుతున్నారు. మరి ఇచ్చిన పిలుపుతో వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగితే కనుక రాజకీయం మరో మారు హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.