వైఎస్ జగన్ కు అస్వస్థత... వైద్యుల సూచనల ప్రభావం ఇదే!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి పర్యటనలన్నీ రద్దయ్యాయి. అందుకు కారణం ఆయన అస్వస్థతకు గురవ్వడమే.
By: Raja Ch | 24 Dec 2025 12:28 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి పర్యటనలన్నీ రద్దయ్యాయి. అందుకు కారణం ఆయన అస్వస్థతకు గురవ్వడమే. ప్రస్తుతం జగన్ జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యుల సూచనల మేరకు కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో వాటిలో కొన్నింటిని రీషెడ్యూల్ చేయనున్నారన్ని అంటున్నారు. బెంగళూరు నుంచి జగన్ మంగళవారం పులివెందుల చేరుకున్న సంగతి తెలిసిందే.
అవును... క్రిస్మస్ వేడుకల్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు పులివెందులలో ఉండాలని మంగళవారం బెంగళూరు నుంచి వచ్చిన జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఈ రోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భగంగా... 'జ్వరంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్..డాక్టర్ ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవ్వాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న వైయస్ జగన్" అని రాసుకొచ్చింది.
వాస్తవానికి పులివెందుల పర్యటనలో భాగంగా.. జగన్ ఈ రోజు ఇడుపులపాయలో పార్థనల్లో పాల్గొనాల్సి ఉంది. ఇదే క్రమంలో.. మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. అయితే.. రేపు పులివెందుల సీ.ఎస్.ఐ. చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... మంగళవారం పులివెందులో నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సాయంత్రం 3:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను వింటూ పరిష్కార మార్గాలు చూపారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు!:
లాంచ్ వెహికల్ మార్క్ 3 - ఎం6 (ఎల్వీఎం3-ఎం6) రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా.. ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్ ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనమని చెబుతూ ఈ సందర్భంగా దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు జగన్. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
