Begin typing your search above and press return to search.

జగన్ ఢిల్లీ టూర్ లేనట్లేనా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అంటూ ఈ మధ్యనే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

By:  Satya P   |   3 Aug 2026 2:04 PM IST
జగన్ ఢిల్లీ టూర్ లేనట్లేనా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అంటూ ఈ మధ్యనే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆయన సడెన్ గా హస్తినకు ఎందుకు వెళ్తున్నారు అని మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు యూ ట్యూబ్ చానల్స్ లో కూడా హాట్ హాట్ డిస్కషన్ సైతం సాగింది. జగన్ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరారని తానే వచ్చి కలుస్తాను అని చెప్పారని దాంతో ఎట్టకేలకు అది కుదిరింది అని రకరకాలుగా ప్రచారం సాగింది. మరో వైపు తన పార్టీ వారి మీద కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న క్రమంలో జగన్ కేంద్ర పెద్దలను కలుస్తున్నారు అని వైసీపీ వ్యతిరేక మీడియాలో వార్తలు వస్తే కేంద్ర పెద్దల అవసరాల కోసమే జగన్ తో చర్చలు జరిపేందుకు పిలిపించుకుంటున్నారు అన్నది వైసీపీ అనుకూల మీడియా యూ ట్యూబ్ చానళ్ళలో వచ్చిన కధనాలుగా ఉన్నాయి. సరే వీటిలో ఏది నిజం ఏది కాదు అన్నది పక్కన పెడితే ఇంతకీ జగన్ ఢిల్లీ టూర్ ఉందా లేదా అన్నదే పెద్ద చర్చగా ఉందిపుడు.

గత వారమే అంటూ :

నిజానికి వైసీపీ నుంచి జగన్ ఢిల్లీ టూర్ మీద ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు, వైసీపీ ఎంపీలు కానీ పార్టీ నేతలు కానీ ప్రైవేట్ సంభాషణలలో కూడా ఈ విషయం ఎక్కడా చెప్పినట్లు కూడా లేదు, కానీ జగన్ ఢిల్లీ టూర్ ఖాయమని ఇక రేపో మాపో అన్నట్లుగా పెద్ద ఎత్తున సాగిన ప్రచారం అయితే ఇపుడు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ మధ్యలో నరేంద్ర మోడీ ఏపీ రావడం, భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఆయన వెళ్తూ వెళ్తూ పవన్ లోకేష్ ల మీద అభిమానం చూపించడం కూడా చర్చనీయాంశం అయింది.

ఇంతకీ ఉందా లేదా :

ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఢిల్లీ టూర్ ఇంతకీ ఉందా లేదా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం. అయితే ఇక్కడ జగన్ ఢిల్లీ టూర్ నుంచి రెండు రకాలైన వార్తా కధనాలు వచ్చాయి. ఒకటి కేంద్ర పెద్దలే ముఖ్యమైన బిల్లుల విషయంలో మద్దతు కోసం జగన్ ని పిలిపుంచుకుంటున్నారు అని వచ్చింది. రెండవది జగన్ తానే అపాయింట్మెంట్ కోరారు అన్నది. ఇక మొదటిది అయితే ఇప్పట్లో బీజేపీ పెద్దలతో జగన్ భేటీ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు విషయంలో కాషాయ పెద్దలు పునరాలోచనలో పడ్డారు అని అంటున్నారు. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఈ బిల్లు విషయంలో సరిపడా ఎంపీల మద్దతు ఇంకా చిక్కలేదని అంటున్నారు. దాంతో పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గడువు కూడా తొందరలో ముగుస్తోంది కాబట్టి ఈ సెషన్ లో లేనట్లే అని అంటున్నారు. దాంతో విపక్షాలతో బీజేపీ పెద్దల సంప్రదింపులకు కూడా బ్రేక్ పడింది అని అంటున్నారు. ఆ లెక్కన జగన్ ఢిల్లీ టూర్ ఉండకపోవచ్చు అని అంటున్నారు.

అదే నిజం అయితే మరి :

ఇక జగన్ ఢిల్లీ టూర్ మీద రెండవ విషయం కూడా ప్రచారంలో ఉంది. ఆయనే స్వయంగా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరారు అని వైసీపీ వ్యతిరేక మీడియా ప్రచారంలో ఉంది. మరి అదే నిజం అని అనుకుంటే కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏపీకి తాజాగా వచ్చి బాబు పవన్ లతో ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వెళ్లిన మోడీ ఇపుడు జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది కూడా మరో చర్చ. కూటమి పార్టీలకు వైసీపీకి మధ్య ఏపీలో ఉప్పు నిప్పులా పరిస్థితి ఉంది. అందువల్ల అది జరిగే పనేనా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. అయితే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా డీలిమిటేషన్ బిల్లుల మీద భేటీ అయితే ఓకేగా ఉండేది కానీ అది ఇప్పట్లో అయ్యేది కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఢిల్లీ టూర్ అన్నది ఎపుడు అంటే అసలు అది ఉందా అంతా మీడియా సృష్టి కదా అని వైసీపీ నేతల నుంచి రియాక్షన్ వచ్చినా రావచ్చు. సో అదన్న మాట మ్యాటర్.