బాలయ్య మీద జగన్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి బాలయ్య మాట్లాడింది ఏమిటి అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పనీ పాటా లేని మాటలు మాట్లాడారు అన్నారు.
By: Satya P | 23 Oct 2025 3:31 PM ISTప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ మీద అనుచిత కామెంట్స్ చేశారు. సైకో గాడు అని కూడా ఆయన దారుణంగా విమర్శించారు. దాని మీద వైసీపీ శ్రేణులు అపుడే పూర్తి స్థాయిలో ఖండించాయి. అయితే చాన్నాళ్ళ తరువాత జగన్ తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో మీడియా నుంచి బాలయ్య జగన్ మీద చేసిన వ్యాఖ్యలు అంశం ఎదురైంది. దానికి జగన్ ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు.
తాగేసి అసెంబ్లీకి వచ్చారు :
బాలయ్య తాగేసి ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఆయనను సభలోకి ఎలా అనుమతించారు అని ప్రశ్నించారు. ఆయన చేత మాట్లాడించినందుకు స్పీకర్ ది కూడా తప్పు ఉందని అన్నారు. అలాగే బాలయ్య తాగేసి అసెంబ్లీలో మాట్లాడారని ఆయన మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని అన్నారు. ఈ విషయంలో బాలయ్య తనను తాను ప్రశ్నించుకోవాలని అన్నారు.
పనీ పాట లేని మాటలు :
అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి బాలయ్య మాట్లాడింది ఏమిటి అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పనీ పాటా లేని మాటలు మాట్లాడారు అన్నారు. వాటిని అనుమతించడమేంటి అని ఆయన అన్నారు. ఆయన అలా మాట్లాడుతూంటే అనుమతించడమే తప్పు అని అన్నారు.
జగన్ రిటార్ట్ :
బాలయ్య మీద జగన్ ఎపుడూ ఈ తరహా విమర్శలు చేయలేదు. ఎందుకు అంటే గతంలో జగన్ రాజకీయాల్లోకి రాకముందు బాలయ్య అభిమాని అంతా చెబుతారు. ఇక బాలయ్య ఎన్నికల వేళ గతంలో అనేక విమర్శలు జగన్ మీద చేసినా ఆయన పట్టించుకోలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తారు. అయితే నిండు అసెంబ్లీలో జగన్ ని పట్టుకుని సైకో గాడు అని మాట్లాడడం మీద వైసీపీ శ్రేణులు అన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగన్ అయితే ఈ విషయం మీద మీడియా సమావేశంలో మొదట ప్రస్తావించలేదని గుర్తు చేస్తున్నారు.
కామెంట్స్ వైరల్ :
ఇటీవల వరసగా జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ జగన్ ని మీడియా బాలయ్య వ్యాఖ్యల మీద ప్రశ్నలు అడిగినపుడు జగన్ గట్టిగానే బాలయ్యకు రిటార్ట్ ఇచ్చారని అంటున్నారు. బాలయ్య మానసిక ఆరోగ్యం అని కూడా జగన్ కామెంట్స్ చేయడం కూడా వైరల్ అవుతోంది. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తొలిసారి బాలయ్య మీద నేరుగా ఇంత ఘాటుగా జగన్ ఈ తరహా విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
