Begin typing your search above and press return to search.

జగన్ అంటే సింహం...మధ్యలో కాక్రోచ్ గోలేంటి ?

అది కూడా ఢిల్లీలో రెండు నెలల క్రితం జరిగిన విద్యార్థి ఉద్యమం కాక్రొచ్ జనతా పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఎగిసిన నిరసనలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని జగన్ తరచూ కాక్రోచ్ అన్న మాట వాడుతున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   11 Sept 2026 7:30 AM IST
జగన్ అంటే సింహం...మధ్యలో కాక్రోచ్ గోలేంటి ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజా ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు అవసరం అయితే తాను కాక్రోచ్ అవుతాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. జగన్ అంటే సింహం అని అంతా అంటారు కదా. వైసీపీ అభిమానులు అంతా సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పుకుంటారు, అలాంటిది జగన్ ఒక్కసారిగా కాక్రోచ్ అని అనడం మీద రాజకీయంగా చర్చ సాగుతోంది. సింహం కంటే కాక్రోచ్ పవర్ ఫుల్ గా ఉందా. ఉంటే అది ఎలా అయింది అని అంటున్నారు. జగన్ కి ఈ కాక్రోచ్ అన్న మాట బాగా పట్టేసింది కదా అని కూడా అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాక్రోచ్ అన్న పదం వాడుతున్నారు. అది కూడా ఢిల్లీలో రెండు నెలల క్రితం జరిగిన విద్యార్థి ఉద్యమం కాక్రొచ్ జనతా పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఎగిసిన నిరసనలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని జగన్ తరచూ కాక్రోచ్ అన్న మాట వాడుతున్నారు అని అంటున్నారు.

నాలాంటి వాడు కూడా :

ఇంతకీ జగన్ అన్నది ఏమిటి అంటే వ్యవస్థలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించడానికి కాక్రోచ్ లు పుట్టుకుని వస్తాయని. పరిపాలన సరిగ్గా లేనపుడు వ్యవస్థలు పూర్తిగా చెడిపోయినపుడు సమాజంలోనే తిరుగుబాటు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలా ప్రశ్నించే శక్తులను కాక్రోచులు అని జగన్ అంటున్నారు. అంతే కాదు అవసరం అయితే తనలాంటి వారు కూడా కాక్రోచులుగా అవతారం ఎత్తుతారు అని కూడా జగన్ అంటున్నారు. ప్రశ్నించే వారిని అణచాలని చూస్తే తీవ్ర స్థాయిలో తిరుగుబాటు వస్తుందని కూడా జగన్ హెచ్చరిస్తున్నారు.

ఉద్యమిస్తారా :

ఇలా జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చూస్తే మెగా డీఎస్సీ విషయంలోనే ఆయన కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తున్నారు. ఈ ఇష్యూలోనే అమీ తుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇదే విషయం మీద వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చింది. శాసనమండలిలో చర్చకు డిమాండ్ చేసింది. ఇక ఈ ఇష్యూ ఇక్కడితో ఎండ్ అయింది అనుకున్న వేళ జగన్ ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా దీని మీదనే మాట్లాడడంతో పాటు అవసరమైతే నేనే కాక్రోచ్ గా ముందుకు వస్తాను అని చేసిన హెచ్చరికలను ఎలా చూడాలి అని ప్రశ్నలు వస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో కాక్రోచుల పోరాటం సాగింది అంటే బలమైన సందేశం జనంలోకి వెళ్లింది. ఇపుడు అలాంటిది వెళ్లాలీ అంటే జగన్ జనంలోకి రావాల్సి ఉంది అని అంటున్నారు. అందుకే జగన్ ఈ విధంగా ముందస్తుగా హెచ్చరికలు చేసారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఆనాడు యువభేరీలతో :

ఒక్కసారి వెనక్కి వెళ్తే జగన్ యువ భేరీ సభలను ఏపీ వ్యాప్తంగా 2016 ప్రాంతంలో నిర్వహించారు. ఆ సమయంలో యువతను కూడగట్టి వారిని ఉద్దేశించి విద్యా సంస్థల ప్రాంగణాలలఒ కూడా సభకు నిర్వహించారు. ఇపుడు మళ్లీ యూత్ తో కనెక్ట్ కావడానికి ఆయన జనంలోకి ఈ విధంగా వస్తారా అని కూడా అంతా ఆలోచిస్తున్నారు. కాక్రోచ్ పార్టీ చేపట్టిన నిరసనల తరహాలో జగన్ కూడా వైసీపీ ద్వారా అలాంటి ఉద్యమానికి తెర తీస్తారా అని కూడా చర్చిస్తున్నారు. పవర్ ఫుల్ ఇష్యూతోనే జనంలోకి జగన్ వెళ్లాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ మధ్యలో జనంలోకి వెళ్ళేందుకు మెగా డీఎస్సీ అంశాన్ని ఎంచుకుంటారా అన్నదే అంతా డిస్కషన్ చేస్తున్నారు. మొత్తానికి తాను కాక్రోచ్ ని అవుతాను అని సింహం లాంటి జగన్ అంటున్నారు అంటే రాజకీయంగా ఏపీలో పరిణామాలు ఏ విధంగా మారుతాయో చూడాల్సిందే