Begin typing your search above and press return to search.

జగన్ చెన్నై టూర్ ఇంట్రెస్టింగ్

వైఎస్ జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్ చెన్నై టూర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన తన సోదరుడు వైఎస్ అనిల్ కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు.

By:  Satya P   |   8 Feb 2026 9:50 AM IST
జగన్ చెన్నై టూర్ ఇంట్రెస్టింగ్
X

వైఎస్ జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్ చెన్నై టూర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన తన సోదరుడు వైఎస్ అనిల్ కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. అయితే చెన్నైలో జగన్ కి అభిమానుల స్వాగతం లభించడం విశేషం. ఇక జగన్ ఈ పెళ్ళికి ప్రత్యేకంగా రావడం మీద కూడా చర్చ సాగుతోంది.

వీఐపీలు అంతా :

ఇక ఈ వివాహానికి రాజకీయ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు వీఐపీలు పాల్గొంటారు అని అంటున్నారు. జగన్ సోదరుడు సైతం వ్యాపారవేత్తగా ఉంటున్నారు. జగన్ సైతం వ్యాపారవేత్త అన్న సంగతి తెలిసిందే. దాంతో పెళ్ళిలో అనేక మంది ప్రముఖులతో జగన్ భేటీ ఉండొచ్చు అని అంటున్నారు. అదే విధంగా తమిళనాడుకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరవుతారు అని అంటున్నారు.

ఎన్నికల వేడిలో :

తమిళనాడులో ఎన్నికల సందడి సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు తొందరలో నోటిఫికేషన్ రావచ్చు అన్న చర్చ సాగుతోంది. ఈ సమయంలో ఏపీలో కీలకంగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన అధినేత చెన్నై రావడం అభిమానుల కోలాహలం అన్నది అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ కి తమిళనాడులో కూడా ఫ్యాన్స్ ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇరవై శాతం తెలుగు వారే :

ఇక చెన్నైలో చూస్తే ఇరవై శాతం తెలుగు వారే ఉన్నారు. ఎన్నికల వేళ తెలుగు మాట్లాడే ప్రాంతాలలో వారి మద్దతు కోసం తెలుగు నేతలను అక్కడి పార్టీలు సహకారం కోరడం జరుగుతూ వస్తోంది. ఇక చూస్తే తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. ఎంకే స్టాలిన్ సీఎం గా ఉన్నారు స్టాలిన్ తో జగన్ కి మంచి సాన్నిహిత్యమే ఉంది అని అంటున్నారు. జగన్ సీఎం గా 2019లో ప్రమాణం చేసినపుడు స్టాలిన్ విపక్ష నేతగా ఉన్నారు. ఆనాడు ఆయన ప్రత్యేకంగా విజయవాడకు వచ్చి హాజరయ్యారు. ఇక ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది అని అంటున్నారు.

న్యూట్రల్ గా జగన్ :

ఇక జగన్ వైఖరి చూస్తే న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వైపు కానీ అలాగే ఎన్డీయే వైపు కానీ ఆయన లేరు, అదే సమయంలో ఆయనకు ఇండియా కూటమిలో మిత్రులు లేరని కాదు, స్టాలిన్ తో పాటు అఖిలేష్ యాదవ్ అలాగే మమతా బెనర్జీ కూడా మిత్రులు అని అంటున్నారు. ఈ మధ్యనే మమతా బెనర్జీ పుట్టిన రోజుకు జగన్ అభినందనలు తెలిపారు కూడా. కాంగ్రెస్ నాయకత్వం లేని ఇండియా కూటమి అయితే వైసీపీ మొగ్గు చూపుతుంది అన్న ప్రచారం కూడా ఉంది. తెలంగాణాలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ లేని కూటమి ఉంటే కలిసేందుకు చూస్తోంది అని అంటున్నారు.

అనూహ్య భేటీలు :

ఇక జగన్ ఎపుడూ చెన్నైకి పెద్దగా వెళ్ళింది లేదు. తాజా పర్యటన పూర్తిగా వ్యక్తిగతం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. ఈ వివాహానికి ప్రముఖులు వస్తారని ప్రచారం సాగుతున్న వేళ అనూహ్య భేటీలు ఏమైనా జరిగే అవకాశం ఉందా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. మొత్తం మీద చూస్తే తమిళనాడు ఎన్నికలతో హీటెక్కిన వేళ ఏపీ నుంచి ఒక మాజీ సీఎం అక్కడ సందడి చేయడం విశేషంగానే చూస్తున్నారు.