ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్.. సీబీఐ కోర్టుకు జగన్ !
అందుకోసం ఆయన సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు ఆ సమయంలో తాను నవంబర్ 14 కి ముందు సీబీఐ కోర్టుకు రావడానికి అంగీకరించారు అని చెబుతున్నారు.
By: Satya P | 11 Nov 2025 8:46 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ని సీబీఐ కోర్టులో చూడడం అన్నది ఒక తరానికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. అంటే కొన్నేళ్ళ కాలం అయింది అని కూడా అనుకోవచ్చని అంటున్నారు. జగన్ మీద కేసులు 2011లో ఫైల్ అయ్యాయి. వాటి మీద సీబీఐ విచారించి దాదాపుగా పదకొండు దాకా చార్జిషీట్లను ఈ కేసులో దాఖలు చేసింది. ఇక సీబీఐ కోర్టులో విచారణ ఈ కేసుల మీద జరుగుతోంది. అయితే జగన్ మాత్రం భౌతికంగా కోర్టుకు హాజరైంది చూస్తే తక్కువ అని చెబుతారు. ఇక ఆయన 2017లో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. ఇక ఆయన 2019 లో ఏపీ సీఎం అయిన తరువాత మాత్రం హాజరు అయ్యింది లేదు అన్నది ఉంది.
భద్రతా కారణాలతో :
ఏపీ సీఎం గా ఉన్న జగన్ ఆనాడు భద్రతాపరమైన కారణాలు చూపించి తాను భౌతికంగా కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు పొందారు. అయితే జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేసి కూడా చాలా కాలం అయింది. ఈ కేసులో పురోగతి ఏమిటి అన్నది కూడా ఒక చర్చగా ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ న్యాయవాదులే విచారణకు హాజరవుతున్నారు. ఆయనకు మినహాయింపు అయితే కొనసాగుతోంది.
లండన్ టూర్ నేపధ్యంలో :
ఇక జగన్ గత నెలలో లండన్ పర్యటన చేపట్టారు. అందుకోసం ఆయన సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు ఆ సమయంలో తాను నవంబర్ 14 కి ముందు సీబీఐ కోర్టుకు రావడానికి అంగీకరించారు అని చెబుతున్నారు. అయితే ఆయన లండన్ పర్యటన ముగిసిన తర్వాత మాత్రం తాను దృశ్య మాధ్యమం ద్వారా హాజరవుతాను లేదా తన న్యాయవాది హాజరవుతారు అని ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కొత్తగా పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ నో :
అయితే ఈ పిటిషన్ మీద సీబీఐ పూర్తి స్థాయిలో తప్పు పట్టింది అని అంటున్నారు. దీని మీద సీబీఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది అని చెబుతున్నారు. ఈ పిటిషన్ లో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరాదని పేర్కొంది అని అంటున్నారు. దీంతో సీబీఐ వైపు నుంచి వచ్చిన స్పందనను చూసిన మీదట వైసీపీ అధినేత మరో వారం పాటు తనకు అనుమతి కోరారని అంటున్నారు. ఆ గడువులోగా తప్పకుండా ఫిజికల్ గా కోర్టుకు హాజరవుతాను అని ఆయన చెప్పినట్లుగా చెబుతున్నారు. అంటే ఈ నెల 21వ తేదీలోగా జగన్ నాంపల్లి లో ఉన్న సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది అని అంటున్నారు.
అరుదైన సీన్ గా :
ఇదిలా ఉంటే జగన్ కనుక సీబీఐ కోర్టుకు హాజరైతే మార్త్రం ఇటీవల కాలంలో అది అరుదైన సన్నివేశం గా ఉంటుందని అంటున్నారు. దాదాపుగా ఏడేళ్ళకు పైగా జగన్ కోర్టుకు రాలేదని అంటున్నారు. దాంతో జగన్ కనుక వస్తే అది రాజకీయంగా ఇతరత్రా కూడా ఒక పెద్ద సంచలనం అవుతుందని అంటున్నారు మీడియా ఫోకస్ మొత్తం ఆయన మీదనే ఉండొచ్చు ఆ మీదట తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ ఇది పెద్ద చర్చగా కూడా రావచ్చు అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏ రోజున కోర్టుకు హాజరవుతారో. ఏమిటి అన్నది.
