Begin typing your search above and press return to search.

జగన్ స్ట్రాటజీ అదేనట...వెయిట్ చేయాల్సిందే !

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తనదైన ఆలోచనతోనే ముందుకు సాగుతారు. ఆయన పార్టీని గత పదిహేనేళ్ళుగా ఒంటి చేతుల మీదుగానే నడుపుతున్నారు.

By:  Satya P   |   7 Nov 2025 1:00 PM IST
జగన్ స్ట్రాటజీ అదేనట...వెయిట్ చేయాల్సిందే !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తనదైన ఆలోచనతోనే ముందుకు సాగుతారు. ఆయన పార్టీని గత పదిహేనేళ్ళుగా ఒంటి చేతుల మీదుగానే నడుపుతున్నారు. ఆయన పార్టీని ఒకసారి బంపర్ విక్టరీతో గెలిపించి అధికారంలోకి తెచ్చారు. రెండు సార్లు ఓడింది. అయితే 2011 నుంచి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్న అనుభవం వైసీపీకి ఉంది. అలాగే జనం నాడి ఏమిటో కూడా ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అతి విశ్వాసం కొంప ముంచింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా వైసీపీ పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అపుడపుడు మాత్రమే :

వైసీపీ అధినేత జగన్ అపుడపుడు మాత్రమే జనంలోకి వస్తున్నారు. అది కూడా నెల రోజులకు ఒకసారి వచ్చి పరామర్శల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఆ సమయంలో జన సందోహం బాగా కనిపిస్తోంది. ఇది వైసీపీని ఉత్సాహంతో ఉంచడానికి ప్రత్యర్ధులకు ఝలక్ ఇవ్వడానికి జగన్ మార్క్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది సుమా అని చెప్పడం అన్న మాట. తాను ఇలా అపుడపుడు వస్తేనే ఈ పరిస్థితి ఉంటే ఇక పూర్తిగా ఫీల్డ్ లోకి దిగితే రాజకీయ తమాషా వేరే లెవెల్ అన్నది కూడా కూటమి పెద్దలకు సంకేతం ఇవ్వడానికే జగన్ ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.

పల్స్ అందుతోందా :

జగన్ జనంలోకి వెళ్ళినపుడు జనం పల్స్ ఏమిటి అన్నది కూడా మెల్లగా అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు జగన్ బయటకు రాలేదు, ఆ తరువాత ఆయన మెల్లగా పరామర్శలు పలకరింపులు మొదలెట్టారు. అయితే కూటమి భారీ మెజారిటీతో రావడం జనాలలో ఆశలు ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉండడంతో తొందరపడి జనంలోకి వెళ్తే అభాసు అవుతుందని ఆలోచించే ఆయన తెర వెనకన ఉన్నారు అని అంటున్నారు. జగన్ ఎక్కడ అని మీడియా రాసినా సోషల్ మీడియా విమర్శలు చేసినా కూటమి నుంచి భారీ సెటైర్లు పడినా జగన్ స్ట్రాటజీ మేరకే ఇదంతా జరుగుతోంది అని అంటున్నారు. తాను ఎపుడు రావాలో పక్కాగా తెలుసు కాబట్టే జగన్ తొందర పడడం లేదు అని అంటున్నారు.

వేడి పుట్టాకనే :

జనాలలో చూస్తే ఇంకా కూటమి పట్ల నమ్మకం సడలలేదు, పధకాలు అయినా కూడా ఒకటి రెండు తప్ప అన్నీ ఇస్తున్నారు. అయితే వాటి అమలు అన్నది రాజకీయ విమర్శలా లేక జనం మదిలో అదే ఉందా అంటే అది తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ సమయం కోసమే జగన్ ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు. ఏపీ ప్రజల మీద జగన్ కి భారీ నమ్మకం ఉంది అని అంటున్నారు. వారు కచ్చితంగా మార్పుని కోరుకుంటారు అని ఎంత చేసినా అయిదేళ్ళకు కచ్చితంగా మార్చేస్తారు అని వైసీపీ పెద్దలు నమ్ముతున్నారు. అంతే కాదు చంద్రబాబు వరుసగా ఎపుడూ రెండోసారి గెలవలేదు అన్న ట్రాక్ రికార్డు కూడా వైసీపీ పెద్దల ధీమాను పెంచుతోంది అని అంటున్నారు.

ముహూర్తం అపుడే :

జగన్ జనంలోకి వచ్చేది మరో రెండేళ్ళు ఆలస్యం కావచ్చు అని అంటున్నారు. ఆయన అన్నీ చూసుకుని 2027లోనే జనంలోకి వస్తారు అని అంటున్నారు. భారీ పాదయాత్ర ఒక్కసారి మొదలుపెడితే అది 2029 సార్వత్రిక ఎన్నికల దాకా అదే పనిగా ఏకబిగిన కొనసాగుతుందని అంటున్నారు. మూడేళ్ళకు సరిపడా సమయం కూటమికి ఇచ్చి అపుడు కాలు బయటకు పెడితే జన నీరాజనం ఒక రేంజిలో ఉంటుందని ఆ ఊపుతో మరోసారి అధికార పీఠాన్ని అందుకోవచ్చు అని జగన్ భావిస్తున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి పేర్ని నాని కూడా చెబుతూ 2027లో పాదయాత్ర ఉండొచ్చు అని హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా జగన్ తన కాళ్ళనే గట్టిగా నమ్ముకున్నారు. జగన్ లో పట్టుదల ఉంది. ఆయన దేనికీ వెరచే వారు కాదు, అందుకే ఆయన గురించి తెలిసిన వైసీపీ నేతలు క్యాడర్ అంతా తమ నాయకుడు గురి తప్పకుండా ఒడ్డుకు చేరుస్తారు అని ఈసారి పవన్ లోకి వచ్చేది తమే అని భావిస్తున్నరు. మొత్తానికి జగన్ స్ట్రాటజీ ఇదే అయితే మాత్రం 2026 లో కూడా జగన్ తాడేపల్లి టూ బెంగళూర్ గానే షటిల్ సర్వీస్ చేస్తారు అనుకోవాలని అంటున్నారు.