వైఎస్ అనిల్ రెడ్డి ఎవరబ్బా... బిగ్ షాట్స్ అంతా చుట్టూనే !
వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక చెన్నైలో రాజకీయ, వ్యాపార ప్రముఖుల హాజరుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడు సీఎం విజయ్, వైఎస్ జగన్, కేటీఆర్, గౌతమ్ అదానీ పాల్గొన్నారు. జగన్కు బంధువైన అనిల్ రెడ్డి మైనింగ్ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
By: Satya P | 7 Nov 2026 8:08 AM ISTవైఎస్ అనిల్ రెడ్డి అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన వారు అని తెలుసు. కానీ ఇంత పాపులారిటీ ఉందా అనిపించేలా ఆయన కుమార్తె వివాహ వేడుకకు దేశంలోని బిగ్ షాట్స్ అంతా హాజరయ్యారు. దాంతో వైఎస్ అనిల్ రెడ్డి గురించిన చర్చ అంతటా జరుగుతోంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అన్నది కూడా గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక చూస్తే తాజాగా చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు దక్షిణ భారత రాజకీయాలలొనే ప్రముఖులు అనదగిన నేతలు అంతా హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, అనిల్ రెడ్డికి సోదరుడైన వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వంటి ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు కూడా దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అందరి ఫోకస్ అదే :
ఇంత పెద్ద వివాహ వేడుకలో అందరినీ ఆకట్టుకున్న దృశ్యం ఉంది. అదే విజయ్ జగన్ కేటీఆర్ మధ్య కనిపించిన సాన్నిహిత్యం. ఈ ముగ్గురి మధ్య ఇంతటి చనువు ఉందా అని అంతా చర్చించుకునే విధంగా ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వీరు ముగ్గురూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకోవడం జరిగింది. అంతే కాదు ఆద్యంతం నవ్వుతూ ఈ వేడుకల్లో స్పేష ఎట్రాక్షన్ అయ్యారు. ఇలా దక్షిణ భారత రాజకీయాల్లోని ఇంతమంది దిగ్గజాలను తన కుమార్తె వివాహానికి రప్పించగలిగిన వైఎస్ అనిల్ రెడ్డి అంటే అసలు ఎవరు, ఏమిటి అన్నదే అంతటా ఇపుడు చర్చగా సాగుతోంది.
జగన్ సన్నిహితుడిగా :
వైఎస్ జగన్ కి అనిల్ రెడ్డి సోదరుడి వరస అవుతారు. ఆయన తండ్రి జార్జి రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన సోదరుడు. అలా చూస్తే అనిల్ రెడ్డి జగన్ కి కజిన్ అన్న మాట. ఇక వైఎస్ జగన్ కి అనిల్ రెడ్డి చాలా సన్నిహితుడు అని చెబుతున్నారు. ఇక విదేశాల్లో కార్యకలాపాలు సాగించే పలు మైనింగ్ కంపెనీలకు అనిల్ రెడ్డి యజమాని అని అంటున్నారు. ఇక వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటి నుండి ఆయనతోనే అనిల్ రెడ్డి ఉంటూ వస్తున్నారని చెబుతున్నారు.
పవర్ ఫుల్ గానే :
ఇక అనిల్ రెడ్డి మైనింగ్ రంగంలోనూ కీలకం అని అంటున్నారు. ఇక ఏపీలో లిక్కర్ స్కాం లో ఆయన మీద పలు రకాలైన ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒక ఎత్తుగా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అలా టీవీకే ప్రభుత్వంతో ఉన్న ఉన్నత స్థాయి పరిచయాల కారణంగా అనిల్ రెడ్డి తెర వెనుక దక్షిణ భారత రాజకీయాల్లో ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారని చెబుతున్నారు. కేవలం తక్కువ కాలంలోనే వైఎస్ అనిల్ రెడ్డి దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన వ్యక్తి గా ఎదిగారు అని అంటున్నారు. లేకపోతే గౌతమ్ అదానీ కూడా ఈ వివాహ వేడుకకు హాజరవడం అంటే మామూలు విషయం కాదనే అంటున్నారు. పైగా గౌతం అదానీ ఆ వేడుకల్లో కొంత సమయం గడపడం చూస్తూంటే వైఎస్ అనిల్ రెడ్డికి ఉన్న బలమైన పరిచయాలు ఏమిటిన్నవి అర్ధం అవుతోంది అని అంటున్నారు. మొత్తం మీద తెర వెనక ఉండొచ్చు కానీ వైఎస్ అనిల్ రెడ్డి చాలా ప్రముఖంగానే ఎదిగారు అని అంటున్నారు.
