హరిద్వార్ : ఎనిమిది గంటల్లో రూ.4 వేలు !
సాధారణంగా టీవీ ఛానళ్లు, పత్రికలు స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి సంచలన విషయాలు బయటపెట్టడం తరచూ గమనిస్తూ ఉంటాం.
By: Garuda Media | 21 Aug 2026 12:28 PM ISTసాధారణంగా టీవీ ఛానళ్లు, పత్రికలు స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి సంచలన విషయాలు బయటపెట్టడం తరచూ గమనిస్తూ ఉంటాం. అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్యులు కూడా సంచలనంగా మారారు. సోషల్ మీడియా సపోర్టుతో కొందరు ‘పుర్రెకో బుద్ది .. జిహ్వకో రుచి’ అన్న నానుడిని నిజం చేస్తున్నారు.
పురుషోత్తం వశిష్ట్ అనే ఒక యూట్యూబర్ తన స్నేహితుడు సచిన్ తో హరిద్వార్ పుణ్యక్షేత్రంలో బిచ్చగాడి అవతారం వేయించాడు. చిరిగిన బట్టలు, మొకానికి బురద, చేతిలో చిన్నపాత్ర పెట్టి క్యూర్ కోడ్ తో కూడి బోర్డును మెడలో వేసి భిక్షాటనకు పంపించాడు. బిక్షాటన మొదలు పెట్టిన కొద్దిసేపు ఎవరూ పట్టించుకోకపోయినా, మొత్తం ఎనిమిది గంటల్లో ఏకంగా రూ.4 వేల రూపాయలు వచ్చాయట.
అక్కడ కూలింగ్ అద్దాలు అమ్మే ఒక వ్యాపారి సచిన్ కు సన్ గ్లాసెస్ బహుమతిగా ఇచ్చాడట. డిజిటల్ రూపంలో మెడలో ఉన్న క్యూ ఆర్ కోడ్ కు ఒకరు రూ.40 చెల్లించారట. ఈ లెక్కన నెలకు రూ.1.20 లక్షలు సంపాదించవచ్చని అనంతరం విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు. అయితే భిక్షాటన చూడడానికి సులువు అనిపించినా చాలా కష్టంతో కూడుకున్నది అని, అందుకే అందరూ నిజాయితీగా వచ్చే సంపాదన మీద ఆధారపడాలని అన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ అయిన ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
