పవన్ ఊ అంటే... వీళ్లు సై ..!
పార్టీని డెవలప్ చేస్తామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కానీ, ఎప్పటి కప్పుడు ఈ ప్రతిపాదన మాటలకే పరిమితం అవుతోంది.
By: Garuda Media | 27 Oct 2025 6:00 PM ISTపార్టీని డెవలప్ చేస్తామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కానీ, ఎప్పటి కప్పుడు ఈ ప్రతిపాదన మాటలకే పరిమితం అవుతోంది. అయితే.. క్షేత్రస్థాయిలో యువత పెద్ద ఎత్తున ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతుండడం.. పార్టీలో చేరేందుకు కూడా ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయడం వంటివి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. కొన్ని ఆన్‌లైన్ మాధ్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పట్టినప్పుడు.. యువత రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహం చూపించారు.
అంతేకాదు.. ఎక్కువ మంది జనసేన వైపు మొగ్గు చూపడం గమనార్హం. అయితే.. వీరిలో మెగా అభిమాను లు మాత్రమే ఉన్నారని అనుకుంటే పొరపాటే. అభిమానానికి భిన్నంగా తటస్థ యువత కూడా.. జనసేన వైపు మొగ్గు చూపించారు. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే.. మీరు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? అంటే.. మెజారిటీ యువత జనసేనను ఎంచుకున్నారు. రెండోస్థానంలో టీడీపీని ఇష్టపడ్డారు. దీనికి కూడా కారణం చెప్పుకొచ్చారు. జనసేనలో మరింతగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్న వాదన చెప్పారు.
అంతేకాదు.. భవిష్యత్తు వ్యూహాత్మకంగా సాగాలంటే.. జనసేన తరఫున పనిచేయాలన్న భావనను అనంత పురం, కర్నూలు.. యువత ఎక్కువగా విశ్లేషించారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ యువత రాజకీయా లపై ఆసక్తి చూపించినా.. నేరుగా పార్టీలోకి చేరకుండా స్వతంత్ర రాజకీయాలు చేసేందుకు.. అంటే సోషల్ మీడియాలో విశ్లేషణలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక, రాజకీయాల ద్వారా ఆదాయం వస్తుందా? అన్న ప్రశ్నకు.. చాలా మౌనం వహించారు. వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చాక వెంటనే ఆదాయం రాదు. ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన తర్వాతే ఆదాయం ఉంటుంది.
ఈ విషయంలో యువత క్లారిటీగానే ఉన్నట్టు తెలిసింది. అయితే.. మొత్తంగా రాష్ట్రంలోని 60 శాతం మంది జనసేన వైపు మొగ్గు చూపడం గమనార్హం. ఇక, పార్టీ పరంగా చూస్తే.. ఎప్పటికప్పుడు యువతకు శిక్షణ ఇస్తామని చెబుతున్నా.. దీనిని ఆ పార్టీ సాకారం చేయడం లేదు. గత నెలలో సేనతో నిర్వహించిన సమావేశంలో కూడా యువతను ప్రోత్సహిస్తామని.. షణ్ముఖ వ్యూహం రచిస్తామని.. పవన్ చెప్పారు. తర్వాత.. మళ్లీ ఈ ప్రతిపాదన ఎక్కడా పుంజుకోలేదు. మొత్తంగా చూస్తే.. పవన్ ఊ.. అంటే.. సై! అనేందుకు, సైన్యంలో చేరేందుకు యువత రెడీ!. ఇంక ఆయనదే ఆలస్యం.
