Begin typing your search above and press return to search.

30 లోపు కెరీర్‌.. 40 త‌ర్వాత ఫ్యూచ‌ర్‌.. `ఆ సుఖం` ప‌దేళ్లేనా?

కామికాని వాడు మోక్ష‌గామి కాడ‌ని అన్నారు అన్న‌మ‌య్య‌. ఒక‌ప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ బిల‌బిల‌మంటూ.. ఐదుగురుకు త‌గ్గ‌కుండా పిల్లులు ఉండేవారు.

By:  Garuda Media   |   26 Sept 2026 6:00 PM IST
30 లోపు కెరీర్‌.. 40 త‌ర్వాత ఫ్యూచ‌ర్‌.. `ఆ సుఖం` ప‌దేళ్లేనా?
X

కామికాని వాడు మోక్ష‌గామి కాడ‌ని అన్నారు అన్న‌మ‌య్య‌. ఒక‌ప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ బిల‌బిల‌మంటూ.. ఐదుగురుకు త‌గ్గ‌కుండా పిల్లులు ఉండేవారు. రాను రాను.. ఇప్పుడు పిల్ల‌ల పుట్టుకే పెద్ద చిత్రంగా మారిపోతోంది. స‌రే.. ఈ విష యంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన యువ‌జ‌నుల శృంగార స‌మ‌యంపై స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌టకు వ‌చ్చాయి. ముఖ్యంగా న‌గ‌రాల విస్త‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో జ‌నాభా అంతా గుట్ట‌గా ఇక్క‌డే పోగు ప‌డుతోంది.

దీంతో న‌గ‌రాల్లోనే ఈ స‌ర్వే ఎక్కువ‌గా చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఇంకా కొన్ని న‌గ‌రాల్లో ఈ స‌ర్వే సాగుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. వైవాహిక జీవితంలో భార్యా భ‌ర్త‌లు ఎంత స‌మ‌యాన్ని శృంగారానికి కేటాయిస్తున్నారు? అనేదే!. చిత్ర‌మే అయినా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐక్య‌రాజ్య‌స‌మితి చేస్తున్న వినూత్న ప్ర‌య‌త్నంలో భాగంగా ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా.. ఈ విషయంపై స‌ర్వే చేప‌డుతున్నారు. యువ‌తీ యువ‌కుల మ‌ర‌ణాల‌కు ఒత్తిడి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో శృంగారానికి దూరం కావ‌డం కూడా ఒత్తిడిని పెంచుతోంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిలోని ఆరోగ్య విభాగం పేర్కొంది.

ఈ నేప‌థ్యంలోనే మ‌న దేశంలో కూడాఈ స‌ర్వే సాగుతోంది. ఇదేమీ ర‌హ‌స్య స‌ర్వే కాదు.. ఆఫీసులు, బ్యాంకులు, జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాల్లో 12 ప్ర‌శ్న‌ల‌తో కూడిన చిట్టాను వివాహితులైన‌ యువ‌తీయువ‌కుల ముందు ఉంచి వారి అభిప్రాయాల‌ను ఏఎన్ ఎంలు తీసుకుంటున్నారు. దీనిలో మెజారిటీ యువ‌తీ యువ‌కులు చెబుతున్న‌ది.. 30 ఏళ్ల వ‌ర‌కు.. కెరీర్‌, చ‌దువు చుట్టూ గింగిరాలు కొడుతున్నారు. ఈలోగా అణుచుకోలేని కోరిక‌లు ఉంటే.. ఫ్రెండ్స్‌లో కాలం గ‌డుపుతున్నారు.(ఇది కూడా ఒక ప్ర‌శ్న‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం).

ఇక‌, 30 ఏళ్ల త‌ర్వాతే వివాహం చేసుకుంటున్న యువ‌తుల సంఖ్య 80 శాతం గా ఉంది. 35 ఏళ్లు దాటిన త‌ర్వాత వివాహం చేసుకునే యువ‌తుల సంఖ్య 12 శాతంగా ఉంది. ఇక యువ‌కుల విష‌యానికి వ‌స్తే.. 30 ఏళ్ల వ‌ర‌కు వీరు కూడా కెరీర్‌, ఉన్న‌త చ‌దువులు అంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఆ త‌ర్వాతే వివాహం చేసుకుంటున్నారు. ఇక‌, 40 ఏళ్ల వ‌ర‌కు మాత్ర‌మే శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. ఆ త‌ర్వాత‌.. లోన్లు, ఈఎంఐలు, కుటుంబ బాధ్య‌త‌లు, త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌, స‌మాజంలో స్టేట‌స్ కోసం ఆరాటం.. ఇలా.. భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ కూడా.. ప‌రుగులు పెడుతున్నారు. దీంతో శృంగారం కేవ‌లం 10 ఏళ్ల వ‌ర‌కు ప‌రిమితం అయింద‌ని.. ఆ త‌ర్వాత‌.. అంటీముట్ట‌న‌ట్టే ఉంటున్నార‌ని.. ఇది జ‌న‌నాల‌ను త‌గ్గిస్తోంద‌న్న‌ది ప్రాధ‌మికంగా కేంద్రం ఇచ్చిన నివేదిక‌. దీనిని త్వ‌ర‌లోనే పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.