Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి త‌గ్గిన అమెరిక‌న్లు.. రీజ‌నేంటి?!

అమెరికాలో వ‌చ్చే నెల 3న జ‌ర‌గ‌నున్న మ‌ధ్యంత‌ర‌ ఎన్నికలపై చాలా మంది ఓటర్లు ముఖ్యంగా యువత, సాధారణ పౌరులు.. ఆస‌క్తి చూపించ‌డం లేదు.

By:  Garuda Media   |   31 Oct 2026 10:00 PM IST
ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి త‌గ్గిన అమెరిక‌న్లు.. రీజ‌నేంటి?!
X

అమెరికాలో వ‌చ్చే నెల 3న జ‌ర‌గ‌నున్న మ‌ధ్యంత‌ర‌ ఎన్నికలపై చాలా మంది ఓటర్లు ముఖ్యంగా యువత, సాధారణ పౌరులు.. ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఈమెయిల్‌ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా కూడా ఉన్నారు. ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి అని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌తిసారీ ఎన్నిక‌లుఅన‌గానే 99 శాతం ఓటింగ్ ఖాయ‌మ‌న్న అంచ‌నాలు నిజ‌మ‌వుతున్నాయి. కానీ, ఈ ద‌ఫా ఇది 60 శాతం కూడా దాట‌డం లేద‌ని చెబుతున్నారు.

దీనికి పలు సామాజిక, రాజకీయ, సాంకేతిక కారణాలు ఉన్నాయని విశ్లేషణలు, సర్వేలు కూడా చెబుతున్నాయి. వీటి ప్రకారం వ్యవస్థపై నమ్మకం లేకపోవడం, అభ్యర్థులు నచ్చకపోవడం, క్లిష్టమైన ఓటింగ్ విధానాలే కారణాలుగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా ఎవరు గెలిచినా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతోందని మెజారిటీ ఓటర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో ప్రధాన పార్టీలు నిలబెట్టే అభ్యర్థులు తమకు ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు కారని దాదాపు 51% మంది ఓటర్లు భావిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీల (డెమొక్రాట్లు, రిపబ్లికన్లు) విధానాలు నచ్చక ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. 'ఎలక్టోరల్ కాలేజ్` విధానం వల్ల కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల్లోని ఓట్లకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం ఉంది. తాము ఓటు వేసినా ఫలితం మారదు కాబట్టి, ఓటు వేయడం దండగ అనే ఉదాసీనత పెరిగిపోతోంది.

అమెరికాలో సాధారణంగా ఎన్నికలు పనిదినాల్లో (న‌వంబ‌రు 3 మంగళవారం) జరుగుతాయి. దాదాపు 68% మంది ఓటర్లు తమ పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోతున్నామ‌ని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. మరికొన్ని చోట్ల కఠినమైన ఓటరు ఐడీ నిబంధనలు, మెయిల్-ఇన్ బ్యాలెట్లపై వివాదాలు, ఐడీ కార్డులు లేకపోవడం వంటి కారణాల వల్ల లక్షలాది మంది ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో తొలిసారి అమెరికాలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌పై ప్ర‌జ‌లు ఆస‌క్తిగా లేర‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.