Begin typing your search above and press return to search.

మోడీ పక్కనే యోగీ...ఇమేజ్ అలాంటిది !

బీజేపీలో నరేంద్ర మోడీ వారసుడు ఎవరో చెప్పమంటే హిందూత్వ నినాదం ఎక్కువగా వినిపిస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి పేరునే ఎక్కువ మంది చెబుతారు.

By:  Satya P   |   29 July 2025 1:00 PM IST
మోడీ పక్కనే యోగీ...ఇమేజ్ అలాంటిది !
X

బీజేపీలో నరేంద్ర మోడీ వారసుడు ఎవరో చెప్పమంటే హిందూత్వ నినాదం ఎక్కువగా వినిపిస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి పేరునే ఎక్కువ మంది చెబుతారు. యోగి సైతం కుటుంబ జీవనాన్ని త్యజించారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఇక ఆయన తనకంటూ ఏమీ లేకుండానే ప్రజలకు అంకితం అయ్యారు. రాజకీయంగా చూస్తే యాభై ఏళ్ళ వయసు ఉన్న యోగీని యువ నేత కిందనే అంతా చూస్తారు. యోగీ ఇమేజ్ చూస్తే దేశమంతా ఉంది. ఒక పెద్ద రాష్ట్రానికి సీఎం గా ఆయన కొనసాగుతూ వస్తున్నారు.

నిన్న మోడీ నేడు యోగీ :

ఇక రికార్డుల పరంగా చూస్తే కనుక నిన్న మోడీ రికార్డులు బద్ధలు కొట్టారు. ఆయన దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాదిరిగా నిరాటంకంగా పలించే ప్రధానిగా కొత్త రికార్డుని నెలకొల్పారు. ఆ విధంగా 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకూ ఇందిరాగాంధీ పాలించిన పదకొండేళ్ళ కంటిన్యూస్ పాలన రికార్డుని మోడీ తాజాగా బ్రేక్ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ టెర్మ్ మొత్తం పూర్తి చేస్తే కనుక ఆయన ఇందిరాగాంధీ ప్రధానిగా ఎక్కువ కాలం పాలించిన రికార్డులను బ్రేక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇపుడు చూస్తే యూపీలో మొత్తం పాలించిన ముఖ్యమంత్రులు అందరి కంటే ఎక్కువ కాలం పాలించిన సీఎం గా యోగీ కొత్త రికార్డు నెలకొల్పారు.

ఆయనను దాటేశారుగా :

యూపీని ఎంతో మంది పాలించారు. అయితే కాంగ్రెస్ హయాంలో గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీదనే అత్యధిక కాలం పాలించిన రికార్డు ఉంది. ఆయన ఏకంగా ఎనిమిది సంవత్సరాల 127 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా యోగీ ఆ రికార్డుని అధిగమించారు. 2017 మార్చి 19న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగీ తాజాగా ఎనిమిదేళ్ళ 128 రోజులకు తన పాలన పూర్తి చేసుకున్నారు. దాంతో ఆయన యూపీలో అత్యధిక కాలం పాలించిన తొలి సీఎం గా రికార్డులకు ఎక్కారు.

రెండు సార్లు వరసగా :

యోగీ ఎంపీగా 2014లో ఉంటూండగానే 2017లో యూపీకి సీఎం అయ్యారు. అయిదేళ్ళ పాటు పూర్తిగా పనిచేసిన ఆయన నాయకత్వంలో 2022లో ఎన్నికలు యూపీకి జరిగాయి కొన్ని సీట్లు తగ్గినా మరోసారి యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో రెండవమారు ఆయనే కొనసాగారు. ఇక 2027 యూపీ ఎన్నికలు ఉన్నాయి. అంటే ఈ టెర్మ్ కూడా పూర్తి చేసుకుంటే యోగీ పదేళ్ళ సీఎం గా ఉంటారు అన్న మాట. మరి ఆ రికర్డుని బద్ధలు కొట్టాలీ అంటే ఇప్పట్లో కుదిరేది కాదేమో. ఎందుకంటే యూపీలో రాజకీయాలు అలా ఉన్నాయని అంటున్నారు.

ప్రధాని రేసులో కూడా :

ఇక యోగీ ఇమేజ్ చూస్తే జాతీయ స్థాయిలోనే ఉంది. ఆయనే మోడీకి సిసలైన వారసుడు అని అంతా అంటారు. దాంతో మోడీ కనుక తప్పుకుంటే చాన్స్ ఆయనకే ఇవ్వాలని ఆర్ ఎస్ ఎస్ కూడా భావిస్తోంది అని చెబుతారు. హిందూత్వకు మారు పేరుగా ఉంటూ దూకుడుగా రాజకీయాలు చేసే యోగీ రాజకీయ వ్యూహాలలో పదును తేరారు అని అంటారు. నిజానికి ఆయన పేరు యోగి కానీ ఆయన ఎత్తుగడలు మాత్రం వేరే లెవెల్ అని అంటారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీ నుంచి పెద్ద స్టేట్ కి సీఎం గా అయ్యారు. ఇపుడు ప్రధాని రేసులో బలమైన అభ్యర్ధిగా అవతరించారు అంటే మాటలు కాదు కదా అని అంటున్నారు. దటీజ్ యోగీ అన్న మాట.