Begin typing your search above and press return to search.

రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ మృతి.. లభ్యం కానీ మృతదేహం.. అసలేం జరిగిందంటే?.

అసలు ఇది ఎలా జరిగింది అనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   13 Jun 2026 10:59 AM IST
రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ మృతి.. లభ్యం కానీ మృతదేహం.. అసలేం జరిగిందంటే?.
X

యెమెన్ స్పైడర్ మ్యాన్ గా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అల్ ఖా ఖా ఇక లేరు. విన్యాసాలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ విన్యాసాలు చేస్తుండగానే ఒక్కసారిగా పైనుంచి వేడి నీటి గుండంలో పడి మృతి చెందడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఇది ఎలా జరిగింది అనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రియల్ స్పైడర్ మ్యాన్ గా గుర్తింపు..

ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారు అయిన కొండలను చకచకా ఎక్కేస్తూ సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు అల్ ఖా ఖా.. ఈయన కొండలపై విన్యాసాలు చేస్తూ.. రాతిపై సుద్ధతో పేర్లు రాస్తూ సాహసాలు చేసేవాడు. అంతేకాదు సాహసోపేతమైన ఈ విన్యాసాల ద్వారా స్థానికంగానే కాకుండా ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2,50,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. పైగా యెమెన్ ప్రాంతంలో ఉండే ఎత్తైన పర్వతాలను ఎక్కేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో సోషల్ మీడియాలో ఈయనను అందరూ యెమెన్ స్పైడర్ మాన్ గా ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు.

విన్యాసాలు చేస్తూ ప్రమాదం..

ఎప్పటిలాగే అల్ ఖా ఖా యెమెన్ లోని డామ్ట్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత వేడి నీటి బుగ్గల చుట్టూ ఉన్న నిటారుగా ఉండే కొండలను అవలీలగా ఎక్కేవాడు. అయితే ఈసారి ఆ ఎత్తైన కొండలపై మళ్ళీ విన్యాసాలు చేస్తుండగా అనుకోకుండా కాలుజారి లోతైన వేడి నీటి గుండంలోకి పడిపోయాడు. . అక్కడ నీరు చాలా వేడిగా ఉండడమే కాకుండా ఆ గుండం చాలా లోతుగా ఉండడంతో బయటకు రాలేక, ఆ వేడి నీటిలో పడి ఆయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.

లభ్యం కానీ మృతదేహం..

ఇకపోతే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, రెస్క్యూ టీమ్ ఆయనను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో లోతైన నీటిలో మునిగిపోయిన వారిని బయటకు తీసేందుకు అవసరమైన ప్రత్యేక డైవింగ్ పరికరాలు అందుబాటులో లేవు. పైగా పర్వతాల చుట్టూ ఉన్న ఈ లోతైన గుండంలోని నీరు వేడిగా ఉండడం, గుండం లోతుగా ఉండటంతో రెస్క్యూ టీమ్స్ దగ్గర సరైన ఆధునిక పరికరాలు లేకపోవడంతో ఆయన మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. ఏది ఏమైనా నిటారైన కొండలను, పర్వతాలను అవలీలగా ఎక్కేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ రియల్ లైఫ్ స్పైడర్ మాన్ ఇక లేరు అని తెలిసి సోషల్ మీడియా యూజర్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు . పైగా ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబానికి భగవంతుడి దయ ఉండాలి అని కోరుకుంటున్నారు.