Begin typing your search above and press return to search.

మాస్‌+క్లాస్‌.. యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు స్ట‌యిలే వేర‌యా.. !

టీడీపీకి కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో అంద‌రి దృష్టీ ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం.

By:  Garuda Media   |   8 May 2026 3:50 PM IST
మాస్‌+క్లాస్‌.. యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు స్ట‌యిలే వేర‌యా.. !
X

టీడీపీకి కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో అంద‌రి దృష్టీ ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు విజ‌యం ద‌క్కించుకున్నారు. వైసీపీ నుంచి రాజ‌కీయాలు స్టార్ట్ చేసిన యార్ల‌గ‌డ్డ ఆదిలో ఆయ‌న మాస్ లీడర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైసిపిలో ఉన్నప్పుడు ఆయన మాస్ రాజకీయాలకు దగ్గరయ్యారు. కానీ కేవలం మాస్ జనాలను మాత్రమే ఆకట్టుకుంటే రాజ‌కీయం చేయ‌లేమ‌ని భావించిన ఆయ‌న రూటు మార్చారు.

ఈ క్ర‌మంలో ఇటీవల కాలంలో ఆయన క్లాస్ లీడర్ గా కూడా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో మాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. పైగా గతంలో వంశీని అభిమానించిన వారు మాజీ ఎమ్మెల్యేకు అనుచర వర్గంగా నిలిచిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్రమంలో వారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేసిన యార్లగడ్డ వెంకట్రావు మాస్ లీడర్ గా బలంగా ఎదిగారు. నియోజకవర్గంలో అందరికీ సుపరిచితం అయ్యేలాగా ఆయన వ్యవహరించారు.

అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల దిశగా అడుగులు వేయాలని భావించిన యార్ల‌గడ్డ ఇప్పుడు క్లాస్ జనాలకు కూడా చేరువ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐటి ఉద్యోగులతో అలాగే ఉన్నత విద్యను అందించే కాలేజీల యాజమాన్యాలతో ఆయన భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రాఫ్ ప్రిపరేషన్కు ఆయన ప్రాధాన్య ఇస్తున్నారు. వాస్తవానికి తనకున్న అభిప్రాయాలతో పాటు మేధావుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలన్నది ఎమ్మెల్యే ఉద్దేశం.

ఈ క్రమంలోనే ఆయన అటు మాస్ కి, ఇటు క్లాస్ కి కూడా చేరువ అవుతూ రాజకీయంగా దూసుకు పోతున్నారు. ఈ పరిణామాలు నియోజకవర్గంలో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఒకవైపు మాస్ కి చేరువగా ఉంటూనే మరోవైపు క్లాస్ కూడా అందుబాటులో ఉంటున్నారు. అంతే కాదు ఒకటో తారీకు పింఛన్ పంపిణీ నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకు కూడా అన్ని విషయాల్లోనూ యార్లగడ్డ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. గతానికి.. ఇప్పటికే భిన్నంగా ఏముంది అనేది ఆలోచిస్తే కచ్చితంగా మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మరోసారి తనను తాను గెలిపించుకునేలాగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.