యనమలకు ఆ పదవి టీడీపీ రిజర్వ్ చేసిందా ?
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకులతో యనమల మాట్లాడుతూ తనకు రాజ్యసభకు వెళ్ళాలని ఉందని కోరికను చెప్పారని అంటున్నారు.
By: Satya P | 23 Nov 2025 7:18 PM ISTయనమల రామక్రిష్ణుడు న్యాయవాదిగా ఉంటూ రాజకీయ నేతగా టర్న్ అయ్యారు. యువకుడిగా ఉన్న కాలంలోనే అన్న నందమూరి తారక రామారావు పిలుపు అందుకుని రాజకీయ అరంగేట్రం చేశారు 1983లో తొలిసారి తుని నుంచి గెలిచిన యనమల క్షత్రియ కోటలో పాగా వేశారు. ఆ తరువాత ఆరు సార్లు ఆయన వరసగా గెలిచారు. మంత్రిగా కీలక శాఖలతో పాటు స్పీకర్ గానూ పనిచేశారు. ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు అంటే పన్నెండేళ్ళ పాటు ఆయన పెద్దల సభలో ఉన్నారు. అయితే ఈ ఏడాది మార్చి 30తో ఆయన ఎమ్మెల్సీ పదవికి రిటైర్మెంట్ ఇచ్చేశారు. అయితే యనమల మదిలో ఇంకా ఒక కోరిక ఉందని అంటున్నారు. అదే రాజ్యసభ సీటు అని చెబుతున్నారు.
ఎప్పటికైనా అంటూ :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకులతో యనమల మాట్లాడుతూ తనకు రాజ్యసభకు వెళ్ళాలని ఉందని కోరికను చెప్పారని అంటున్నారు. ఆ ఆశ తనకు ఇంకా ఉందని ఆయన అనడమూ విశేషంగా చెబుతున్నారు. అంతే కాదు ఆయన తాజాగా మాట్లాడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలల విషయంలో వైసీపీ చేస్తున్న ఆందోళనలను లైట్ గా తీసుకోరాదని అధికార పార్టీకి సూచించారు. క్షేత్ర స్థాయికి వైసీపీ ఆందోళనలు చేరుకుంటున్నాయని యనమల చెప్పడమూ ఇక్కడ విశేషం. వైసీపీలో కసి ఉందని ఆయన అన్న మాటలూ టీడీపీ పెద్దల దాకా వెళ్ళింది అని అంటున్నారు మరి ఆయన ఎందుకు ఈ కామెంట్స్ చేశారు ఏ సందర్భంలో చేశారు. ఆయన ఇచ్చిన సంకేతాల వెనక సందేశాలు ఏమై ఉంటాయన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది.
పార్టీ పెద్దల చర్చ :
ఇదిలా ఉంటే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దల మధ్య యనమల తాజాగా వ్యాఖ్యల మీద చర్చ జరిగింది అని అంటున్నారు. యనమల రాజ్యసభ పదవి కోరుకున్నారని అయితే ఆయన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారుట. ఆయనకు ఒక మంచి పోస్టునే పార్టీ రిజర్వ్ చేసి ఉంచిందని కూడా చెబుతున్నారు. అయితే ఇదే చర్చలో మరో సీనియర్ నేత అయితే యనమల స్థాయికి తూగే పదవులు అయితే ప్రస్తుతం పార్టీలో లేవని అందువల్ల ఆయనకు అవకాశం దక్కాలీ అంటే కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు అని అంటున్నారు
పార్టీలో పెద్ద పీట :
ఇంకో వైపు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి, కాబట్టి పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న యనమలకు పార్టీ పదవి ఒకటి రెడీ గా ఉందని ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు అని కూడా చెప్పారని టాక్ నడుస్తోంది. అయితే యనమల ఈ మధ్య దాకా మౌనంగానే ఉన్నారు, ఇపుడు వైసీపీని లైట్ తీసుకోవద్దు అని చేస్తున్న హెచ్చరికలు కానీ అలాగే ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద అయన కామెంట్స్ కానీ టీడీపీ హైకమాండ్ ని తాకేలాగానే ఉన్నాయని అంటున్నారు.
యనమల యత్నాలు :
ఇవన్నీ పక్కన పెడితే యనమల ప్రయత్నాలు అయితే గట్టిగానే చేసుకుంటున్నారు అని అంటున్నారు. మరో ఆరేడు నెలలలో రాజ్యసభకు నాలుగు ఖాళీలు వస్తున్నాయి. అందులో ఒకదానిని కోరేందుకు యనమల చూస్తున్నారు అని అంటున్నారు. నిజానికి యనమల కోరిక ఈనాటిది కాదు, 2012లోనే ఆయన రాజ్యసభ తీసుకోవాలని అనుకున్నారు. అది కుదరలేదు, ఆ తరువాత 2016లో మరోసారి అడిగినట్లుగా ప్రచారం సాగింది. ఇక 2019 తరువాత టీడీపీకి ఎమ్మెల్యేలు పెద్దగా లేకపోవడంతో యనమల ఆగారు, 2024లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి నాలుగు రాజ్యసభ మెంబర్స్ ని ఏపీ నుంచి పంపిస్తే టీడీపీ రెండు బీజేపీ రెండూ తీసుకున్నాయి. మరి 2026లో ఏమి జరుగుతుందో తెలియదు కానీ యనమల ఇప్పటి నుంచే ట్రయల్స్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు.
