Begin typing your search above and press return to search.

'జీసస్' వీడియో వైరల్... రెజ్లింగ్ లో షాకింగ్ ఘటన!

అవును... ప్రేక్షకులను కట్టిపడేసే ప్రొఫెషనల్ రెజ్లింగ్ లో ఫైట్స్ ఎంతో క్రియేటివ్ గా ఉంటాయనేది తెలిసిన విషయమే.

By:  Raja Ch   |   29 Sept 2025 1:20 AM IST
జీసస్ వీడియో వైరల్... రెజ్లింగ్  లో షాకింగ్  ఘటన!
X

2002లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌ టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)గా పేరు మార్చబడిన వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)లో ఫైట్స్ ఎంత క్రియేటివ్ గా, మరెంత అట్రాక్టివ్ గా ఉంటాయనేది తెలిసిన విషయమే. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఎంతో డ్రామాతో ఇవి కూడి ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా వైరల్ అయిన వీడియోలో ఓ రెజ్లర్ తనను తాను ‘జీసస్’ అని చెప్పుకుంటూ క్రియేట్ చేసిన ఫైట్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ప్రేక్షకులను కట్టిపడేసే ప్రొఫెషనల్ రెజ్లింగ్ లో ఫైట్స్ ఎంతో క్రియేటివ్ గా ఉంటాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ రెజ్లర్ సినిమాల్లోనూ, ఫోటోల్లోనూ జీసస్ ధరించిన దుస్తుల్లాంటివి ధరించి రింగులోకి ఎంటరయ్యాడు. అనంతరం ప్రత్యర్థిని ముట్టుకోకుండానే ఫైట్ చేసి, అతడిని నేల కూల్చాడు! అనంతరం గెలిచాడు!!

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వాస్తవానికి ఇప్పటివరకూ చాలా మంది రెజ్లర్లు రకరకాల వేషధారణల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జంతువుల్లా, రాక్షసుల్లా, సైతాన్ లా, మెడలో పాములు వేసుకుని, అడవి మనుషుల్లా, రకరకాల గెటప్స్ లో ఎంట్రీ ఇచ్చారు.. అలరించారు. అయితే తొలిసారిగా ఓ రెజ్లర్ ఏకంగా జీసస్ లా తనను తాను చెప్పుకుంటూ రింగ్ లోకి అడుగుపెట్టాడు.

అయితే ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్ని కూడా ఎంటర్ టైన్మెంట్ లో భాగంగానే చూడాలి తప్ప, మరో రకంగా చూడకూడదని కొంతమంది అంటున్నారు. ప్రతీదానికీ లిమిట్ ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్లు ఇలా చేయరు, వందల కోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటూ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.