ఈ ప్రపంచానికి ఏమైంది.... బితుకు బితుకుగా బతుకు !
మరోవైపు గురువారం వెనిజులాలో 7.2 7.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. వీటి వల్ల కనీసం 920 మంది మరణించారని అంచనా.
By: Satya P | 28 Jun 2026 9:38 AM ISTప్రపంచం ఇపుడు పెను ప్రమాదంలో పడిందా అంటే సూచనలు సంకేతాలు అలాగే ఉన్నాయి. కరోనా అనంతరం చూస్తే పరిస్థితులు అన్నీ కూడా అదే విధంగా మారుతున్నాయి. ఒక వైపు దేశాల మధ్య యుద్ధాలు మరో వైపు ఆర్ధిక మాంద్యం, ఇంకో వైపు సూపర్ ఎల్ నినో ఇపుడు చూస్తే వరస భూకంపాలు వీటి మధ్యలో ప్రపంచం భయానకమైపోతోంది. బితుకు బితుకుగా బతుకు మారుతోంది. గురువారం వెనిజులాలో వరసగా రెండు సార్లు వచ్చిన అత్యంత భయంకరమైన భూకంపాల తాకిడికి ఎంతటి ప్రాణ నష్టం ఆస్థి నష్టం జరిగిందో ఊహకు అందడం లేదు. అక్కడ ప్రకంపనలు అలా ఉండగానే ఇపుడు ఇతర దేశాలను కూడా భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి.
భారత్ లో కూడా :
లేటెస్ట్ గా చూస్తే ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో భారత్ లోని పలు ప్రాంతాలు సైతం ప్రకంపించాయి. అలా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఇక ఢిల్లీ శ్రీనగర్‌తో సహా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి అంతే కాదు పాకిస్థాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. దాంతో భారత్, పాకిస్తాన్, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ తుర్క్‌మెనిస్తాన్‌లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ హర్యానాతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.
భయపడిన జనాలు :
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్‌లో శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్, కుప్వారా జమ్మూ జిల్లాలతో సహా కేంద్రపాలిత ప్రాంతంలోని పలు ప్రాంతాలలో అయితే ఈ భూకంపాలు నివాసితులు ముందు జాగ్రత్తగా భయాందోళనలతో తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు కానీ ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు ఈ భూకంపం మధ్యస్థ స్వభావం కలదని చెబుతున్నారు. ఈ భూకంపం భూమికి 215 కిలోమీటర్ల లోతులో సంభవించిందని చెబుతున్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్, ఫైసలాబాద్ ఇస్లామాబాద్ వంటి నగరాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. స్వాత్ ప్రాంతంలో భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీనికి ముందు, శుక్రవారం నుండి పాకిస్థాన్ ఆగ్నేయ ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్‌లో కనీసం ఐదు మధ్యస్థ తీవ్రత కలిగిన భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంలో భూకంప కార్యకలాపాలు గణనీయంగా తాజాగా నమోదవుతున్నాయి.
వెనిజులా విపత్తు ఉండగానే :
మరోవైపు గురువారం వెనిజులాలో 7.2 7.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. వీటి వల్ల కనీసం 920 మంది మరణించారని అంచనా. అంతే కాదు ఏకంగా 51 వేల మందికి పైగా ప్రజానీకం గల్లంతయ్యారు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఈ వారం సంభవించిన వినాశకరమైన వెనుజులా భూకంపాల కారణంగా బాధితులకిన వారి కోసం గాలింపు చర్యల్లో సహాయపడేందుకు విదేశీ సహాయక బృందాలకు చెందిన పదహారు వందల మంది సభ్యులు చేరుకున్నారని వెనిజులా ప్రభుత్వం తాజాగా తెలిపింది. అదే సమయంలో, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రంలోకి ప్రవేశాన్ని ప్రభుత్వం కఠినతరం చేసింది.
ఏదో జరుగుతోంది :
ప్రపంచం ఇపుడు చాలా సవాళ్ళను ఎదుర్కొంటోంది. సూపర్ ఎల్ నినో ప్రభావం ఆసియా దేశాల మీద తీవ్రంగా ఉంది. భారత దేసంలోని సగం రాష్ట్రాలు దీని బారిన పడుతున్నాయి. ఎల్ నినో వల్ల వర్షాభావంతో పంటలు పండక ఆహార ద్రవ్యోల్బణం కూడా తీవ్ర తరం అవుతోందని అంచనాలు ఉన్నాయి. అంతే కాదు అది ఆర్ధికంగా పెను ప్రభవం చూపిస్తోంది అని అంటున్నారు. యుద్ధాల వల్ల ముడి చమురు కొరతతో ఇప్పటికే దేశాలు అల్లల్లాడాయి, యుద్ధాలు ఆగుతాయా అన్నది క్లారిటీ లేదు, దాంతో ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని నేపధ్యంలో ప్రకృతి కూడా పగపడితే ఈ ప్రపంచం ఎలా బ్రతికేది అన్నదే అందరినీ ఆలోచింపచేస్తున్నది.
