Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందంటే... పిక్స్ వైరల్!

అవును... భారతదేశంలో క్రికెట్ క్రేజ్ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అంతా టీవీల ముందు అతుక్కుపోతారు.

By:  Raja Ch   |   2 Nov 2025 6:25 PM IST
ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందంటే... పిక్స్ వైరల్!
X

భారతదేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజియన్ అని అంటారు. ఈ దేశంలో క్రికెట్ ఒక క్రీడ మాత్రమే కాదు. అదొక ఎమోషన్, అదొక సెంటిమెంట్, అదొక బలం. ఇక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తూ బిగ్ స్క్రీన్లు అరేంజ్ చేస్తే.. ఇక ఆ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పుడు ఏపీలో కనిపిస్తుంది.




అవును... భారతదేశంలో క్రికెట్ క్రేజ్ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అంతా టీవీల ముందు అతుక్కుపోతారు. ఈ క్రమంలో ఇటీవల సెమీ ఫైనల్ లో ఆసిస్ పై రికార్డ్ స్థాయి విక్టరీ నమోదు చేసిన మహిళల క్రికెట్ టీం.. ఫైనల్ పై అంచనాలను అమాంతం పెంచేసింది.




ఈ క్రమంలో తాజాగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ లో తలపడుతుంది. టాస్ గెలిసిన టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టింది. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోయింది! అయితే ఏపీలో మాత్రం మరింత ఎక్కువ సందడి నెలకొంది. ఇందులో భాగంగా... మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.




టెంట్ లు వేసి, కుర్చీలు ఏర్పాటు చేసి మరీ బిగ్ స్క్రీన్లు అరేంజ్ చేయడంతో ఆ ప్రాంతాల్లో అభిమానుల కేరింతలు మార్మోగుతున్నాయి. ప్రధానంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ ఫైనల్ మ్యాచ్ చూడటం కోసం బిగ్ స్క్రీన్ల ముందు కూర్చున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలోనూ ఏర్పాట్లు చేశారు. దీంతో.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను అందరితో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.




దీంతో... ఇలాంటి కార్యక్రమాలు ప్రజలను కలుపుతూ, క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్న మంచి ముందడుగు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకస్వరంతో ప్రార్థనలు చేస్తున్నారు. సెమీ ఫైనల్ లో ఆసిస్ పై సాధించిన స్థాయిలో సూపర్ విక్టరీ సాధించాలని ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.




ఇలా భారత్ - సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను అంతా కలిసి ఒకేచోట కూర్చుని చూసేలా రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి పార్టీ నేతలు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎవరింట్లో వాళ్లు కూర్చుని చూడటంతో పోలిస్తే ఇది రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందని అంటున్నారు.