Begin typing your search above and press return to search.

ఏపీ మ‌హిళా నేత‌లు: ఏ పార్టీలో ఎలా ..!

వ‌చ్చే ఎన్నికల నాటికి మ‌హిళా నాయ‌కుల‌కు ప్రాధాన్యం పెర‌గ‌నుంది. రానున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వి భ‌జ‌న‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం చిక్కుతుంది.

By:  Garuda Media   |   12 April 2026 6:00 AM IST
ఏపీ మ‌హిళా నేత‌లు:  ఏ పార్టీలో ఎలా ..!
X

వ‌చ్చే ఎన్నికల నాటికి మ‌హిళా నాయ‌కుల‌కు ప్రాధాన్యం పెర‌గ‌నుంది. రానున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వి భ‌జ‌న‌ను దృష్టిలో పెట్టుకుంటే.. ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం చిక్కుతుంది. మొత్తంగా 80 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పైగానే మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వ్ కానున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం పార్టీల‌ ప‌రిస్థితి ఎలా ఉంది? ఆయా పార్టీలో మ‌హిళా నాయ‌కుల ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది ఆస‌క్తిక‌ర అంశం.

టీడీపీని తీసుకుంటే.. అసెంబ్లీ, పార్ల‌మెంటు ప‌రంగానే కాకుండా.. పార్టీ ప‌రంగా కూడా.. 33 శాతం రిజ‌ర్వే షన్లు అమ‌లు చేయాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది. అయితే.. ఇప్పుడున్న సంఖ్య‌ప‌రంగా చూస్తే.. టీడీపీ లో మ‌హిళా నాయ‌కుల అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది. పార్టీ ప‌రంగానే ఎక్కువ మంది నాయ‌కురాళ్ల‌కు అవ‌కాశం ల‌భించ‌నుంది. సో.. ఇప్పుడు అసెంబ్లీ, పార్ల‌మెంటు ప‌రంగా మ‌రింత మంది అవ‌స‌రం ఏర్ప‌డుంది.

వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మ‌హిళా నాయ‌కుల సంఖ్య టీడీపీతో పోల్చుకుంటే త‌క్కువ‌గానే ఉంది. క్షేత్ర‌స్థా యిలో మ‌హిళా నాయ‌కులు త‌క్కువ మంది క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారి సంఖ్య‌ను పెంచేందుకు పార్టీ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీ ప‌రంగా మ‌హిళా విభాగం కోసం కూడా.. నాయ‌కురాళ్లు లేక ఖాళీలు కూడా అలానే ఉంచారు. ఇక‌, అసెంబ్లీ , పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి వీరి సంఖ్య పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.

జ‌న‌సేన‌, బీజేపీ: ఈ రెండు పార్టీల్లోనూ మ‌హిళా నాయ‌కుల సంఖ్య ఆశించినంత అయితే లేదు. జ‌న‌సేన లో వీర మ‌హిళ విభాగం ఉన్న‌ప్ప‌టికీ.. అది పెద్ద‌గా బ‌లోపేతం కావ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో మ‌హిళా నాయకుల‌ను ప్రోత్స‌హించే విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నా.. అవి అమ‌లు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బీజేపీ విష‌యంలో మ‌హిళా నాయ‌క‌త్వం మ‌రింత పెర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఉన్న‌వారి సంఖ్య నామ‌మాత్రంగానే ఉంది. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ పార్టీలలో మ‌హిళా నాయ‌కుల కొర‌త క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.