డేటింగ్ యాప్.. వీళ్లు మామూలు ముదుర్లు కాదండోయ్!
అప్డేట్ అవుతున్న జనరేషన్లో చాలామంది మహిళలు, పురుషులు డేటింగ్ యాప్ లను వాడుతున్నారు.
By: Madhu Reddy | 28 Aug 2025 7:00 PM ISTఅప్డేట్ అవుతున్న జనరేషన్లో చాలామంది మహిళలు, పురుషులు డేటింగ్ యాప్ లను వాడుతున్నారు. ఈ డేటింగ్ యాప్ ద్వారా తమ అభిరుచులకు సెట్ అయిన పురుషుడిని గానీ మహిళను గానీ ఎంచుకొని కొన్ని రోజులు డేటింగ్ చేసి పెళ్లిళ్లు చేసుకోవడం చేస్తున్నారు. ఇక మరికొన్ని మ్యాట్రిమోనీ యాప్ లలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని పర్ఫెక్ట్ జోడి కోసం వెతుక్కుంటున్నారు. అయితే తాజాగా డేటింగ్ యాప్ లకు సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే డేటింగ్ యాప్ లను మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవారే యూస్ చేస్తున్నారట. అవును మీరు వినేది నిజమే.. తాజాగా ఒక ప్రముఖ డేటింగ్ యాప్ సిఈఓ ఈ విషయాన్ని బయటపెట్టారు. మరి ఇంతకీ ఆయన చెప్పిన విషయంలో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఇంట్లో మహిళలకు కట్టుబాట్లు అనేవి ఉంటాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏ టైంకి రావాలి.. ఎవరెవరితో ఉండాలి అనేది ఇంట్లో అమ్మా, నాన్న, అన్న, భర్త ఇలా ఎవరో ఒకరు కండిషన్ పెడుతూ ఉంటారు. కానీ ఇప్పటి జనరేషన్ చాలా మారిపోయింది. అమ్మాయిలు కూడా పురుషుల లాగే అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అలా అబ్బాయిలతో సరి సమానంగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే అన్ని రంగాల్లో లాగే ఈ డేటింగ్ యాప్ లలో కూడా మగాళ్లకు మేము ఏమాత్రం తీసిపోము అంటున్నారు అమ్మాయిలు. ఎందుకంటే తాజాగా ఒక ప్రముఖ డేటింగ్ యాప్ వాళ్లు తమ డేటింగ్ యాప్ లో మగవాళ్ళ కంటే మహిళ యూజర్ లే ఎక్కువగా ఉన్నారంటూ తేల్చేశారు.
తాజాగా Knot డేటింగ్ యాప్ సీఈఓ అయినటువంటి జస్వీర్ సింగ్ డేటింగ్ యాపుల్లో మహిళా యూజర్ లే ఎక్కువ ఉన్నారని, మగవాళ్ళు తక్కువగా ఉన్నారని తెలియజేశారు. జస్వీర్ సింగ్ మాట్లాడుతూ..Knot డేటింగ్ యాప్ లో 57% మహిళ సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటూ తెలియజేశారు.ఇక 57% మహిళా సబ్స్క్రైబర్లు ఉంటే మిగిలిన 43% మంది పురుష యూజర్లు ఉన్నారన్నమాట. అలా వాళ్ళ డేటింగ్ యాప్ లో మగవాళ్ళ కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలియజేశారు. అంతే కాదు మా డేటింగ్ యాప్ లో ఆరు నెలల సబ్స్క్రిప్షన్ కోసం 57,459 రూపాయల ఫీజు పెట్టినా కూడా మహిళ యూజర్లు వెనకడుగు వేయడం లేదు. మగవాళ్ళ కంటే వీళ్లే ఎక్కువ డబ్బులు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటూ సంచలన విషయం బయటపెట్టారు. ప్రస్తుతం Knot డేటింగ్ యాప్ సీఈవో చెప్పిన ఈ విషయం విన్న చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాదు కలికాలం అంటూ మరి కొంతమంది మగవాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక అమ్మాయిలేమో మగవాళ్ళ కంటే అమ్మాయిలు ఏ విషయంలో కూడా తీసిపోరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆన్లైన్లో టిండర్,బంబుల్, గ్రిండర్, Knot వంటి ప్రముఖ డేటింగ్ యాప్ లు ఉన్నాయి. డేటింగ్ యాప్ ల వల్ల చాలామంది అభిప్రాయాలు కలిసి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. మరి కొంతమంది పెళ్లిళ్లు కాకుండా డేటింగ్ లు చేసి నచ్చకపోతే బ్రేకప్ చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
