Begin typing your search above and press return to search.

ఇది వేరే రేంజ్ రివేంజ్.. బాయ్ ఫ్రెండ్ షూస్ కలెక్షన్స్ అమ్మేసింది!

రివేంజ్ లు పలు రకాలుగా ఉంటాయి. ఈ విషయంలో ప్రియురాలి ప్రతీకారం మరో రేంజ్ లో ఉంటుందని అంటారు.

By:  Raja Ch   |   23 Oct 2025 2:00 AM IST
ఇది వేరే రేంజ్ రివేంజ్.. బాయ్ ఫ్రెండ్ షూస్ కలెక్షన్స్  అమ్మేసింది!
X

రివేంజ్ లు పలు రకాలుగా ఉంటాయి. ఈ విషయంలో ప్రియురాలి ప్రతీకారం మరో రేంజ్ లో ఉంటుందని అంటారు. ఈ క్రమంలో తనను సరిగ్గా పట్టించుకోకపోవడంతో పాటు సోషల్ మీడియాలో ఇతర మహిళలను ఫాలో అవుతూ సమయాన్ని వెచ్చిస్తున్నాడని ఆరోపిస్తూ.. తన బాయ్ ఫ్రెండ్ కు షాకిచ్చింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అవును... టిక్‌ టాక్, ఇన్‌ స్టాగ్రామ్, ట్విట్టర్‌ లలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఒక మహిళ తన ప్రియుడి వేల డాలర్ల విలువైన షూ కలెక్షన్ మొత్తాన్ని కేవలం $250కి అమ్మేస్తున్నట్లు చూపిస్తుంది. అందుకు ఆమె చెప్పిన కారణం.. ఆన్‌ లైన్‌ లో ఇతర మహిళలను అనుసరిస్తూ తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు కానీ... తనను పట్టించుకోకపోవడంతో విసిగిపోయానని ఆమె చెబుతోంది.

ఓ కారు డిక్కీలో ఆ షూస్ అన్నింటినీ తిసుకొచ్చిన ఆమె.. వాటిని అమ్మడానికి ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో ఉంది. ఈ సందర్భంగా... ఆ షూస్ అన్నింటికీ కలిపి విలువ సుమారు $1,500 ఉంటుందని అతను అంచనా వేసినప్పుడు, ఆమె దానిని తోసిపుచ్చింది. ఆమె 300 డాలర్లకు అవన్నీ అమ్మడానికి సిద్ధపడింది.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె తన ఉద్దేశాలను స్పష్టంగా చెబుతుంది. ఇందులో భాగంగా... 'నేను $300 అన్నాను, నాకు పట్టింపు లేదు.. నేను అతని చెత్తనంతా $300 కి అమ్మేశానని అతను చూసినప్పుడు అతని ముఖంలో ఎలాంటి చూపు ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను' అని తెలిపింది. ఆ సమయంలో కొనుగోలుదారుడు ఇంకా తక్కువ ఇవ్వడానికి ముందుకొస్తే.. ఆమె ఏమాత్రం సంకోచించకుండా $250 కి అంగీకరిస్తుంది,.

వైరల్ అవుతున్న పోస్ట్స్ ప్రకారం... కొంతకాలంగా వీరి మధ్య సంబంధం వీగిపోతూ ఉంది.. ఫైనల్ గా తెగిపోయింది! రెగ్ల్యులర్ గా అతడు ఆమెను కలిసి ప్లాన్స్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాడని.. మెసేజ్ లకు ఆలస్యంగా సమాధానాలు ఇస్తున్నాడని.. అంత కంటే ముందు అతను ఫోన్‌ లోనే ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఆన్‌ లైన్‌ లో చాలా మంది మహిళలను అనుసరిస్తున్నాడని ఆమె తెలుసుకుందని అంటున్నారు.

ఇక వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... ఇది రివేంజ్ కాదు, అంతకు మించి అని ఒకరంటే.. మరికొంతమంది ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. నియంత్రణను తిరిగి పొందడానికి ఇది ఓ క్రియేటివ్ మార్గం అని పేర్కొన్నారు. మరికొంతమంది మాత్రం.. ఇలాంటి పనులు బంధాన్ని మరింత విచ్ఛిన్నం చేస్తాయని అభిప్రాయపడ్డారు.