Begin typing your search above and press return to search.

'అందం కంటే డబ్బే ముఖ్యం'... మహిళ కామెంట్స్ వైరల్!

అవును... అమ్మాయిలకు తాను చేసుకోబోయే వ్యక్తి అందం ముఖ్యమా.. అతని డబ్బు ముఖ్యమా..? అనే ప్రశ్నకు ఓ మహిళ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

By:  Raja Ch   |   8 Nov 2025 2:43 PM IST
అందం కంటే డబ్బే ముఖ్యం... మహిళ కామెంట్స్  వైరల్!
X

కట్టుబోయే వ్యక్తి అందం ముఖ్యమా, అతని డబ్బే ముఖ్యమా (గుణం ప్రస్తుతానికి అప్రస్తుతం!) అనే ప్రశ్నకు తాజాగా ఓ మహిళ ఇచ్చిన సమాధానం ఆసక్తిగా మారింది. తాజాగా ఓ యూట్యూబర్ ఓ మహిళను అడిగిన ఈ ప్రశ్నకు... తనకు డబ్బే ముఖ్యమని సమాధానం వచ్చింది. వ్యక్తి అందంగా లేకపోయినా తనకు అభ్యంతరం లేదని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అవును... అమ్మాయిలకు తాను చేసుకోబోయే వ్యక్తి అందం ముఖ్యమా.. అతని డబ్బు ముఖ్యమా..? అనే ప్రశ్నకు ఓ మహిళ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... తనకు వ్యక్తి అందగా లేకపోయినా అభ్యంతరం లేదని.. కాని, అతని పర్సు మాత్రం అందంగా (బరువుగా) ఉండాలని చెప్పారు. తన భర్త ఏది కోరుకున్నా దానికంటే బెస్ట్ ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

వాస్తవానికి ఈ విషయంపై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... డబ్బే ముఖ్యమనేది సరైన సమాధానమే అని ఒకరంటే.. జంట ఉన్నంతలో ఈడూ జోడుగా ఉండటం కూడా ముఖ్యమేనని.. కేవలం డబ్బుకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం సరైంది కాదని చెప్పుకొస్తున్నారు. ఈ రెండింటి మధ్య అతని క్యారెక్టర్, అతను చూపించే ప్రేమ ప్రస్థావన ప్రధాన్యతకు వస్తుండటం గమనార్హం.

ప్రేమ, అందం బిల్లులు చెల్లించదు కదా?:

ఈ సందర్భంగా.. భర్త నిత్యం ఐ లవ్ యూ చెబుతాడు, ప్రేమగా మాట్లడతాడు, ఉన్నంతంలో ప్రేమగా చూసుకుంటాడు, తనను తప్ప మరెవరివైపూ ఆకర్షితుడు కాడు అనే అనుకున్నా... ఆ ప్రేమ, అతని అందం బిల్లులు చెల్లించదు కదా అనేది ఒక వర్గం అభిప్రాయంగా ఉంది. అందుకే ఈ రెండింటికీ ప్రాధాన్యత తగ్గించి, డబ్బున్న వారికే తమ ఓటు అని అంటున్నారు.

డబ్బే వెనుక నమ్మకద్రోహం ఉండకూడదు!:

ఈ సందర్భంగా తాను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని.. ఈ జీవితం తొలుత చాలా విలాసవంతంగా ఉండేదని.. అయితే.. ఈ విలాసాల వెనుక, సౌకర్యాల మాటున నమ్మకద్రోహాలూ చోటు దక్కించుకున్నాయని మరికొందరు తన అభిప్రాయాలు చెప్పుకొస్తున్నారు! డబ్బు ఉండటం తప్పు కాదు, అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ వీటి మధ్యలో నమ్మకద్రోహానికి చోటు ఉండకూడని నొక్కి చెబుతున్నారు.

అన్నింటి కంటే ప్రేమే ముఖ్యం!:

కేవలం డబ్బుంది అనే కారణంతోనే ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు.. పరిస్థితులు ముందు ముందు అంత తేలికగా ఉండకపోవచ్చనే వారూ లేకపోలేదు. వివాహంలో అందం, డబ్బు కంటే ప్రథమ స్థానం ప్రేమకు, మద్దతుకు ఇవ్వాలని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. భాగస్వాముల మధ్య ప్రేమ, సున్నితత్వం లేకపోతే సంసారమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు.

ఏది ఏమైనా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు, ఎవరి అనుభవాలు, ఎవరి ఆశలు, ఎవరి ఆలోచనలు వారివని.. ఆ విధంగానే వారు ముందుకు వెళ్తుంటారని కన్ క్లూజన్ ఇస్తున్నారు మరికొందరు!