వజ్రాల వేటలో మహిళకు అదృష్టం.. విలువ ఎంతంటే?
చాలామంది కోటీశ్వరులు అవ్వడానికి ఏవేవో చూస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఏమి చేయకుండానే అదృష్టం తలుపు తడుతుంది.
By: Srikanth Kontham | 15 Aug 2025 3:00 PM ISTచాలామంది కోటీశ్వరులు అవ్వడానికి ఏవేవో చూస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఏమి చేయకుండానే అదృష్టం తలుపు తడుతుంది. అలా వెతకపోయిన తీగ కాళ్లకు తగిలినట్లు.. అప్పుడప్పుడు అదృష్టం అనుకోకుండానే మన ఇంటి తలుపు తట్టేస్తుంది. అలా తాజాగా ఓ మహిళకు కూడా ఇదే జరిగింది. అయితే ఈ మహిళ అలా నడుస్తూ వెళుతుండగా దాదాపు లక్షల విలువ చేసే రాయి కాళ్లకు తగిలిందట. ఇదేంటి అని పైకి తీసి చూడగా వజ్రం..అక్షరాల లక్షలు ఖరీదు చేసే వజ్రం.. ఆమె చేతిలో ఆ వజ్రాన్ని చూసి తెగ మురిసిపోయింది. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు..? ఆమెకు దొరికిన వజ్రం ఖరీదు ఎంత ?అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది పార్కుకి ఎందుకు వెళ్తారు.. మనసు ఉల్లాసంగా ఉంచుకోవడం కోసమో.. లేక ప్రశాంతమైన వాతావరణంలో గడపడం కోసమో.. లేక నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అలా వాకింగ్ చేయడం కోసమో వెళ్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పార్క్ కి మాత్రం వజ్రాల వేటకోసమే వెళ్తారట. అవును మీరు వినేది నిజమే. ఈ పార్కు వజ్రాల వేటకు ఫేమస్.. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే చాలా వజ్రాలు దొరికాయట.అందుకే చాలామంది అక్కడి ప్రజలు డబ్బులు చెల్లించి మరీ ఆ పార్కుకి వెళ్లి ఏదైనా వజ్రం దొరకక పోతుందా.. తమ అదృష్టం తలుపు తట్టకపోతుందా అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ పార్కులో వజ్రాల వేట చేస్తూ ఉంటారట. అయితే డబ్బులు కట్టి పార్కులోకి వెళ్లి వజ్రాల కోసం వెతికిన ప్రతి వారికి ఆ వజ్రాలు దొరకవు.ఎవరో కొందరికి మాత్రమే దొరుకుతాయి. కానీ ఇప్పటివరకు ఆ పార్కులో చాలామందికి వజ్రాలు దొరికాయట.
ఇక ఆ పార్కు పేరు ఏంటంటే అమెరికాలోని అర్కన్సాస్ స్టేట్ పార్క్. ఈ పార్కు వజ్రాలవేట కి ఫేమస్.. 37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులోకి చాలామంది ప్రతిరోజు వజ్రాల వేట కోసం వస్తారట. ఇక వజ్రాల కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరు 15 డాలర్లు చెల్లించి ఆ తర్వాత వజ్రాల వేట ప్రారంభించవచ్చట.. తాజాగా అలా వెళ్ళిన 31 ఏళ్ల మిషెర్ ఫాక్స్ అనే మహిళకు దాదాపు రూ.24 లక్షల ఖరీదు చేసే ఒక వజ్రం దొరికింది. ఆ మహిళా అర్కన్సాస్ స్టేట్ పార్కులో అలా నడుస్తూ వెళ్తుండగా ఏదో కాలికి రాయి తగిలింది అని, దాన్ని పైకి తీసి చూడగా 2 క్యారెట్ల తెల్లటి వజ్రం అని తేలింది.
ఇక దాని విలువ సుమారు 27 వేల డాలర్లు (అంటే మన ఇండియన్ కరెన్సీ లో 24 లక్షలు అని) అంచనా వేస్తున్నారు. అయితే పెళ్లి కానీ ఆ మహిళ కి 24 లక్షల ఖరీదు చేసే వజ్రం దొరకడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.ఆ వజ్రాన్ని చేతిలో పట్టుకొని మురిసిపోతూ ఈ వజ్రాన్ని నా ఎంగేజ్మెంట్ రింగులో పెట్టుకుంటా అంటూ తెగ సంబరపడిపోతుంది.. అయితే ప్రతి ఏడాది ఈ అర్కాన్సస్ స్టేట్ పార్క్ కి లక్షలాదిమంది డబ్బులు చెల్లించి వజ్రాల వేటకు వస్తారట. అలా ఈ ఏడాది దాదాపు 350 కి పైగా మందికి వజ్రాలు దొరికాయట.
