వైరల్ వీడియో... ఈ మహిళకు పాస్ పోర్ట్ పాకెట్ డైరీ లాంటిది!
అవును... ఒకప్పుడు ఫోన్ నెంబర్లు, ఆర్ధిక పరమైన విషయాలు అన్నీ కాగితాలపైనే రాసుకునేవారనే సంగతి తెలిసిందే!
By: Raja Ch | 17 Nov 2025 2:00 AM ISTఒకప్పుడు కిరణా షాప్ నుంచి తేవాల్సిన సరుకుల లిస్ట్, ఫోన్ నెంబర్లు, నెల వారీ ఖర్చులు, ఉన్న అప్పులు మొదలైనవాటన్నింటికీ పాకెట్ డైరీలను వాడేవారు! కాగితాలపై రాసుకుంటే అదో ధైర్యం అని భావించేవారు! అయితే ఇప్పుడు కాలం మారింది.. అంతా డిజిటల్ యుగం అయిపోయింది.. స్మార్ట్ ఫోన్ లోనే అన్నీ దాచుకునే పరిస్థితి వచ్చేసింది. అయినప్పటికీ పాస్ పోర్ట్ ను పాకెట్ డైరీగా వాడిన ఓ మహిళ విషయం మరోసారి వైరల్ గా మారింది.
అవును... ఒకప్పుడు ఫోన్ నెంబర్లు, ఆర్ధిక పరమైన విషయాలు అన్నీ కాగితాలపైనే రాసుకునేవారనే సంగతి తెలిసిందే! అయితే ఆ నాటి కాలంలోని అలవాటు ఇప్పటికీ చాలా మందికి పోలేదని చెబుతారు. వారికి ఇప్పటికీ ఏదైనా బుక్, పేపర్ పైన రాసుకుంటేనే కంఫర్ట్ అని అంటారు. కేరళలోని ఓ మహిళ పరిస్థితి కూడా అదేనేమో! అందుకే ఆమె పాకెట్ డైరీ బదులు తన భర్త పాస్ పోర్ట్ ను వాడేసింది. దీనికి సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది.
ఇందులో భాగంగా... కేరళలోని ఓ మహిళ పాస్ పోర్ట్ ను వాడిన తీరు మరోసారి వైరల్ గా మారింది. రెన్యువల్ కోసం ఆ పాస్ పోర్ట్ ను ఆఫీసుకు తీసుకెళ్లగా.. అది చూసిన అధికారులు ఒక్కసారిగా షాకైపోయారు. కారణం... ఆ పాస్ పోర్ట్ లో ఉండాల్సిన ట్రావెల్ హిస్టరీ బదులు ఫోన్ నెంబర్లు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు రాసిపెట్టుకున్నారు. ఒక్క పేజీ కూడా లేకుండా మొత్తం ఫిల్ చేసేశారు!
ఇది చూసిన అధికారులు ఒక్కసారిగా షాకై... మేడం ఇది పాస్ పోర్టే కానీ, డైరీ కాదంటూ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి! మరోవైపు ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు... "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని ఒకరంటే... "ఈమె నిజంగా భారతీయురాలే!" అని మరొకరు స్పందించారు. వాస్తవానికి ఇది పాత సంఘటనే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది!
