వైసీపీ నేత వంశీపై మరో కేసు.. మళ్లీ జైలేనా?
గత ఏడాది జూలైలో తాను వంశీ వ్యవహారాలపై సోషల్ మీడియాలో స్పందించినట్టు సునీల్ తెలిపారు.
By: Garuda Media | 18 Dec 2025 3:27 PM ISTవైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి జైలుకు వెళ్తారా? ఆయన అరెస్టు తప్ప దా? అంటే.. ఔననే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా వంశీపై మరో కేసు నమోదైంది. తనను అక్రమంగా నిర్బంధించి బెదిరించారని.. కొట్టారని పేర్కొంటూ విజయవాడలోని మాచవరానికి చెందిన సునీల్ అనే వ్యక్తి వంశీపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వంశీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను అక్రమం గా నిర్బంధించి హింసించారని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో చంపేస్తామని బెదిరించారని కూడా పేర్కొన్నారు.
గత ఏడాది జూలైలో తాను వంశీ వ్యవహారాలపై సోషల్ మీడియాలో స్పందించినట్టు సునీల్ తెలిపారు. ఆయనపై అక్రమ మైనింగ్ కేసు నమోదైన తర్వాత.. దానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించ డంపై తనను ఇబ్బంది పెట్టారని తెలిపారు. దీంతో మాచవరం పోలీసులు వంశీ సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ,ఎస్టీ కేసును కూడా పెట్టినట్టు తెలిసింది. అదేవిధంగా హత్య యత్నం సహా.. బెదిరింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్లు కూడా నమోదు చేశారు.
ఉన్నతాధికారుల సూచనల మేరకు వంశీపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదిలావుం టే.. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ చిక్కుకున్న విషయం తెలిసిందే. సుమారు 13 మాసాలకు పైగా ఆయనవిజయవాడ జైల్లో ఉన్నారు. అనారోగ్యసమస్యలు చూపిం చి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతోపాటు.. అక్రమ మైనింగ్, ఎన్నికల అధికారులను బెదిరించడం వంటి కేసులు కూడా వెంటాడుతున్నాయి.
ఇలాంటి సమయంలో అనూహ్యంలో సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో వంశీని మరో సారి అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఆయన అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో బయటకు వచ్చిన వంశీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో సదరు బెయిల్‌ను రద్దు చేసేలా కోర్టును ఆశ్రయించనున్నట్టు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.
