Begin typing your search above and press return to search.

బీజేపీ స్ట్రాట‌జీ.. ఇక‌, బెంగాలే!

బీహార్ అయిపోయింది ఇప్పుడు తమ టార్గెట్ అంతా పశ్చిమ బెంగాల్ అని బిజెపి నాయకులు చెబుతున్నారు. వాస్తవంగా బెంగాల్లో బాగా వేసేందుకు బిజెపి అనేక ప్రయత్నాలు చేసింది.

By:  Garuda Media   |   17 Nov 2025 8:00 AM IST
బీజేపీ స్ట్రాట‌జీ.. ఇక‌, బెంగాలే!
X

బీహార్ అయిపోయింది ఇప్పుడు తమ టార్గెట్ అంతా పశ్చిమ బెంగాల్ అని బిజెపి నాయకులు చెబుతున్నారు. వాస్తవంగా బెంగాల్లో బాగా వేసేందుకు బిజెపి అనేక ప్రయత్నాలు చేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో బిజెపి అక్కడ పుంజుకోలేకపోయింది. అనేక ప్రయత్నాలు చేసినా బెంగాల్ ప్రజలు బిజెపిని ఆదరించలేకపోయారు.

అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో 65 స్థానాలను తగ్గించుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్నది బిజెపి పెట్టుకున్న లక్ష్యం. ఈ క్రమంలోనే అనేక రూపాల్లో పార్టీ ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన కీలక అంశం చొరబాటుదారులు. ఈ విషయాన్ని బిజెపి సీరియస్ గా తీసుకుంది. చొరబాటుదారులను సహించేది లేదని వీరిని మమతా బెనర్జీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది అన్నది ప్రధానంగా వారు చెబుతున్నారు.

అంతేకాదు చొరబాటుదారులు పశ్చిమబెంగాల్ ప్రజల హక్కులను, ఆస్తులను, అవకాశాలను కూడా దోచు కుంటున్నారని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పశ్చిమ బెంగాల్లో అమలు కావడం లేదు. ఉదాహరణకు పిఎం కిసాన్ యోజన, పీఎం ఆవాస్ యోజన పథకాలు బెంగాల్లో అమలు కావడం లేదు. ఇది కూడా బిజెపికి కలిసివచ్చే అంశంగా మారుతుంది.

దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రావడం లేదని. తమను అప్పులు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఉందని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ గత కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి బిజెపి నుంచి బలమైన ఎదురుదాడి కూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకోవడం చేతకాని మమతా బెనర్జీ తమపై నిందలు మోపుతోందని రాజకీయాలు చేయడం వ‌రకే ఆవిడ పరిమితం అవుతున్నారని మరో కొత్త వాదనను బిజెపి ప్రజల్లోకి తీసుకువెళ్లింది.

ఇక ఇటీవల బీహార్ లో జరిగిన ఓట్ల చోరీ అంశాన్ని కూడా మమతా బెనర్జీ గత కొన్నాళ్ల కిందట వరకూ ఆయుధంగా మార్చుకున్నారు. ఇటీవల కూడా ఆమె తన రాష్ట్రంలో సర్ ప్రక్రియను కొనసాగించటానికి వీలులేదని ఉద్యమాలు చేశారు. రోడ్డెక్కారు. కానీ, సర్ ప్రక్రియను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది బీహార్ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఇలా అనేక అంశాలు బిజెపికి పశ్చిమబెంగాల్లో కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెంగ బెంగాల్ పై బిజెపి నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

అయితే బెంగాల్ ప్ర‌జ‌ల్లో దీదీ(అక్క‌)గా ముద్ర వేసుకున్న మమతా బెనర్జీని అక్కడి ప్రజలు వదులుకుంటారా బిజెపికి పట్టం కడతారా అనేది చూడాలి. ఏదేమైనా ఎంచుకున్న అంశాలు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. బిజెపి చేసే ప్రణాళికాయుత రాజకీయాలు సక్సెస్ అయితే బెంగాల్ కూడా కమలం ఖాతాలో పడడం ఖాయం అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.