భర్తనే బురిడీ కొట్టించిన భార్య.. షాపింగ్ కోసం ఏకంగా రూ.28 లక్షలు!
అసలు విషయంలోకి వెళ్తే.. ఒక మహిళ తన భర్త ఖాతాను ఉపయోగించి దాదాపు 28.74 లక్షలు ఖర్చుచేసి ఆన్లైన్ షాపింగ్ చేసింది.
By: Madhu Reddy | 23 Aug 2025 11:00 PM ISTసాధారణంగా ఆడవారికి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా షాపింగ్ అనేది చేయాల్సిందే. నెలలో ఒక్కసారి అయినా షాపింగ్ కి వెళ్లాలని ఆరాటపడే మహిళలు కూడా లేకపోలేదు. ఇంకొంతమంది చేతిలో మొబైల్ ఉంటే చాలు ఆన్లైన్ ద్వారా తమకు నచ్చిన వస్తువుని షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా తన భర్తను బురిడీ కొట్టించి, ఏకంగా రూ.28.74 లక్షలు ఖర్చు చేసి షాపింగ్ చేసింది.. నిజం తెలుసుకున్న భర్త లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.. మరి ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అతని భార్య రూ.28 లక్షలు ఖర్చు చేసి ఏం షాపింగ్ చేసింది? ఎవరి కోసం చేసింది ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆన్లైన్ షాపింగ్ కోసం 28 లక్షలు ఖర్చు చేసిన భార్య..
అసలు విషయంలోకి వెళ్తే.. ఒక మహిళ తన భర్త ఖాతాను ఉపయోగించి దాదాపు 28.74 లక్షలు ఖర్చుచేసి ఆన్లైన్ షాపింగ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక వైద్యుడు 2023లో సదరు మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా వైద్యురాలు కావడం గమనార్హం. 2023 జూలై నుండి నవంబర్ 2024 మధ్యకాలంలో ఆమె అతడి ట్యాబ్లెట్ ద్వారా అతడి ఖాతాను యాక్సిస్ చేసి, 2,500కు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ వస్తువులలో ఎక్కువ భాగం ఆమె తన తల్లిదండ్రుల కోసమే ఆన్లైన్ షాపింగ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులను ఆశ్రయించిన భర్త..
నిజం తెలుసుకున్న భర్త పోలీసులను ఆశ్రయించి.. తన భార్య తన కుటుంబంతో కలిసి ఒక పద్ధతి ప్రకారమే కుట్ర పన్ని తన డబ్బును కాజేసారు అని, తమ ప్రయోజనాల కోసం డబ్బును ఉపయోగించుకున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఇక అతడి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ సదరు మహిళ అలాగే ఆమె తల్లిదండ్రులపై సమాచార సాంకేతిక చట్టం, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత విభాగాల కింద కేసు ఫైల్ చేయడం జరిగింది.
పలు సెక్షన్ల కింద కేసు ఫైల్..
సెక్షన్ 61 కింద కేసు ఫైల్ అవ్వడంతో ఇది 6 నెలల నుండి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు లేకపోలేదు. సెక్షన్ 318 మోసం.. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు కొంత డబ్బు జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 319 నమ్మించి మోసం చేయడం, ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం అనధికారిక డిజిటల్ యాక్సిస్, ఖాతా దుర్వినియోగం కేసు కింద మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష , లక్ష జరిమానా.. ఒక్కొక్కసారి రెండు విధించే అవకాశం ఉందని సమాచారం.
నేరం రుజువైతే కఠిన శిక్ష..
ప్రస్తుతం లావాదేవీలని ధృవీకరించడానికి డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఒకవేళ నేరం రుజువైతే నిందితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులకు దీర్ఘకాలిక జైలు శిక్ష, ఆర్థిక జరిమానా, ఆస్తి జప్తుతో పాటు కఠినమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
