Begin typing your search above and press return to search.

భార్య చేతిలో ఈ భర్త జస్ట్ మిస్... ఇంకా భూమిపై నూకలున్నాయి!

అవును... తాజాగా ఓ మహిళ తన సోదరులతో కలిసి భర్త మర్డర్‌ కు ప్లాన్ చేసింది. దీంతో.. ఆ సోదరులు గూండాలతో కలిసి బావపై దాడి చేసి చావకొట్టారు.

By:  Raja Ch   |   3 Aug 2025 5:00 AM IST
భార్య చేతిలో ఈ భర్త జస్ట్ మిస్... ఇంకా భూమిపై నూకలున్నాయి!
X

ఇటీవల కాలంలో భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తలకు సంబంధించిన ఘటనలు వరుసగా తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెజారిటీ కేసులు అక్రమ సంబంధాలకు సంబంధించినవే ఉంటున్నాయి! ఈ వివాహేతర సంబంధాల కారణంగా భార్యల చేతుల్లో ఇటీవల కాలంలో చాలామంది భర్తలు బలైపోయారు. ఫలితంగా పలు కేసుల్లో పిల్లలు అనాథలైపోతున్నారు!

ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఘటనలు ఇటీవల కాలంలో తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. చంపేసి, డ్రమ్ములో పెట్టిన ఘటన ఒకటైతే.. భర్తను చంపి, ఇంట్లోనే పాతిపెట్టి, పైన టైల్స్ వేసి కవర్ చేసిన ఘటన ఇంకొకటి. తాజాగా భర్త నిద్రపోతున్నప్పుడు వేడి నీళ్లు పోసిన భార్య ఘటన మరొకటి. ఈ నేపథ్యంలో భార్య & కో చేతుల్లో జస్ట్ మిస్సైన ఓ భర్త వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా ఓ మహిళ తన సోదరులతో కలిసి భర్త మర్డర్‌ కు ప్లాన్ చేసింది. దీంతో.. ఆ సోదరులు గూండాలతో కలిసి బావపై దాడి చేసి చావకొట్టారు. అడవికి తీసుకెళ్లి అక్కడ బతికుండాగానే పాతిపెట్టాలని గొయ్యి కూడా తవ్వడం మొదలుపెట్టారు. అయితే... ఆ భర్తకు ఇంకా భూమిపై నూకలున్నాయో ఏమో కానీ... బ్రతికి బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన రాజీవ్, సాధనలకు 2009లో వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే... పెళ్లైన నాటి నుంచి సాధన భర్తతో తరచుగా గొడవలు పెట్టుకుంటూ ఉండేదట. పైగా... తనకు గ్రామంలో ఉండటం ఇష్టం లేదని భర్తకు చెప్పడంతో సిటీకి వచ్చి సెటిల్ అయ్యారట.

ఈ క్రమంలో... రాజీవ్ నవోదయ ఆస్పత్రిలో ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్‌ గా పని చేస్తున్నాడు. అయితే.. ఇటీవల వీరి మధ్య గొడవలు మరీ ఎక్కువయ్యాయంట. ఈ నేపథ్యంలోనే.. తన భర్తను చంపాలనుకుందట సాధన. దీనికోసం తన ఐదుగురు సోదరుల సాయం తీసుకుంది. వారు మరో ఆరుగురు గూండాలను రంగంలోకి దింపారు. ఇలా 11 మంది రంగంలోకి దిగారు.

వీరంతా కలిసి ఇంట్లో ఉన్న రాజీవ్‌ పై దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులు ఇరగ్గొట్టి, సిబి గంజ్‌ లోని అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు. అనంతరం... బతికుండగానే అతడిని పూడ్చేయాలని ప్లాన్ చేశారు. దీనికోసం ఓ గొయ్యి కూడా తవ్వారు. అయితే... సరిగ్గా రాజీవ్ ను ఆ గోతిలో పెట్టే సమయానికి ఓ వ్యక్తి అటువైపు వచ్చాడు. దీంతో... వారంతా అక్కడ నుంచి పారిపోయారు.

దీంతో... రాజీవ్ దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి పరిస్థితి గమనించి, అంబులెన్స్ సాయంతో ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ విధంగా రాజీవ్ చావు కోరల్లోంచి జస్ట్ లో మిస్సయ్యారు. అతడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడి తండ్రి నేత్రమ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.