Begin typing your search above and press return to search.

ఐఎంపీ ఫర్ మెన్... ఏడ్చే మగాళ్లని నమ్మకూడదని ఎవరు చెప్పారు..!

కానీ... సమాజంలో మగాడు ఏడ్చినా, ఏ చిన్న సమస్యకైనా లొంగిపోయినా.. ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చే బ్యాచ్ నిత్యం పక్కనే ఉంటారు! ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలే గట్టెక్కి వచ్చామని చెబుతుంటారు! కానీ... సమాజంలో మగాడు ఏడ్చినా, ఏ చిన్న సమస్యకైనా లొంగిపోయినా.. ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చే బ్యాచ్ నిత్యం పక్కనే ఉంటారు! ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలే గట్టెక్కి వచ్చామని చెబుతుంటారు!

By:  Raja Ch   |   29 Jan 2026 8:00 PM IST
ఐఎంపీ ఫర్  మెన్... ఏడ్చే మగాళ్లని నమ్మకూడదని ఎవరు చెప్పారు..!
X

ఎవరైనా మగాడు ఏడుస్తుంటే... "ఏంట్రా ఆడపిల్లలా ఏడుస్తున్నావ్?"... అని ప్రశ్నించే తోటి మగాళ్లు చుట్టూ ఉంటారు! "ఏడ్చే మగాళ్లను నమ్మకూడదు!" లాంటి పనికిమాలిన స్టేట్ మెంట్లూ సమాజంలో ఉండనే ఉన్నాయి! "మగాడు అంటే గట్టిగా నిలబడాలిరా.. దేనికీ లొంగకూడదు.. డౌన్ అయిపోకూడదు" వంటి సలహాలకు కొదవే లేదు! ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. నిజంగా ఏడ్వాల్సినంత ఏడుపొచ్చినా.. చెప్పుకోవాలని అనిపించేటంత వేదన వచ్చినా.. కనీసం బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా చెప్పుకోలేని పరిస్థితులు అద్దం ముందు కూడా ఏడ్వలేని మగాడికి సమాజంలో అలా ఏర్పడిపోయాయి!

వాస్తవానికి... ఆడ అయినా, మగ అయినా... బాధ అందరికీ ఒకటే! దెబ్బ తగిలిన మనసుకీ, శరీరానికీ లింగ బేధాలు ఉండవు! కొంతమంది ఆడవాళ్లు స్ట్రాంగ్ గా ఉంటారు.. మరికొంతమంది మగవాళ్లు వీక్ గా ఉంటారు వంటి స్టేట్ మెంట్స్ సంగతి పక్కనపెడితే... దెబ్బ ఎవరికైనా దెబ్బే! కాకపోతే.. తట్టుకునే స్థాయిలు మారుతుంటాయి అంతే! కొంతమంది ముళ్లు గుచ్చుకున్నా ఏడుస్తారు.. మరికొంతమంది బుల్లెట్ దూసుకెళ్లినా బాధను పంటికింద దిగమింగుకుంటారు. పలువురు పోలీసులు, మాజీ మావోయిస్టుల ఇంటర్వ్యూలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధమవుతుంటుంది!

కానీ... సమాజంలో మగాడు ఏడ్చినా, ఏ చిన్న సమస్యకైనా లొంగిపోయినా.. ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చే బ్యాచ్ నిత్యం పక్కనే ఉంటారు! ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలే గట్టెక్కి వచ్చామని చెబుతుంటారు! కానీ... ఆ సమయంలో వారికి కూడా అది పెద్ద నొప్పిగానే ఉందన్న విషయం, బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చామన్న సమయం, మద్యం దుకాణంలో ఫ్రెండ్స్ ముందు రోదించిన సందర్భం మరిచిపోతుంటారని అంటారు! ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సర్వే తెరపైకి వచ్చింది.

అవును... ప్రస్తుత సమాజంలో లింగ బేధాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఉన్న సమస్య ఒత్తిడి (స్ట్రెస్). అందుకు ఎన్నో కారణాలు. అవి.. ఉద్యోగ సంబంధమైనవి కావొచ్చు, ఆర్థిక సంబంధమైనవీ అవ్వొచ్చు, కుటుంబ సంబంధాలకు సంబంధించినవీ అవ్వొచ్చు.. స్నేహితుల మధ్య కావొచ్చు.. స్ట్రెస్ అత్యంత సహజమైన విషయంగా మారిపోయింది. అయితే.. ఈ విషయంలో మగవాళ్లు మాత్రం తమకొచ్చిన సమస్యను ఎవరికైన చెప్పుకునే విషయంలో తీవ్రంగా సంకోచిస్తారని అంటుంటారు.. అది నిజం!

తన సమస్య ఎవరికైనా చెప్పుకుంటే.. చులకన అయిపోతామని కొందరు, లోకువ అయిపోతామని మరికొందరు, తమ మగతనం తాలూకు ఇమేజ్ సన్నగిల్లిపోతుందని ఇంకొందరు, ఏడిస్తే ఇంక విలువే ఉండదని చాలామంది మగాళ్లు భావిస్తుంటరారనేది ఓపెన్ సీక్రెట్టే! కానీ.. అది ఏమాత్రం సరైంది కాదని.. సమస్యను చెప్పుకోకుండా లోలోపలే కుంగిపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, తద్వారా ఒత్తిడి మరింత పెరిగి, ఫలితంగా చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

అందుకే... పురుషులు తమకు ఎలాంటి సమస్య వచ్చినా స్నేహితులకు చెప్పుకోవాలని.. చెప్పుకోవడం వల్ల, మనసులో బాధను వ్యక్తపరుచుకోవడం వల్ల కాస్త ఉపశమనం దొరకడంతోపాటు, ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా లోలోపలే దాచుకుని, వారిలో వారు నలిగి పోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చేటని.. మానసికంగా మరింతగా కుంగిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

సో... చెప్పుకుంటే పోయేదేముంది బ్రో... ఉన్నంతంలో కాస్త ఉపశమనం. పంచుకుంటే పోయిందేముంది బ్రో... ఏదైనా పరిష్కారం. ఎవరు చెప్పారు బ్రో.. ఏడ్చే మగాళ్లను నమ్మకూడదని... నవ్వొస్తే ఎలా నవ్వుతామో, ఏడుపొస్తే అలా ఏడ్చెయ్యాలి.. కనీసం గుండెలో ఉన్న బాధ, మదిలో ఉన్న ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుంది.. తాజా అధ్యయనం చెప్పేది ఇదే!