అర్ధరాత్రి స్వాతంత్ర్యం...అచ్చి వచ్చిందా ?
దేశానికి వందల ఏళ్ళ బానిసత్వం తరువాత స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వారి చెరలో రెండు వదల ఏళ్ల పాటు భారత్ మగ్గింది.
By: Satya P | 15 Aug 2026 7:52 AM ISTదేశానికి వందల ఏళ్ళ బానిసత్వం తరువాత స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వారి చెరలో రెండు వదల ఏళ్ల పాటు భారత్ మగ్గింది. ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు ప్రాణ త్యాగాలు ఆత్మా హుతి చేసుకున్న యువత ఇలా దేశం ఎంతగానో నష్టపడి కష్టపడి చివరికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. బ్రిటిష్ వారికి ఏమి పోయింది వారు తమ దేశానికి పోయే తొందరలో ఉన్నారు. దాంతో ఇండియా పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి సంతృప్తి చెందారు. అదే సమయంలో మనకూ స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని అన్నారు. సరిగ్గా ఇక్కడే మన దేశ సెంటిమెంట్లు జ్యోతీష్య శాస్త్రాలు పండితుల సూచనలు అడ్డు పడ్డాయి. మంచి ముహూర్తంతో దేశానికి స్వాతంత్ర్యం రావాలి కానీ ఆదరా బాదరాగా కాదు అని ఒక వైపు సనాతనులు వాదించారు. అదే సమయంలో అభ్యుదయవాదులు స్వాతంత్ర్యం వచ్చింది కదా దానికి ముహూర్తాలు సంప్రదాయాలు ఏమిటి అని రచ్చ చేశారు. ఇది ఎటూ తేలక పోయింది. మొత్తానికి ఉన్న ముహూర్తంలోనే అంటే బ్రిటిష్ వారు చెప్పిన సమయంలోనే కాస్తా మంచిది అనుకుని అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఈ దేశం అందుకుంది.
చీకట్లో వెలుగు రేఖలు :
మరి ఇక్కడ సరైనా ముహూర్తం కుదిరిందా అంటే ఉన్నంతలో మెరుగు అనుకుని అలా చేశారు. నిజానికి దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చినపుడు శ్రావణమాసం చతుర్దశి తిథి నడుస్తోంది. చతుర్దశిని ఎవరూ మంచి తిధిగా భావించరు. కానీ అమావాస్య కంటే బెటర్ అది అని ఒప్పుకోవాల్సి వచ్చింది అంటారు. అలా చూస్తే కనుక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకోవడం వెనుక వేద జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఆధారంగా అనుకూలమైన శుభ ముహూర్తాన్ని నిశ్చయించే ప్రయత్నం జరిగింది అని చెప్పాల్సి ఉంది.
అభిజిత్ ముహూర్తంగా :
ఇక ఆ సమయంలో పగటి పూట దినం సరిపోకపోయినా ఆగస్టు 14 నుండి 15కి మారే అర్ధరాత్రి సమయంలో గ్రహాల స్థితిగతులు దేశ భవిష్యత్తుకు అనుకూలంగా ఉంటాయని అప్పట్లో జ్యోతిష్య పండితులు భావించారు. అలా జ్యోతిష్య కారణాలు వాటికి సంబంధించిన లెక్కలు అన్నీ కలసి అభిజిత్ ముహూర్తంగా నిర్ణయించాయి. జ్యోతీష్య శాస్త్రంలో చూస్తే పగలు రాత్రి మధ్య వచ్చే అర్ధరాత్రి సమయం అభిజిత్ ముహూర్తానికి చెందుతుంది అని పండితులు చెబుతారు. అలా జ్యోతిష్యంలో తగిన సమయం దొరక్కపోతే ఈ ముహూర్తాన్ని అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు అని అంటారు. ఇక 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో స్థిరత్వం ఇచ్చే వృషభ లగ్నం ఉదయించింది, దీంతో ఇది దేశానికి మేలు చేసేదిగానే జ్యోతీష్య పండితులు భావించారు.
సంప్రదాయాలను గౌరవించుకున్నాం :
దాని కారణంగానే ఈ రోజుకీ దేశంలో బలమైన ప్రజాస్వామ్యానికి స్థిరమైన ప్రభుత్వానికి ఇది అండగా ఉందని అంటారు. ఇక పుష్య నక్షత్రం ఆ సమయంలో ఉంది. అలా ఆ సమయంలో మహా నక్షత్రంగా పిలిచే పుష్య నక్షత్రం ఉండటం రాజ్య స్థాపనకు కొత్త దేశ ఆవిర్భావానికి ఎంతో అనుకూలమని నిపుణులు అంచనా వేశారని అంటారు. ఇలా కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేదు, మొత్తం మీద దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం కూడా బ్రిటిష్ వారు అనుకున్న సమయానికే జరిగింది. అయితే పగలు నుంచి రాత్రికి మార్చి మన సంప్రదాయాలను గౌరవించుకున్నాం. ఇదన్న మాట అర్ధరాత్రి స్వాతంత్ర్యం కధ.
