Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్ లో యాక్టివ్ సిమ్ లేదా... ఇది మీ కోసమే!

అవును... సిమ్ లేకపోయినా వాట్సప్, టెలీగ్రామ్ వాడే వాళ్లు చాలా మంది ఉంటారనే సంగతి తెలిసిందే!

By:  Raja Ch   |   30 Nov 2025 7:00 PM IST
స్మార్ట్ ఫోన్ లో యాక్టివ్ సిమ్ లేదా... ఇది మీ కోసమే!
X

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతోన్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం తన సైబర్ భద్రతా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా... స్మార్ట్ ఫోన్ లో యాక్టివ్ సిమ్ లేకపోతే ఇకపై ఏ యాప్ లూ పని చేయవు! వాట్సప్, ఇతర మెసేజింగ్ యాప్ లతో పాటు ఇతర యాప్ లు పని చేయవని చెబుతున్నారు. ఈ సమయంలో టెలీకమ్యునికెషన్స్ విభాగం కొత్త నియమాలు జారీ చేసింది.

అవును... సిమ్ లేకపోయినా వాట్సప్, టెలీగ్రామ్ వాడే వాళ్లు చాలా మంది ఉంటారనే సంగతి తెలిసిందే! ఈ సమయంలో.. టెలీకమ్యునికేషన్స్ విభాగం (డాట్) జారీ చేసిన టెలీకమ్యునికేషన్స్ సైబర్ భద్రతా సవరణ నియమాలు - 2025 తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం ప్రతీ వాట్సప్ అకౌంట్ ఎల్లప్పుడూ య్యాక్టివ్ సిమ్ కార్డుతో లింక్ చేయబడి ఉండాలి.

కమ్యునికేషన్స్ యాప్స్ లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంటే... ఫోన్ లో సిమ్ కార్డు లేకపోతే యాప్ ల సేవలు ఆటోమెటిక్ గా ఆగిపోతాయి. ఈ నివ్బంధనలు 90 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఇదే సమయంలో యాప్ ను వెబ్ బ్రౌజర్ లో ఉపయోగిస్తే.. ప్రతీ 6 గంటలకు ఒక సారి లాగౌట్ అవుతుంది.. అనంతరం క్యూఆర్ కోడ్ తో మళ్లీ లాగిన్ అవ్వాలి.

వాస్తవానికి యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న సమయంలోనే సిమ్ కార్డును ధృవీకరించుకుంటున్నారు. ఒక వేళ సదరు డివైజ్ నుంచి సిమ్ కార్డును తొలగించినా.. ఆ యాప్ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో.. ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ ను వినియోగించుకోవడం సాధ్యమవుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిబంధన వల్ల సైబర్ నేరాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

కాగా...భారతదేశంలో 500 మిలియన్లకు పైగా వాట్సప్ వినియోగదారులు ఉండగా... ఈ కొత్త నియమాలు యాప్ ను తక్కువ సౌకర్యవంతంగా చేసినప్పటికీ, మరింత సురక్షితంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. వైఫై మాత్రమే ఉపయోగించి టాబ్లెట్ లపై ఆధారపడేవారు అంతరాయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకటే.. ఇకపై వాట్సప్ ఖాతాకు లింక్ చేయబడిన సిమ్ ఫోన్ లో ఉండి తీరాలి.