Begin typing your search above and press return to search.

హనీమూన్ తెలుసు.. బేబీ మూన్ ఓకే.. ఈ బడ్డీమూన్ ఏంది?

బాగా దగ్గరైన వారితో కలిసి చేసే పోస్ట్ వెడ్డింగ్ ట్రిప్ గా దీన్ని చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు.

By:  Garuda Media   |   2 April 2026 9:39 AM IST
హనీమూన్ తెలుసు.. బేబీ మూన్ ఓకే.. ఈ బడ్డీమూన్ ఏంది?
X

పెళ్లైన తర్వాత దంపతులు ఇద్దరు కలిసి ఏకాంతంగా వెళ్లే హనీమూన్ మీద అందరికి ఐడియా ఉండేదే. దీనికి భిన్నంగా జీవితభాగస్వామి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత గర్భవతిగా ఉండే భార్యను తీసుకొని ప్రత్యేక టూర్ కు వెళ్లటం దానికి బేబీ మూన్ అన్న పేరును డిసైడ్ చేయటం తెలిసిందే. ఇప్పుడు మరో మూన్ తెర మీదకు వచ్చింది. అదే బడ్డీమూన్. ఇంతకూ మిగిలిన ‘మూన్’కు ఈ బడ్డీ మూన్ కు తేడా ఏమిటన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

తాజాగా రష్మిక.. విజయ్ దేవరకొండ తమ పెళ్లైన తర్వాత చేస్తున్న ఈ బడ్డీమూన్ ట్రిప్ తో దీని గురించి ఆరా మొదలైంది. ఈ కొత్త కాన్సెఫ్టు మీద ఆసక్తి పెరిగింది. ఇంతకూ ఈ బడ్డీమూన్ అంటే ఏమిటన్నది చూస్తే.. కొత్తగా పెళ్లైన జంటతో పాటు.. తమకు అత్యంత దగ్గరగా ఉండే స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవటమే ఈ బడ్డీ మూన్. పెళ్లైన తర్వాత చేసే హ్యాంగ్ అవుట్ గా చెప్పాలి.

గతంలో పెళ్లిళ్లు వీలైనంత ఎక్కువగా పెద్దలు కుదిర్చినవే ఉండేవి. దీనికి తోడు కొత్తగా పెళ్లైన వారి మధ్య పరిచయం.. చనువు.. చాలా తక్కువగా ఉండేది. దీంతో పెళ్లైన వెంటనే ఒక ట్రిప్ కు వెళ్లి వస్తే.. ఇరువురు ఒకరి గురించి మరొకరు తెలుసుకునే వీలుతో పాటు.. ఇద్దరు మరింత దగ్గర కావటానికి హనీమూన్ సాయం చేసేది. ఎవరికి వారు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ఈ హనీమూన్ ను ప్లాన్ చేసేవారు.

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెళ్లికి ముందే కొంత టైం తీసుకోవటం.. పలుమార్లు కలవటం మొదలైంది. ఇక. లవ మ్యారేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పెళ్లికి ముందు ఎక్కువకాలం ఒకరికొకరు బాగా తెలిసినప్పుడు.. వారి మధ్య చనువు.. దగ్గరితనం బాగా ఉండటం.. తీరికలేని పని ఒత్తిడి ఉన్న వేళ.. పెళ్లి వేళ హడావుడి పూర్తైన తర్వాత అత్యంత సన్నిహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయటమే ఈ బడ్డీమూన్ కాన్సెప్టుగా చెబుతారు.

బాగా దగ్గరైన వారితో కలిసి చేసే పోస్ట్ వెడ్డింగ్ ట్రిప్ గా దీన్ని చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లి వేళ.. తమ కోసం ఎంతో కష్టపడే తమ సన్నిహితులతో కలిసి సేద తీరటం.. పెళ్లి అనుకున్నప్పటి నుంచి పెళ్లి కార్యక్రమం జరిగే వరకు విపరీతమైన పని చేసే తమ వాళ్లతో ఒక ట్రిప్ వెళితే బాగుండటమే కాదు వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. ఈ ట్రిప్ కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్యే కాదు.. వారిద్దరికి అన్ని సమయాల్లో అండగా నిలిచే పలువురితో మరింత దగ్గర కావటానికి వీలు ఉంటుంది. అంతేకాదు.. కొన్ని ట్రిప్ లకు ఇద్దరి కంటే కూడా నలుగురు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది.

నిజానికి ఈ కాన్సెప్టు మనకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నా.. విదేశాల్లో మాత్రం ఎప్పటి నుంచో ఉంది. కొందరు అయితే పెళ్లికి ముందు కూడా ఈ తరహా ట్రిప్ వేస్తుంటారు. సంతోషం.. బాధ అన్నింటిలోనూ దగ్గరగా ఉండే స్నేహితులతో కలిసి నాలుగు రోజులు ఒక ట్రిప్ వేస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. నచ్చిన వారితో కలిసి కొత్త బంధాన్ని స్టార్ట్ చేయటం మరింత సరదాగా ఉంటుంది. ఈ సందర్భంగా తీసుకునే వీడియోలు.. ఫోటోలు మంచి మెమరీస్ గా మారతాయి. బడ్డీమూన్ ను సింఫుల్ గా చెప్పాలంటే.. ఏకాంతం..రొమాన్స్ మాత్రమేూ కాదు.. ఫ్రెండ్స్.. ఫన్ లాంటివి జోడించిన ఒక భిన్నమైన బ్లెండ్ గా చెప్పాలి. అవకాశం వస్తే మీరూ ట్రై చేయండి.