ప్రతి దేశం ఒక స్పెషల్… ఈ వింతలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాల ఆచారాలు మనకు వింతగా అనిపిస్తే.. మరికొన్ని దేశాల్లోని భౌగోళిక పరిస్థితులు మనల్ని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
By: Madhu Reddy | 9 Jun 2026 1:49 AM ISTప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాల ఆచారాలు మనకు వింతగా అనిపిస్తే.. మరికొన్ని దేశాల్లోని భౌగోళిక పరిస్థితులు మనల్ని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. నార్వేలో అసలు రాత్రే ఉండదనే విషయం తెలుసా? అలాగే సైన్యం లేని దేశాలు, అసలు అడవులే లేని రాజ్యాలు కూడా మన భూమిపై ఉన్నాయి. వినడానికి కాస్త క్రేజీగా ఉన్నా.. వందకు వంద శాతం నిజమైన ప్రపంచంలోని కొన్ని వింత విశేషాలు ఇప్పుడు చూద్దాం!
రాత్రి లేని దేశం.. చెట్లు లేని రాజ్యం:
మనం రోజువారీ జీవితంలో పగలు, రాత్రిని సమానంగా చూస్తాం. కానీ నార్వే దేశంలో మాత్రం అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అక్కడ అసలు రాత్రి అనేదే ఉండదు. ఇక గ్రీన్‌లాండ్ విషయానికి వస్తే.. అక్కడి వాతావరణం వల్ల ఆ దేశంలో అసలు చెట్లే పెరగవు. అలాగే ఖతర్ దేశంలో ఒక్కటంటే ఒక్క అడవి కూడా మనకు కనిపించదు. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నా ప్రకృతి సృష్టించిన నిజాలు.
సైన్యం లేని రాజ్యం.. పాములు లేని చోటు:
ఈ రోజుల్లో ప్రతి దేశానికి రక్షణ కోసం సొంత సైన్యం ఉండటం చాలా కామన్. కానీ 'కోస్టారికా' దేశానికి అసలు సైన్యమే లేదు. అలాగే ఐర్లాండ్‌లో మనకు ఒక్క పాము కూడా కనిపించదు. ఇక శాన్ మారినో అనే దేశంలో ప్రజలు ప్రయాణించడానికి కనీసం ఒక్క విమానాశ్రయం కూడా అందుబాటులో లేదు.
పన్నులు లేని మొనాకో.. చర్చిలు లేని సౌదీ:
మొనాకో దేశంలో ఉండే ప్రజలపై ప్రభుత్వం ఎలాంటి ఆదాయ పన్ను విధించదు. ఇక అందుకే ప్రపంచంలోని ధనవంతులంతా అక్కడ నివసించడానికి ఇష్టపడతారు. ఇక మనకు నిత్యం రైళ్లు కనిపిస్తూనే ఉంటాయి కానీ, కువైట్ దేశంలో అసలు రైల్వే వ్యవస్థే లేదు. ఇక మరోవైపు సౌదీ అరేబియా దేశంలో ఇతర మతాలకు సంబంధించిన దేవాలయాలు, చర్చిలు నిర్మించడానికి అనుమతి ఉండదు.
భూమిపై ఉన్న ప్రతి దేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన రూల్ లేదా ప్రకృతి వింతను కలిగి ఉంది. టెక్నాలజీ ఎంత పెరిగినా ఇలాంటి కొన్ని విలక్షణమైన విషయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. మనం రోజు చూసే ప్రపంచానికి భిన్నంగా ఉండే ఇలాంటి వింతలు చదవడానికి, తెలుసుకోవడానికి ఎంతో కుతూహలాన్ని కలిగిస్తాయి. మరి ఈ వింతల్లో మీకు బాగా నచ్చిన విశేషం ఏదో కామెంట్ చేయండి..
