Begin typing your search above and press return to search.

లండన్‌ లో "సర్ " ప్రకంపనలు... ఓటు చోరీ నినాదాలు

లండన్ లో ఈ నిరసనలు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పిలుపు మేరకు జరిగాయి. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవక తవకలు జరిగాయని ధ్రువ్ రాఠీ ఆరోపించారు.

By:  Satya P   |   18 Oct 2026 8:55 AM IST
లండన్‌ లో సర్   ప్రకంపనలు...  ఓటు చోరీ నినాదాలు
X

ఇప్పటిదాకా భారత్ కే పరిమితం అయిన ఓటు చోరీ నినాదాలు ఉద్యమాలు లండన్ కి పాకాయి. అక్కడి మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో పార్లమెంట్ స్క్వేర్ దగ్గర యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధ్రువ్ రాఠీ అయితే ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఓటు చోరీ చేశారు అని నినాదాలు చేశారు. ప్రవాస భారతీయులు, విద్యార్ధులతో కలిసి నిర్వహించిన ఈ ఆందోళనలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు చూస్తే ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు యూకే ఆధ్వర్యమో విద్యార్ధులు కొందరు భారత హైకమిషన్ ముందు ధర్నా నిర్వహించారు.

యూట్యూబర్ పిలుపుతో :

లండన్ లో ఈ నిరసనలు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పిలుపు మేరకు జరిగాయి. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవక తవకలు జరిగాయని ధ్రువ్ రాఠీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ విధానం తప్పు అని అంటూ ఈ ఆందోళనలు సాగాయి. ఈ ఆందోళనల నేపధ్యంలో మోడీకి మద్దతుగా కూడా కౌంటర్ నిరసనలు జరగడం విశేషం.

మోడీకి జై కొడుతూ :

అదే లండన్ లో నరేంద్ర మోడీకి కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ప్రవాస భారతీయులు అనేక మంది అక్కడకు చేరుకుని నినాదాలు చేఅరు. మోడీకి జై కొడుతూ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇలా పోటా పోటీగా సాగిన ఈ నిరసనలతో లండన్ వీధులు దద్దరిల్లాయి. అయితే ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇరువర్గాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ భద్రతను కల్పించారు.

ఆగేది లేదా :

ఢిల్లీని దాటి ప్రవాసంలోనూ ఇతర దేశాలలోనూ కూడా ఈ తరహా నిరసనలు నిర్వహించాలని ఆందోళనకారులు నిర్ణయించడంతో సర్ ఉద్యమం మరింత పీక్స్ కి చేరుకుందని భావిస్తున్నారు. దేశం లోపల ఉన్న విషయాన్ని ఇపుడు ఇతర దేశాలకు పాకించడం ద్వారా భారత్ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు అని ఒక వర్గం మండిపడుతూంటే భారత్ లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు అని మరో వర్గం అంటోంది. ఏది ఏమైనా ఇది దేశానికి సంబంధించిన అంశంగా చూస్తే ఇబ్బందిగానే ఉంటుందని వాదిస్తున్న వారూ ఉన్నారు. ఇపుడు భారత్ ప్రపంచంలో అందరి మన్ననలు అందుకుంటూ ఉందని అలాంటి సమయంలో ఈ తరహా నిరసనలు దేశం బయట చేయడం ద్వారా దేశ ప్రతిష్టకే మచ్చ తెచ్చినట్లు అవుతుందని అంటున్నారు.