Begin typing your search above and press return to search.

పాతికేళ్ళుగా అధినేత... పుతిన్ అంటేనే ఆసక్తి

రష్యా అధ్యక్షుడిగా 2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి అదే ఏడాది మే 7న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

By:  Satya P   |   6 Dec 2025 8:53 AM IST
పాతికేళ్ళుగా అధినేత... పుతిన్ అంటేనే ఆసక్తి
X

రష్యా అధ్యక్షుడిగా 2000 మార్చిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి అదే ఏడాది మే 7న పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఇక నాటి నుంచి నేటి దాకా ఆయన రాజకీయ జీవితం శిఖరాగ్రాన సాగుతూ వచ్చింది. పుతిన్ రష్యా వంటి అగ్ర రాజ్యానికి అధినేత. రష్యా అత్యంత సంపన్న దేశంగా ఉంది. రక్షణ వ్యవస్థలో తిరుగులేని స్థానంలో ఉంది. అలాగే ఇంధనంలో కూడా రష్యా ప్రధాన సరఫరాదారుగా ఉంది. అనేక రకాల ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తూ రష్యా అగ్ర రాజ్యంగా నిలుస్తోంది. దానికి అధినేతగా ఉన్న పుతిన్ గురించిన విషయాలు తెలుసుకోవాలనీ అందరికీ ఆసక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది.

ఆస్తులు ఎన్ని :

పుతిన్ రష్యా అధినేత కదా ఆయన ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారు, ఆయన జీతం ఎంత ఇత్యాది ప్రశ్నలు అందరికీ ఉంటాయి. వివరాల్లోకి వెళ్తే క్రెమ్లిన్ అధికారిక ప్రకటనల ప్రకారం ఆయన జీతం ఏడాదికి అక్షరాల 1.40 లక్షల డాలర్లుగా ఉంటుందని చెబుతారు. అంటే ఇది మన దేశ కరెన్సీతో సరిపోల్చితే ఏకంగా 1.26 కోట్ల రూపాయలుగా ఉంటుంది అన్న మాట. అదే సమయంలో ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ వంటి విమర్శకుల ఆరోపణల ప్రకారం చూస్తే పుతిన్ ఆస్తులు కూడా ఇంతకు కోటింతలు ఉంటాయని అంటున్నారు. అలా పుతిన్ దగ్గర ఉన్న మొత్తం సంపద విలువ 200 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. ఇక దీనిని కూడా ఇండియన్ కరెన్సీలో చూస్తే ఏకంగా 18 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు. అంటే పుతిన్ ప్రపంచ ధనవంతులలో ఏ టాప్ ర్యాంకులోనో ఉన్నారు అని భావించాల్సిందే.

ఇవన్నీ కూడా :

ఇక పుతిన్ ఆస్తులు అంటే కేవలం డాలర్లు మాత్రమే కాదు, ఆయనకు ఏకంగా 9 వేల కోట్ల విలువైన బ్లాక్ సీ ప్యాలెస్ ఉంది అని చెబుతారు. ఇది ఒక అద్భుతంగా కూడా పేర్కొంటారు. అలాగే విలాసవంతమైన యాచ్‌లు సైతం పుతిన్ కి ఉన్నట్లుగా కూడా చెబుతారు. రష్యా అధినేతగా పుతిన్ కి రాచ మర్యాదలు ఉంటాయి. ఎంతో గొప్పగా సౌకర్యాలు ఉంటాయని కూడా అంటారు.

వ్యూహకర్తగా :

పుతిన్ అంటే దేనికీ వెరవని నేతగా గొప్ప వ్యూహకర్తగా చెబుతారు. అందుకే ఆయన 2024 మేలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వరసగా ఐదోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఉక్రెయిన్ విషయంలో యుద్ధ విరమణకు పుతిన్ సిద్ధపడతారు అని ఒక వైపు వార్తలు వినవస్తున్నా మరో వైపు మాత్రం పట్టుదలకు మారు పేరుగా పుతిన్ ని చెబుతూంటారు. దాంతో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని అంటారు.

తొలిసారి మరో దేశానికి :

ఇక పుతిన్ విదేశీ పర్యటనలు గత నాలుగేళ్ళుగా ఎక్కడా లేవు. దానికి కారణం ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం. అది మొదలైన తరువాత పుతిన్ బయట దేశాలలో పర్యటనలు తగ్గించేశారు ఈ నేపధ్యంలో ఆయన భారత్ ని ఎంచుకుని మరీ పర్యటిస్తున్నారు దాంతో పుతిన్ గురించి భారతీయులు చాలా ఎక్కువగా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక పుతిన్ వ్యక్తిగతానికి వస్తే ఆయన వయసు 73 ఏళ్ళు. కానీ ఇప్పటికీ నవ యువకుడిగా ఉంటారు. ఆయన గ్లామర్ కూడా అలాగే మెయింటెయిన్ చేస్తారు. 1983 జూలై 28 న పుతిను లియుడ్మిలా ష్క్రెబ్నెవాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అని చెబుతారు.

అవార్డులు ఎన్నో :

ప్రపంచ నాయకుడిగా ఉన్న పుతిన్ కి కనీసం పదిహేను దేశాలు అవార్డులను ప్రదానం చేశాయి. 2001 నుండి ఈ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు గౌరవ డాక్టరేటు, ఇతర అవార్డులను ఆయనకు ప్రదానం చేశాయి. అయితే వీటిలో కొన్నింటిని 2022లో రస్ష్యా ఉక్రెయిన్ మీద దండయాత్ర చేస్తోంది అన్న కారణంగా రద్దు చేశారని చెబుతారు. పుతిన్ ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో ప్రచారాలు ఉన్నా ఆయన ఎపుడూ ఆరోగ్యంగానే కనిపిస్తారు. తన ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు అని అంటారు. ఆయన క్రీడల పట్ల పెంపుడు జంతువుల విషయంలో ఆసక్తిని చూపిస్తారు అని కూడా అంటారు.