Begin typing your search above and press return to search.

శశికళ కొత్త పార్టీ... రెండు ఆకుల మీదనే గురి

తమిళనాడులో ఎంజీఆర్ ప్రజలకు దేవుడుతో సమానం. ఇక ఆయన స్థాపించిన అన్నా డీఎంకేకు ఆయన బతికుండగా ఓటమి అనేది లేదు, ఏకంగా 13 ఏళ్ల పాటు డీఎంకేని విపక్షంలో అలా వెయిట్ చేయించారు ఎంజీఆర్.

By:  Satya P   |   14 March 2026 8:00 AM IST
శశికళ కొత్త పార్టీ...  రెండు ఆకుల మీదనే గురి
X

తమిళనాడులో కొత్త పార్టీ ఏర్పాటు అయింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత సహచరి నెచ్చెలి అయిన వీకే శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె తమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తాజాగా శుక్రవారం ఆమె తమ పార్టీ పేరు ప్రకటించారు. ఈ పేరు చూస్తే చాలా పెద్దగా ఉంది. తమిళ ప్రజలకు ఆరాధ్యదైవంగా అన్నగా ఉన దివంగత ఎంజీఆర్ ని అలాగే అమ్మగా గుండెలలో స్థానం సంపాదించుకున్న జయలలితని తలచుకుంటూ వారి ఆశీస్సులతోనే తన కొత్త రాజకీయం అంటూ శశికళ కొత్త పార్టీ పెట్టారు.

పెద్దాయనను తలుస్తూ :

తమిళనాడులో ఎంజీఆర్ ప్రజలకు దేవుడుతో సమానం. ఇక ఆయన స్థాపించిన అన్నా డీఎంకేకు ఆయన బతికుండగా ఓటమి అనేది లేదు, ఏకంగా 13 ఏళ్ల పాటు డీఎంకేని విపక్షంలో అలా వెయిట్ చేయించారు ఎంజీఆర్. అందుకే ఆయన ప్రజాభిమానం ఆయన వారసత్వం తమ సొంతం కావాలని శశికళ వ్యూహాత్మకంగా తన పాటీలో ఎంజీఆర్ ని కూడా కలిపారు. ఆలిండియా పురచ్చి తలైవార్ మక్కల్ మునేట్ర కలగం అని తమ పార్టీకి ఒక పొడవాటి పేరుని పెట్టారు. ఇందులో ఎంజీఆర్ కి ఉన్న బిరుదు పురుచ్చి తలైవార్. అలా ఆయనను స్మరిస్తూ తన పార్టీకి ఆ పారు పెట్టారు అన్న మాట. ఇక ఇంత పెద్ద పేరు పెట్టిన శశికళ అందులో ఎంజీఆర్ జయలలిత అభిమానులను మొత్తంగా కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

గుర్తు కూడా వెరైటీ :

ఇక డీఎంకే గుర్తు ఉదయించే సూర్యుడు. అన్నా డీఎంకే గుర్తు రెండు ఆకులు, మరి శశికళ తన పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టుని ఎంచుకున్నారు. అంటే కొబ్బరి చెట్టు అంత ఎత్తున తన పార్టీ కూడా రాణించాలి అన్నది ఆమె సంకలంపా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కొబ్బరి చెట్టు అన్నది అందరికీ తెలుసుతుంది కాబట్టి జన సమాన్యంలో నలుగుతుంది అని భావించి ఇలా ఎంపిక చేశారో చూడాల్సి ఉంది. ఎం జీఆర్ కి జయలలితకు విగ్రహాలకు ఆమె ఘన నివాళి అర్పించి మరీ పార్టీ పేరుని ప్రకటించారు.

అన్నా డీఎంకే మీదనే :

శశికళ పార్టీ పెట్టడానికి కారణాలు ఏమిటి అన్నది చూస్తే కనుక అన్నా డీఎంకే మీద తీరని ఆగ్రహమే అని చెబుతున్నారు. జయలలిత జీవించి ఉన్నా మొత్తం తానే అటు పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన శశికళకు ఆమె మరణాంతరం కూడా పార్టీ వారు విధేయులుగా కొంత కాలం ఉన్నారు. కానీ వ్యూహాత్మకంగా ఆమెని తప్పించేశారు అని శశికళ మండిపోతున్నారు. తనను అవినీతి అక్రమాల ఆరోపణల పేరుతో జైలు పాలు చేయడం ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆమె అన్నా డీఎంకే ఓటమినే బలంగా కోరుకుంటున్నారు అని అర్ధం అవుతోంది.

దాంతో ఆమె పెట్టిన పార్టీ కూడా అన్నా డీఎంకే కి ఆరాధ్యులుగా ఉన్న ఎంజీయార్ జయలలితలనే తమ మార్గదర్శులుగా చేసుకుని ముందుకు సాగడం బట్టి చూస్తే కనుక కచ్చితంగా అన్నా డీఎంకేకి దెబ్బ కొట్టడానికే అని అర్ధం అవుతోంది. మరి శశికళ పార్టీ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం అంటే అన్నా డీఎంకే అని చెప్పాల్సి ఉంటున్నారు. ఎంతో కొంత ప్రభావం ఈ విషయంలో శశికళ పార్టీ చూపించినా మేలు మాత్రం డీఎంకేకి జరుగుతుంది అని అంటున్నారు మొత్తం మీద జయలలిత నెచ్చెలి గురి రెండు ఆకుల మీద అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.