Begin typing your search above and press return to search.

విశాఖ‌లో వార్డుల ర‌గ‌డ‌.. గ‌డ‌బిడ‌....!

రాష్ట్రంలో చేపట్టిన వార్డుల విభజన అంశం విశాఖపట్నం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఇక్కడ ప్రస్తుతం 98 వార్డులు ఉన్నాయి.

By:  Garuda Media   |   29 May 2026 6:17 PM IST
విశాఖ‌లో వార్డుల ర‌గ‌డ‌.. గ‌డ‌బిడ‌....!
X

రాష్ట్రంలో చేపట్టిన వార్డుల విభజన అంశం విశాఖపట్నం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఇక్కడ ప్రస్తుతం 98 వార్డులు ఉన్నాయి. అయితే వీటిని అధికారికంగా 120 వార్డులు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ క్రమంలో వార్డుల విభజన ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ తో పాటు కలెక్టర్ కూడా వేగవంతం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల నుంచి ముఖ్యంగా టిడిపి నేతల నుంచి ఈ వార్డుల సంఖ్యను 150 కి పెంచాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది.

దీనిని వైసిపి నాయకులు అడ్డుకుంటున్నారు. వార్డుల సంఖ్య పెంచడం వల్ల తమ ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుందని వైసిపి సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని కూడా ఆయన చెప్పడం గమనార్హం. విశాఖలో వార్డుల సంఖ్యను పెంచడానికి తమ వ్యతిరేకం కాదని కానీ ఇప్పటి ముప్పుడిగా వార్డులను పెంచడం వల్ల తమ అనుకూల ఓటు బ్యాంకు ను నీరుగారుస్తున్నారన్నది ఆయన వాదన.

అయితే ఈ విషయంలో తామంతా నిబంధనల ప్రకారం వెళ్తున్నామని కమిషనర్ చెప్తున్నారు. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న పరిష్కరిస్తామని అంటున్నారు. కానీ మరోవైపు రెండు రోజులు మాత్రమే వార్డుల విభజనకు సమయం ఉండటంతో వైసిపి నాయకులు ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు. ఇక ప్రజల నుంచి చూస్తే ప్రజల నుంచి ఇప్పటివరకు అందిన అభ్యంతరాల మేరకు 120 వార్డుల నుంచి 135 వార్డులు పెంచాలని ప్రజలు కూడా కోరుతున్నారు.

దీంతో అధికారులకు ఇప్పుడు ఏం చేయాలన్నది సందేహంగా మారింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులకు పెంచాలన్న దానిని పక్కనపెట్టి.. 135 వార్డులను చేయటమా? 150 వార్డులు చేయడమా? అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వార్డుల సంఖ్యను పెంచడం వల్ల తాము ఓటు బ్యాంకు కోల్పోతామన్న‌ వైసిపి వాదనలో వాస్తవం లేదని టిడిపి సీనియర్ నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు.

దీని వెనక రాజకీయ కుట్ర ఉందన్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను కూడా ఆయన పొట్టి పారేస్తున్నారు. అని ఇది సరికాదని నిబంధనల ప్రకారమే వార్డుల విభజన జరుగుతుందని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్డులు ఎన్ని ఉన్నా టిడిపి ఇదే ఘనవిజయమని శ్రీనివాసరావు చెప్పటం విశేషం. ప్రస్తుతం వార్డుల సంఖ్య పెంపు విషయంలో విశాఖలో జరుగుతున్న వివాదం ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. అయితే కలెక్టర్కు పూర్తిస్థాయి అధికారాలు ఉన్న నేపథ్యంలో మునిసిపల్ శాఖ జోక్యం చేసుకునేది లేదని మంత్రి నారాయణ ప్రకటించారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది చూడాలి.