Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలెంజ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడు అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు.

By:  Satya P   |   18 Nov 2025 8:00 PM IST
చంద్రబాబుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలెంజ్
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడు అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. ఒక యూట్యూబ్ చానల్ డిబేట్ లో ఆయన తాజాగా మాట్లాడుతూ బాబుని ఆయన అవకాశవాద రాజకీయ నేతగా పేర్కొన్నారు. ప్రతీ సారి ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం బాబుకు అలవాటు అని కూడా ఆయన చెప్పారు. ఇక 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది అన్న బాబు తాను మాత్రం సూపర్ సిక్స్ హామీలు అంటూ ఎన్నికల హామీలు ఇచ్చి వాటిలో కొన్ని అమలు చేస్తున్నారని నాగేశ్వర్ గుర్తు చేశారు.

తెల్ల ఏనుగు అని చెబుతూ :

విశాఖ స్టీల్ ప్లాంట్ ని తెల్ల ఏనుగుతో పోలుస్తూ ఈ రోజు విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఈ సంగతి తెలిసి తెలిసి ఎందుకు ప్లాంట్ ని కాపాడుతామని ఎన్నికల ముందు కార్మికులకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంతే కాదు కేంద్రం నుంచి 11 వేల కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం ఇప్పించామని చెబుతున్న బాబు అవన్నీ పన్నులు కట్టే వారి ఆదాయం అని ఆనాడు తెలియలేదా అని నిగ్గదీశారు.

ఓపెన్ చాలెంజ్ అంటూ :

స్టీల్ ప్లాంట్ తెల్ల ఏనుగు అని ఎలా చెబుతారు బాబూ అని ఆయన ప్రశ్నించారు. తెల్ల ఏనుగు ఎలా అయిందో చెప్పాలని ఆయన ఓపెన్ చాలెంజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఎన్ని నిధులు ఇప్పటిదాకా ఇచ్చిందో ఇదే విషయం మీద తాను బాబుని సూటిగా అడుగుతున్నాను అని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల పన్నులతో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు అంటే విశాఖలో నెలకొల్పుతున్న గూగుల్ అదానీ సెంటర్ కి ఎన్ని వేల కోట్లు రాయితీలు ఇచ్చారో చెప్పాలని అన్నారు. 22 వేల కోట్ల దాకా ప్రజల పన్నుల నుంచి ఎలా ఇవ్వగలిగారు అని ఆయన ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఎన్ని రాయితీలు ఇస్తున్నారో కూడా చెప్పాలని కోరారు.

కేంద్రం ఇచ్చింది ఎంత :

ఇక స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్లు ఆస్తులు పెంచిందో చెప్పాలని ఆయన కోరారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విమర్శలు చేస్తున్నారని ఇది మోసపూరితమైన వాదన కాదా అని ఆయన అన్నారు కార్మికులు పనిచేయడం లేదని అనడం తప్పు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అని అన్నారు.. కార్మికుల మీద యుద్ధం చేస్తూ వస్తున్న బాబు గతంలో ఓట్లేయండి అని కోరింది మీరే కదా అని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ రెండు లక్షల కోట్ల ఆస్తులు కార్మికుల కష్టార్జితమే అని ఆయన అన్నారు పనిచేయకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని అన్నారు.

స్టీల్ ప్లాంట్ మూసివేత కోసమే :

విశాఖ స్టీల్ ప్లాంట్ ని మూసేసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని ప్రోత్సహించడం కోసమే బాబు ఈ రకంగా ప్లాంట్ మీద కార్మికుల మీద విమర్శలు చేస్తున్నారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీలు కోరుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు ఇప్పించాలని ఆయన బాబుని డిమాండ్ చేశారు. అపుడు ప్రైవేట్ కంపెనీల కంటే ఎక్కువ లాభాలు స్టీల్ ప్లాంట్ కి వస్తాయని అది తాను చేసి చూపిస్తాను అని ఓపెన్ చాలెంజ్ చేశారు.

మోడీ మీద పోరాడలేరు :

కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. దానిని ఆపే శక్తి టీడీపీ కూటమి ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. అయితే ప్రైవేటీకరణ చేస్తారు, లేకపోతే మిట్టల్ సంస్థ కోసం నిర్వీర్యం అయినా చేస్తారు అని ఆయన ఆరోపించారు స్టీల్ ప్లాంట్ మీద దాడి తెలుగు వారి మీద దాడి అని వారి ఆత్మ గౌరవం మీద దాడి అన్నారు ఇది ప్రజల పన్నులతో నడిచే ప్లాంట్ అని రుజువు చేస్తే కనుక మూసేయండి అని ఆయన సవాల్ చేశారు. కేంద్రం అయిదు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు. మొత్తం స్టీల్ ప్లాంట్ డేటా ఇప్పటిదాకా తీస్తే తెల్ల ఏనుగు అవునో కాదో తేలిపోతుంది కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కేంద్రం ఇచ్చిన నిధులు వీటితో పాటు స్టీల్ ప్లాంట్ కట్టిన పన్నులు ఆస్తులు అన్నీ డేటా తీసి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు, మీరు కనుక రుజువు చేస్తే తాను ఎపుడూ స్టీల్ ప్లాంట్ విషయం మీద చర్చించను అని ఆయన ఓపెన్ చాలెంజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని వాటిని తెగ నమ్మడానికే పాలకులు చూస్తున్నారు అని ఆయన నిప్పులు చెరిగారు.