Begin typing your search above and press return to search.

విశాఖ పోర్టు కొత్త రికార్డు

విశాఖ పోర్టు ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో లాభాల బాటలో నడిచేవి తగ్గిపోతున్న నేపథ్యంలో విశాఖ పోర్టు వాటికి భిన్నంగా తనదైన మార్క్ తో ఎత్తున నిలబడింది.

By:  Satya P   |   13 March 2026 8:31 AM IST
విశాఖ పోర్టు కొత్త రికార్డు
X

విశాఖ పోర్టు ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో లాభాల బాటలో నడిచేవి తగ్గిపోతున్న నేపథ్యంలో విశాఖ పోర్టు వాటికి భిన్నంగా తనదైన మార్క్ తో ఎత్తున నిలబడింది. సరకు రవాణాలో విశాఖ పోర్టు రేర్ ఫీట్ నే సాధించింది. ఆ కొత్త రికార్డుతో తనకు సాటి తానే అని పోర్టు గర్వంగా తలెత్తుకుని నిలబడింది.

చరిత్రలో ఫస్ట్ టైం :

ఇక విశాఖ పోర్టు సాధించిన ఈ రికార్డు చూస్తే అదుర్స్ అనిపించేలా ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అంటే 2025-2026లో మొత్తం ఇప్పటిదాకా 345 రోజులకు గానూ 85 మిలియన్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసింది. నిజంగా ఇది గ్రేట్ అని పోర్టు వర్గాలు అంటున్నారు. విశాఖ పోర్టు 1933లో ఏర్పాటు అయింది.ఎస్ ఎస్ జలదుర్గ నౌక వచ్చినప్పుడు తన కార్యకలాపాలను విశాఖ పోర్టు ప్రారంభించింది. ఇక అదే ఏడాది డిసెంబర్ 19, నాటి వైస్రాయ్ లార్డ్ విల్లింగ్డన్ చేత అధికారికంగా ఈ పోర్టు ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు ఒక చిన్న ఓడరేవుగా ప్రారంభమై ఈ రోజున 31 బెర్త్‌లతో ఒక ప్రధాన బహుళ-కార్గో ఓడరేవుగా అభివృద్ధి చెందింది. అంతే కాదు రికార్డులను సైతం బద్ధలు కొడుతోంది. ఇప్పటిదాకా పోర్టు చేసిన కార్గో హ్యాండిల్ అంతా ఒక ఎత్తు. కేవలం ఈ ఒక్క ఏడాది చేసినదే ఒక ఎత్తు అని అంటున్నారు.

ఇంకా టార్గెట్ ఉంది :

మార్చి నెలలో కేవలం 12 రోజులే గడిచాయి. ఇంకా 19 రోజులు ఉన్నాయి. దాంతో తాము 85 మిలియన్ టన్నులను కదు దానిని 90 మిలియన్ టన్నులకు పెంచుతామని అది శాశ్వతమైన చెరగని రికార్డుగా ఉంటుందని పోర్టు చైర్మన్ అంగముత్తు అంటున్నారు. అంతే కాదు తమ రికర్డులు తామే బద్ధలు కొడతామని 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా వంద మిలియన్ టన్నుల కారోని హ్యాండిల్ చేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వందేళ్ళకు చేరువ అవుతున్న విశాఖ పోర్టు అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం రియల్లీ గ్రేట్ అనే అంతా అంటున్నారు. సో కీప్ ఇట్ అప్ అన్నదే అందరి మాటగా ఉంది.