Begin typing your search above and press return to search.

నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. అసలేం జరిగిందంటే..!

భార్య, భర్తల మధ్య ఉన్న వైవాహిక బంధంలో మనస్పర్ధలు, మాట పట్టింపులు ఎంతో సహజమని అంటారు.

By:  Raja Ch   |   1 Aug 2025 10:50 AM IST
నిద్రిస్తున్న భర్తపై  వేడి నీళ్లు పోసిన భార్య.. అసలేం జరిగిందంటే..!
X

భార్య, భర్తల మధ్య ఉన్న వైవాహిక బంధంలో మనస్పర్ధలు, మాట పట్టింపులు ఎంతో సహజమని అంటారు. చిన్న చిన్న గొడవలు కామన్ అని చెబుతారు. ఒకే తల్లికి పుట్టినవారి మధ్యే ఎన్నో సమస్యలు వస్తున్న వేళ.. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వివాహ బంధంతో ఒకటైనవారి మధ్య మనస్పర్ధలు సహజం! కాకపోతే ఈ విషయంలో ఎవరొకరు తగ్గాలని అంటారు.. సర్ధుకుపోవాలని చెబుతారు.. ఒకప్పుడు అలానే ఉండేవారు!

అయితే ఇటీవల కాలంలో మాత్రం దంపతుల మధ్య వచ్చిన విభేదాలు హత్యాయత్నాలకు, హత్యలకు, ఆత్మహత్యలకు కారణాలవుతున్న పరిస్థితి. ఇటీవల ప్రియుడి మాయలో పడి భర్తలను హతమార్చిన భార్యామణుల కథలు ఎన్నో తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో... భర్త నిద్రపోతున్న సమయంతో అతనిపై సలసల మరిగే వేడి నీళ్లు పోసేసిన భార్య కథ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆ భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అవును... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఒకరిపై ఒకరు మనసు పడేసుకున్నారు.. ఈ క్రమంలో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని పెళ్లి చేసుకున్నారు. కానీ.. పెళ్లైన కొన్నాళ్లకే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏమి జరిగిందో తెలియదు కానీ... భర్త నిద్రపోతున్న సమయంతో అతనిపై సలసల మరిగే వేడి నీళ్లు పోసేసింది భార్య. దీంతో అతను తీవ్ర గాయాలపాలై.. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... నందిక కృష్ణ, గౌతమి దంపతులు ఆరేళ్ల ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో... విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలై.. అవి కాస్తా చినికి చినికి గాలివానగా మారి.. ఇరువురి మధ్య తీవ్ర విభేదాలకు దాతి తీశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో గౌతమి కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా... బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త కృష్ణ నిద్రలో ఉండగా సలసల మరిగే వేడి నీళ్లు పోసింది. దీంతో... కృష్ణ తీవ్రంగా కాలిపోయాడు! వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా... గతంలో కూడా ఈ తరహా ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన సత్యవతి.. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపాన్ని భర్తపై చూపించింది. ఇందులో భాగంగా.. అర్ధరాత్రి భర్త నిద్రపోతుండగా సత్యవతి వేడి నూనె ముఖంపై పోసింది.. ఈ ఘటన 2021లో జరిగింది.

ఇదే క్రమంలో... గత ఏడాది తమిళనాడులో ప్రియుడితో మాట్లాడుతుండగా భర్త మందలించాడని భార్య కక్ష పెంచుకుంది! ఈ క్రమంలో... మరుగుతున్న వేడినీటిని భర్తపై పోసింది. దీంతో... తీవ్రంగా గాయపడిన అతడిని ఇరుగుపొరుగువారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.